ACB Raids: భూ రికార్డులు, సర్వే అసిస్టెంట్ డైరెక్టర్ ఏసీబీ అధికారులు సోదాలు.. భారీగా నగదు, అక్రమాస్తులు గుర్తింపు
ACB Raids: లంచం తీసుకుంటూ సోమవారం పట్టుబడిన సంగారెడ్డి సర్వే ల్యాండ్ రికార్డ్స్ అసిస్టెంట్ డైరెక్టర్ మధుసూదన్ ఇంట్లో ఏసీబీ అధికారులు ఇంకా..
ACB Raids: లంచం తీసుకుంటూ సోమవారం పట్టుబడిన సంగారెడ్డి సర్వే ల్యాండ్ రికార్డ్స్ అసిస్టెంట్ డైరెక్టర్ మధుసూదన్ ఇంట్లో ఏసీబీ అధికారులు ఇంకా సోదాలు చేస్తూనే ఉన్నారు. నిన్న ఓ వ్యక్తికి భూ సర్వే చేసి డాక్యుమెంట్లు అందించేందుకు రూ. 20 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు మధుసూదన్ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడిన సంగతి తెలిసిందే. దీంతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయనే ఆరోపణలతో మధుసూదన్ కు చెందిన ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్నారు.
ఉప్పల్లోని ఆదర్శ్ నగర్లో మధుసూదన్ కు చెందిన ఇళ్లలో అధికారులు తనిఖీ చేశారు. ఈ సోదాల్లో మధుసూదన్ ఇంట్లో భారీగా నగదు, అక్రమాస్తులను ఏసీబీ అధికారులు గుర్తించారు. కోటి 3లక్షల నగదు, 314 గ్రాముల బంగారు ఆభరణాలు, 90 లక్షల విలువైన భూపత్రాలు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం మధుసూదన్అ పై అధికారులు ఆదాయానికి మించిన ఆస్తులున్నాయని కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది.