Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kaikala Satyanarayana: సీనియర్ నటుడు కైకాలకు స్వల్ప అస్వస్థత.. చికిత్స కోసం ప్రైవేట్ ఆస్పత్రిలో చేరిక

Kaikala Satyanarayana Hospitalised: సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఆయన్ని కుటుంబ సభ్యులు..

Kaikala Satyanarayana: సీనియర్ నటుడు కైకాలకు స్వల్ప అస్వస్థత.. చికిత్స కోసం ప్రైవేట్ ఆస్పత్రిలో చేరిక
Kaikala Satyanarayana
Follow us
Surya Kala

|

Updated on: Oct 31, 2021 | 11:12 AM

Kaikala Satyanarayana Hospitalised: సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఆయన్ని కుటుంబ సభ్యులు సికింద్రాబాద్ లోని ఓ ప్రయివేట్ ఆస్పత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. గత నాలుగు రోజుల క్రితం ఇంట్లో జారిపడిన కైకాల… నొప్పులు తీవ్రమవ్వడంతో ఆస్పత్రిలో చేరినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని.. కంగారు పడాల్సిన పనిలేదని వైద్య సిబ్బంది తెలిపారు.

కైకాల సత్యనారాయణ తెలుగు చలన చిత్ర పరిశ్రమలో తనదైన నటనతో ఓ పేజీని లిఖించుకున్న సీనియర్ నటుడు. 1959 లో సిపాయి కూతురు అనే చిత్రంతో సినిమాల్లో అడుగు పెట్టారు. గత 60 ఏళ్లుగా సినీ రంగంలో ఉన్న కైకాల సుమారు 777 సినిమాల్లో వివిధ పాత్రల్లో నటించారు. పౌరాణిక, సాంఘిక, చారిత్రక, జానపద చిత్రాల్లో హాస్య, విలన్, హీరో, తండ్రి, తాత ఇలా అనేక రకాల పాత్రల్లో నటించి.. ఓడిపోయారు. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఎస్వీఆర్ తర్వాత అటువంటి వైవిధ్య పాత్రలను పోషించింది కైకాల మాత్రమే.. అందుకనే కైకాలను నవరస నట సార్వభౌమ అని పిలుస్తారు. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం కౌతరం గ్రామంలో 1935 జూలై 25న కైకాల జన్మించారు. 1960లో సత్యనారాయణ నాగేశ్వరమ్మని పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు ఇద్దరు కూతుళ్ళు, ఇద్దరు కొడుకులు.

Also Read: యాక్టర్ సంపత్‌ను బాహుబలి కాజాతో సత్కరించిన మడతకాజా మాతృ సంస్థ..

 ఒత్తిడిలో తీసుకున్న నిర్ణయాలు మనమేంటో తెలియజేస్తాయి.. ఆసక్తికర పోస్ట్ చేసిన సమంత..

ముగిసిన పునీత్ అంత్యక్రియలు.. కుటుంబ సభ్యులు, సినీ, రాజకీయ ప్రముఖులు కన్నీటి వీడ్కోలు