Health News: ఈ ఫుడ్ తింటున్నారా జాగ్రత్త..! పెద్దపేగు ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం..
Health News: చెడ్డ ఆహారం తినడం వల్ల శరీరం అనేక వ్యాధులకు గురవుతుంది. ఇందులో ఒకటి పెద్దపేగు ఇన్ఫెక్షన్. జంక్‌ఫుడ్, శుభ్రంగా లేని నీరు తాగడం వల్ల ఈ ఇన్ఫెక్షన్
Health News: చెడ్డ ఆహారం తినడం వల్ల శరీరం అనేక వ్యాధులకు గురవుతుంది. ఇందులో ఒకటి పెద్దపేగు ఇన్ఫెక్షన్. జంక్‌ఫుడ్, శుభ్రంగా లేని నీరు తాగడం వల్ల ఈ ఇన్ఫెక్షన్ ఏర్పడుతుంది. అలాంటప్పుడు సమయానికి వైద్యుడిని సంప్రదించకపోతే అది క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధికి దారి తీస్తుంది. ఎలాంటి పొట్ట సమస్యను కూడా తేలికగా తీసుకోవద్దని వైద్యులు సూచిస్తున్నారు. పెద్దప్రేగు మన శరీరంలోని జీర్ణవ్యవస్థలో ఒక భాగం. ఆహారం జీర్ణమైన తర్వాత శరీరంలోని వ్యర్థ పదార్థాలు మలం రూపంలో బయటకు వస్తాయి.
కానీ కొన్నిసార్లు ఈ వ్యర్థాలు పూర్తిగా తొలగిపోవు. పెద్ద ప్రేగులోనే పేరుకుపోతాయి. ఇది క్రమంగా శరీరానికి హాని కలిగిస్తుంది. పెద్దప్రేగు ఇన్ఫెక్షన్‌కు దారితీస్తుంది. సాధారణంగా ఈ ఇన్ఫెక్షన్ చెడ్డ ఆహారం, తాగునీరు శుభ్రంగా లేకపోవడం వల్ల వస్తుంది. అంతేకాదు జీర్ణం కావడానికి ఆలస్యమయ్యే ఆహారం కూడా కారణమవుతుంది. ఈ వ్యాధి లక్షణాలు కనిపిస్తే మాత్రం వెంటనే డాక్టర్ వద్దకు వెళ్లాలి.
ఇవి లక్షణాలు 1. నిరంతర విరేచనాలు 2. బలహీనత లేదా అలసట 3. బరువు తగ్గడం 4. కడుపు నొప్పి
ఇలా జాగ్రత్త పడండి పెద్దప్రేగు ఇన్ఫెక్షన్ నుంచి రక్షించడానికి ప్రజలు జంక్ ఫుడ్ తినకుండా ఉండటం అవసరం. ఫైబర్ అధికంగా ఉండే ఆహారాన్ని తినాలి. ఇలా చేయడం వల్ల జీర్ణవ్యవస్థ చక్కగా పనిచేస్తుంది. ఇది కాకుండా తగినంత నీరు తీసుకోవాలి. దీనితో పాటు నిమ్మరసం, కొబ్బరి నీరు, పెరుగు వంటి అనేక రకాల పానీయాలను క్రమం తప్పకుండా తీసుకుంటూ ఉండాలి. ఉదయం నిద్రలేచిన తర్వాత కనీసం రెండు గ్లాసుల గోరువెచ్చని నీరు తాగాలి. తద్వారా పొట్టను శుభ్రం చేసుకోవచ్చు. జీర్ణక్రియను మెరుగుపరచడానికి క్రమం తప్పకుండా ప్రాణాయామం చేయాలి.