Diabetes: ఇది తినడం వల్ల డయాబెటిస్‌ వస్తుందా..? వైద్య నిపుణులు ఏమంటున్నారు..?

Diabetes: ప్రస్తుతం డయాబెటిస్‌ చాలా మందిని వెంటాడుతోంది. రోజురోజుకు షుగర్‌ వ్యాధిగ్రస్తుల సంఖ్య పెరిగిపోతోంది. ఈ వ్యాధి ఒక్కసారి వచ్చిందంటే చాలు అదుపులో..

Diabetes: ఇది తినడం వల్ల డయాబెటిస్‌ వస్తుందా..? వైద్య నిపుణులు ఏమంటున్నారు..?
Diabetes
Follow us
Subhash Goud

| Edited By: Ravi Kiran

Updated on: Nov 03, 2021 | 6:37 AM

Diabetes: ప్రస్తుతం డయాబెటిస్‌ చాలా మందిని వెంటాడుతోంది. రోజురోజుకు షుగర్‌ వ్యాధిగ్రస్తుల సంఖ్య పెరిగిపోతోంది. ఈ వ్యాధి ఒక్కసారి వచ్చిందంటే చాలు అదుపులో ఉంచుకోవడం తప్ప.. పూర్తిగా తగ్గిపోయేదేమి ఉండదు. మధుమేహం ఉన్నవారు ఆహార నియమాలు చాలా పాటించాల్సి ఉంటుంది. లేకపోతే షుగర్‌ లెవల్స్‌ పెరిగిపోయి మరింత ఆనారోగ్యం బారిన పడే ప్రమాదం ఉంది. అసలు మధుమేహం ఎలా వస్తుంది..? చక్కెర ఎక్కువగా తింటే వస్తుందా..? దీనిపై అనేక అనుమానాలు వ్యక్తం చేస్తుంటారు కొందరు. వైద్య నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం..

చక్కెర ఎక్కువగా తినడం మంచిదేనా..? చక్కెర ఎక్కవగా తీసుకోవడం, జంక్‌ ఫుడ్డు ఎక్కువగా తీసుకోవడం వల్ల షుగర్‌ వ్యాధి వస్తుందంటుంటారు. కానీ అవి నేరుగా డయాబెటిస్‌కు కారణం కావని నిపుణులు చెబుతున్నారు. తీపి ఎక్కువగా ఉన్న పదార్థాలు తినడం వల్ల డయాబెటిస్‌ వస్తుందనడంలో ఎలాంటి నిజం లేదంటున్నారు. శరీరంలో ఇన్సూలిన్‌ ఉత్పత్తి తగ్గిపోతుందో అప్పుడు డయాబెటిస్‌ బారిన పడతారు. ఈ వ్యాధి ఊబకాయంతోపాటు వంశపారంపర్యంగా కూడా రావడానికి ప్రధాన కారణమంటున్నారు నిపుణులు.

డయాబెటిస్‌ ఉన్నవారు తీపి తినవచ్చా..? డయాబెటిస్‌ ఉన్నవారు చక్కెరను ఎప్పుడు కూడా చక్కెరకు దూరంగా ఉండాలన్నది అపోహా మాత్రమేనని వైద్య నిపుణులు చెబుతున్నారు. స్వీట్లు, కుకీలలో పిండి పదార్థాలు ఉన్నందున డయాబెటిస్‌ రోగులు వారి రక్తంలో గ్లూకోజ్‌ స్థాయిలను అదుపులో ఉంచేందుకు సహాయపడుతుంది. కార్పోహైడ్రేట్‌ అధికంగా ఉండే ఆహారం స్థానంలో ఒక చిన్నపాటి కేక్‌ ముక్కను తీసుకోవచ్చంటున్నారు.

డయాబెటిస్‌ మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుందా..? మధుమేహం ఉన్నవారిలో భావోద్వేగాలు ఎక్కువగా ఉంటాయి. త్వరగా కోపానికి, డిప్రెషన్‌కు గురవతుంటారు. ఎప్పుడు చూసినా ఏదో టెన్షన్‌లాగా కనిపిస్తుంటారు. అంతేకాదు రక్తంలో గ్లూకోజ్‌ లెవల్స్‌ పదేపదే చెక్‌ చేయడం వల్ల కూడా ఒత్తిడి గురవుతుంటారు.

గర్భధారణ సమయంలో.. సాధారణంగా గర్భధారణ సమయంలో కొంత మంది మహిళల్లో ఇన్సూలిన్‌ తగ్గిపోతుంది. దీంతో వారిలో షుగర్‌ లెవల్స్‌ పెరిగిపోతాయి. దీంతో పుట్టబోయే బిడ్డకు కూడా మధుమేహం వస్తుందేమోనని అనుకుంటారు. అలాంటి సమయంలో వైద్యులను సంప్రదించి సరైన చికిత్స తీసుకుంటే ఎలాంటి సమస్య ఉండదు. రక్తంలో అధిక షుగర్‌ లెవల్స్‌ కారణంగా పుట్టబోయే బిడ్డలో కావాల్సిన దానికంటే ఇన్సులిన్‌ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. దీని వల్ల పుట్టబోయే బిడ్డలో అధిక బరువు, ఊబకాయం, టైప్‌-2 డయాబెటిస్‌, ఇతర సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. అందుకే ముందుగానే వైద్యులను సంప్రదించడం మంచిది.

► ఆరోగ్యకరమైన కార్బోహైడ్రేట్ ఆహారాలు తినండి. కార్బోహైడ్రేట్లు ఉండే పదార్థాలు మన చక్కెర స్థాయిని ప్రభావితం చేస్తాయి. అందుకే ఆరోగ్యకరమైన కార్బోహైడ్రేట్‌లను ఏయే వస్తువులు కలిగి ఉన్నాయో తెలుసుకోవడం చాలా ముఖ్యం. పిండి పదార్థాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

► తక్కువ ఉప్పు తినండి: ఎక్కువ మొత్తంలో ఉప్పు తినడం వల్ల రక్తపోటు వచ్చే ప్రమాదం ఉంది. దీని కారణంగా గుండె జబ్బులు, పక్షవాతం వచ్చే ప్రమాదం పెరుగుతుంది. అందుకే ఉప్పును తక్కువ తీసుకోవడం మంచిది.

► పండ్లు మరియు కూరగాయలు ఎక్కువగా తినండి: ఈ వ్యాధి ఉన్నవారు ఫైబర్, విటమిన్లు మరియు ఖనిజాలు వంటి వాటికి పోషకాలుగా పనిచేసే పండ్లు, కూరగాయలను ఎక్కువగా తినండి.

►ఆరోగ్యకరమైన కొవ్వు పదార్థాలను ఎంచుకోండి: మనందరం మన రోజువారీ దినచర్యలో ఆరోగ్యకరమైన కొవ్వు పదార్థాలను చేర్చాలి. ఇది ఎంతో శక్తిని ఇస్తుంది. ఆరోగ్యకరమైన కొవ్వులలో విత్తనాలు, ఉప్పు లేని గింజలు, అవోకాడోలు, చేపలు, పొద్దుతిరుగుడు నూనె, ఆలివ్ నూనె ఉన్నాయి.

► ఆల్కహాల్ తాగడం మానుకోండి: మధుమేహం ఉన్నవారు ఆల్కహాల్ తాగడం మానుకోవాలి. ఇది డయాబెటిక్ రోగులకు హానికరం. ఇది చక్కెర స్థాయిని పెంచుతుంది. దీని వలన ఇతర వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది.

► ఆహారంలో ఖనిజాలు, విటమిన్‌ పదార్థాలు చేర్చండి: ఆహారంలో విటమిన్లు, ఖనిజాలు అధికంగా ఉండే పదార్థాలను తీసుకోవడం మంచిది. ఈ పదార్థాలు మిమ్మల్ని శారీరకంగా చురుకుగా ఉంచేందుకు ఉపయోగపడతాయి. మధుమేహాన్ని నియంత్రించడంలో సహాయపడతాయి. ఇవే కాకుండా గుండె సంబంధిత వ్యాధుల నుంచి కాపాడుతాయి.

నోట్‌: నోట్‌: ఇందులో ఉన్న అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. వైద్య నిపుణుల వివరాల ప్రకారం సూచనలు, సలహాలు అందించడం జరుగుతుంది. ఏదైనా సమస్య ఉన్నా.. ముందుగా వైద్యులను సంప్రదించడం మంచిది. వారి సూచనలు, సలహాలు పాటించండి.

ఇవి కూడా చదవండి:

Winter Heart Attack: శీతాకాలంలో గుండెపోటు అధికం.. నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి..!

Heart Disease: మీకు రోజు జిమ్‌ చేసే అలవాటు ఉందా..? ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోండి..!

Heart Attack: గుండెపోటుకు ముందు కనిపించే లక్షణాలు.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..? నిపుణులు ఏమంటున్నారు..?

Turmeric Benefits: పసుపు క్యాన్సన్‌ నివారణకు ఉపయోగపడుతుందా..? పరిశోధనలలో కీలక అంశాలు వెల్లడి..!

ఇన్నాళ్లు సహించా.. ఇక నా విశ్వరూపం చూపిస్తా.! సాయి పల్లవి సీరియస్
ఇన్నాళ్లు సహించా.. ఇక నా విశ్వరూపం చూపిస్తా.! సాయి పల్లవి సీరియస్
ఈ సీన్ తిరుమలలో తప్ప ఇంకెక్కడా చూడలేరు.! వీడియో వైరల్..
ఈ సీన్ తిరుమలలో తప్ప ఇంకెక్కడా చూడలేరు.! వీడియో వైరల్..
అమ్మవారి కోసం తపస్సు.. ప్రత్యక్షం కాకపోవడంతో ఎంతపని చేసాడంటే.!
అమ్మవారి కోసం తపస్సు.. ప్రత్యక్షం కాకపోవడంతో ఎంతపని చేసాడంటే.!
అదిరిపోయే బెనిఫిట్స్‌.. జియో న్యూ ఇయర్ ప్లాన్‌.! వీడియో..
అదిరిపోయే బెనిఫిట్స్‌.. జియో న్యూ ఇయర్ ప్లాన్‌.! వీడియో..
ఆకస్మిక మరణాలకు కోవిడ్ వ్యాక్సిన్ కారణమా.? వీడియో..
ఆకస్మిక మరణాలకు కోవిడ్ వ్యాక్సిన్ కారణమా.? వీడియో..
క్లాసులో ఇదేం పని మాస్టారు.! తిట్టిపోస్తున్న నెటిజన్లు.! వీడియో.
క్లాసులో ఇదేం పని మాస్టారు.! తిట్టిపోస్తున్న నెటిజన్లు.! వీడియో.
ఎప్పటికీ నువ్వే నా స్పూర్తి.! నేను ఎప్పటికీ మీ అభిమానినే అంటూ..
ఎప్పటికీ నువ్వే నా స్పూర్తి.! నేను ఎప్పటికీ మీ అభిమానినే అంటూ..
అందరూ ఇంటికి వచ్చారు సరే మరి NTR, చరణ్‌? | పెరుగుతున్న పుష్ప 2..
అందరూ ఇంటికి వచ్చారు సరే మరి NTR, చరణ్‌? | పెరుగుతున్న పుష్ప 2..
అది.. పవన్ రేంజ్.! గూగుల్ ట్రేండింగ్ లో పవన్ హవా.. బద్దలైన గూగుల్
అది.. పవన్ రేంజ్.! గూగుల్ ట్రేండింగ్ లో పవన్ హవా.. బద్దలైన గూగుల్
ఓరుగల్లు అబ్బాయి.. ఇటలీ అమ్మాయి స్టెప్స్ మీరు చూడాల్సిందే...
ఓరుగల్లు అబ్బాయి.. ఇటలీ అమ్మాయి స్టెప్స్ మీరు చూడాల్సిందే...