Chilkur Balaji Temple: భక్తులకు అలర్ట్.. చిలుకూరు బాలాజీ ఆలయ దర్శన వేళల్లో మార్పులు.. వెల్లడించిన ఆలయ అర్చకులు
Chilkur Balaji Temple: గత ఏడాదికిపైగా కరోనా మహమ్మారి అతలాకుతలం చేయడంతో అన్ని రంగాలతో పాటు ఆలయాలు కూడా మూతపడిన విషయం తెలిసిందే..
Chilkur Balaji Temple: గత ఏడాదికిపైగా కరోనా మహమ్మారి అతలాకుతలం చేయడంతో అన్ని రంగాలతో పాటు ఆలయాలు కూడా మూతపడిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టడంతో అన్ని ఆలయాలు కూడా తెరుచుకున్నాయి. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ భక్తులకు దర్శనాలను కల్పిస్తున్నారు ఆలయ అధికారులు. కోవిడ్ నేపథ్యంలో ఆలయ దర్శనాల వేళలు కూడా మార్పులు చేశారు. ఇందులో భాగంగ చిలుకూరు బాలాజీ ఆలయం దర్శన వేళల్లో మార్పులు చేసినట్లు ఆలయ అర్చకుడు రంగరాజన్ తెలిపారు. కరోనా నేపథ్యంలో ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు, తిరిగి సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు భక్తులకు దర్శనానికి అనుమతి ఇస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఆలయానికి వచ్చే భక్తులు దర్శన సమయాల్లో చేసిన కొత్త మార్పులను గమనించాలని కోరారు. దర్శనాలకు వచ్చే భక్తులు కరోనా నిబంధనలు పాటించాలని ఆయన సూచించారు.
ఇదిలా ఉండగా, గూగుల్‌లో ప్రస్తుతం చూపిస్తున్న సమయ వేళల్లో తేడా ఉన్నట్లు తెలిపారు. గూగుల్‌లో చూపించే సమయ వేళలను అనుసరించవద్దని, ఈ విషయంపై గూగుల్‌ను సంప్రదించామని, అయినా సమయాల్లో మార్పులు చేయలేదన్నారు. కోవిడ్ పూర్తి స్థాయిలో అదుపులోకి వచ్చే వరకు ఈ సమయ వేళలు కొనసాగుతాయని ఆయన వివరించారు.
కాగా, కరోనా కారణంగా చాలా ఆలయాల్లో సమయ వేళల్లో మార్పులు చేశారు. కరోనా నిబంధనలు పాటిస్తూ భక్తులకు దర్శనాలు కల్పిస్తున్నారు. ఆలయానికి వెళ్లే భక్తులు మాస్క్ తప్పనిసరిగా ఉండాలని ఆలయ అధికారులు సూచిస్తున్నారు.
ఇవి కూడా చదవండి: