Winter Health Tips: ముక్కు దిబ్బడ, నోటి పూత వంటి వాటికి నిమ్మరసం, మిరియాలు, ఉప్పుతో చెక్ పెట్టండి ఇలా..

Winter Season Health Tips: శీతాకాలంలో సీజనల్ వ్యాధులు విజృభిస్తుంటాయి. ముఖ్యంగా చిన్న, పెద్ద వయసుతో సంబంధం లేకుండా జలుబు, దగ్గు వంటి..

Winter Health Tips: ముక్కు దిబ్బడ, నోటి పూత వంటి వాటికి నిమ్మరసం, మిరియాలు, ఉప్పుతో చెక్ పెట్టండి ఇలా..
Health Tips
Follow us
Surya Kala

|

Updated on: Nov 03, 2021 | 8:03 AM

Winter Season Health Tips: శీతాకాలంలో సీజనల్ వ్యాధులు విజృభిస్తుంటాయి. ముఖ్యంగా చిన్న, పెద్ద వయసుతో సంబంధం లేకుండా జలుబు, దగ్గు వంటి వాటితో ఇబ్బందులు పడుతుంటారు. అయితే ప్రతి చిన్న చిన్న వాటికి మెడిసిన్స్ ని వాడకూడదని.. సహజమైన ఆహారపదార్ధాలతో నివారించుకోవచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా వంటింటిలో ఉపయోగించే మిరియాలు, ఉప్పు,  నిమ్మకాయ వంటి వాటితో సీజనల్ వ్యాధుల నుంచి ఉపశమనం పొందవచ్చు.  వంటింట్లో మనకు రోజు అందుబాటులో ఉండే నల్ల మిరియాలు, నిమ్మకాయ, కళ్ళ ఉప్పు ఏఏ వ్యాధుల నుంచి ఉపశమనం ఇస్తుందో తెలుసుకుందాం..

*బరువు తగ్గాలనుకునేవారికి మంచి ఛాయస్..  ఒక గ్లాస్ గోరువెచ్చటి నీటిలో పావు స్పూన్ నల్లమిర్యాల పొడి, ఒక నిమ్మకాయ రసం, ఒక స్పూన్ తేనే వేసుకుని.. రోజూ ఉదయం పరగడుపున తాగితే.. జీవ క్రియ వేగవంతం చేస్తుంది. నిమ్మకాయలో ఉన్న పోలిఫెనోల్స్ శరీరంలోని అధికంగా ఉన్న బరువుని అదుపు చేస్తుంది.

* గొంతు నొప్పితో ఇబ్బందిపడేవారు గోరు వెచ్చటి నీటిలో ఒక స్పూను నిమ్మరసం, అరస్పూను నల్ల మిరియాల పొడి, ఒక స్పూన్లు సముద్రం ఉప్పు వేసి.. కలపాలి. ఈ మిశ్రమాన్ని గార్లిక్ చేస్తుంటే.. గొంతు నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది.

*ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడుతుంటే.. జలుబు చేసి.. ముక్కు దిబ్బడ వేసి..ఇబ్బంది పడుతుంటే.. దాల్చిన చెక్క పొడి, మిరియాల పొడి, జీలకర్ర, పొడి, యాలకుల పొడి .. వీటిని సమానంగా తీసుకుని మిక్స్ చేయాలి. ఈ పొడిని ముక్కు దగ్గరగా పెట్టుకుని పీల్చితే.. తుమ్ములు వచ్చి రిలాక్స్ కలుగుతుంది.

*నోటిలో పుండ్లు, నోటి పూతతో బాధపడేవారు ఒక గ్లాస్ గోరు వెచ్చటి నీరు తీసుకుని దానిలో కళ్ళ ఉప్పు వేసుకుని నోటిలో వేసుకుని పుక్కిలిస్తే.. మంచి ఉపశమనం లభిస్తుంది. నోట్లో ఉన్న చెడ్డ బ్యాక్టీరియా తొలగి.. నోటి పూత త్వరగా నయం అవుతుంది.

*కొంతమందిలో పిత్తాశయంలో రాళ్లు ఏర్పడి.. తీవ్రంగా ఇబ్బంది పడతారు. అటువంటివారి జీర్ణ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది పిత్తాశయంలో రాళ్లు. అయితే కొంతమందిని వీటిని ఆపరేషన్ చేయించుకుని తొలగించుకుంటారు. అయితే పిత్తాశయంలో రాళ్లను సహజంగా నివారించుకోవచ్చు.. ఒక స్పూను నిమ్మరసం, ఒక కళ్ళ ఉప్పు, ఒక మిరియాల పొడిని ఆలివ్ ఆయిల్ వేసుకుని కలిపి.. ఈ మిశ్రమాన్ని ఒక కొన్ని రోజుల పాటు తీసుకుంటే పిత్తాశయంలోని రాళ్లు సహజంగానే కరుగుతాయి.

*జలుబు, ఫ్లూ వంటి వాటితో ఇబ్బంది పడుతుంటే ఒక కప్పు వేడి నీటిలో సగం నిమ్మకాయను పిండండి. అందులో నిమ్మ గుజ్జు, పై తొక్క వేసి ఉంచండి. తర్వాత నిమ్మ తొక్క నీటి నుంచి తీసి.. ఆ మిశ్రమంలో 1 టీస్పూన్ తేనె , చిటికెడు నల్ల మిరియాలు జోడించాలి. ఈ జ్యుస్ ని రోజుకు రోజుకు 2-3 సార్లు తాగితే జలుబు, ఫ్లూ వంటి వాటితో ఉపశమనం లభిస్తుంది.

*పంటి నొప్పితో బాధపడేవారు ఒక అర టీస్పూన్ మిరియాల పొడి, ఒక అర టీస్పూన్ లవంగం నూనెతో కలపండి. ఈ మిశ్రమాన్ని నొప్పి ఉన్న పళ్లకు, చిగుళ్లకు అప్లై చేయండి. ఈ మిశ్రమం నోటి ఇన్ఫెక్షన్ల నుండి  రక్షించడంలో సహాయపడుతుంది.

*కడుపు నొప్పిని తగ్గించడానికి, 1 టేబుల్ స్పూన్ తాజా నిమ్మరసం,  ఒక టీస్పూన్ నల్ల మిరియాలు ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో కలపండి. వికారం , కడుపు నొప్పి నుంచి ఈ మిశ్రమం ఉపశమనం లభిస్తుంది.

భారతీయ సాంప్రదాయ వంటల్లో పూర్వకాలం నుంచి భాగమైన మిరియాలు, సముద్రం ఉప్పు, నిమ్మకాయలు కరోనా వైరస్ వెలుగులోకి వచ్చిన తర్వాత.. వీటిని ప్రపంచ వ్యాప్తంగా ఉపయోగిస్తున్న సంగతి తెలిసిందే.

Also Read:

కరోనా పుట్టినిల్లు చైనాలో మళ్ళీ పెరుగుతున్న కోవిడ్ .. లాక్ డౌన్ దిశగా అడుగులు.. నిత్యవసర వస్తువులు నిల్వ చేసుకోవాలని సూచన

భూ రికార్డులు, సర్వే అసిస్టెంట్ డైరెక్టర్ ఏసీబీ అధికారులు సోదాలు.. భారీగా నగదు, అక్రమాస్తులు గుర్తింపు