Diwali 2021: బాణాసంచా కాల్చే సమయంలో కంటి రక్షణ కోసం తీసుకోవాలిన జాగ్రత్తలు.. మీకోసం..

Surya Kala

Surya Kala |

Updated on: Nov 02, 2021 | 6:32 PM

Diwali 2021: ప్రపంచవ్యాప్తంగా పండగ వేడుకలు, ఆనందాన్ని వ్యక్తం చేసేందుకు ముఖ్యంగా భారతదేశంలో దీపావళి పండగ సమయంలో బాణాసంచా..

Diwali 2021: బాణాసంచా కాల్చే సమయంలో కంటి రక్షణ కోసం తీసుకోవాలిన జాగ్రత్తలు.. మీకోసం..
Diwali 2021

Diwali 2021: ప్రపంచవ్యాప్తంగా పండగ వేడుకలు, ఆనందాన్ని వ్యక్తం చేసేందుకు ముఖ్యంగా భారతదేశంలో దీపావళి పండగ సమయంలో బాణాసంచా కాల్చుతుంటారు. కాని, సరైన జాగ్రత్త, పర్వవేక్షణ లేకుండా బాణసంచా కాల్చడం వలన చర్మం, కళ్లకు గాయాలు కావచ్చు. కంటికయ్యే గాయాలు దృష్టికి తీవ్రమైన, సరిదిద్దలేని నష్టాన్ని కలిగిస్తాయి. ప్రతి సంవత్సరం దీపావళి సందర్భంగా ఆసుపత్రుల్లో బాణసంచా గాయాలు అనేక రెట్లు పెరుగుతున్నాయి. క్రాకర్స్ కాల్చడంలో భద్రతా అవగాహన లేకపోవడం, కంటికి రక్షణ పరికరాలు ఉపయోగించకపోవడం ఈ గాయాలకు ప్రధాన కారణం.

దీపావళి సమయంలో ఎక్కువగా గాయపడే ప్రమాదం ఉన్నవారు బాధ్యతాయుతమైన పెద్దల పర్యవేక్షణకు దూరంగా ఉండే పిల్లలు. “చాలా కంటి గాయాలకు కారణం బాణసంచా పేలుళ్లు. సాధారణంగా రోగులు కళ్లలో ఏదో పడిందని, కంటి నొప్పి, చూపు తగ్గడం, కన్ను ఎర్రబడటం, నీళ్లు కారడం, ఫొటోసెన్సిటివిటీ లేదా ఫొటోఫోబియా వంటి సమస్యలు ఉన్నట్టు చెప్తారు. కంటికయ్యే అతి సాధారణ గాయాలలో హైఫెమా, కనురెప్పల గాయాలు, ట్రొమాటిక్ ఇరిడోడయాలసిస్, రెటీనల్‌ డిటాచ్‌మెంట్, కార్నియల్ రాపిడి వంటివి ఉంటాయి” అని తెలిపారు డాక్టర్ అగర్వాల్స్ ఐ హాస్పిటల్స్, హైదరాబాద్‌కు చెందిన సీనియర్‌ కన్సల్టెంట్‌ ఆప్తామాలజిస్ట్‌ డాక్టర్‌ భానుప్రకాశ్‌ మెటుకుల్‌. బాణసంచా పేలుళ్ల కారణంగా కనుపాప, కంటి ఉపరితలంపై రసాయన, థర్మల్‌ గాయాలు ఏర్పడవచ్చు. వీటి కారణంగా కార్నియల్ ఒపాసిటీ, అంధత్వం సంభవిస్తుంది. కొన్నిసార్లు లోపలి వరకు ఏర్పడే గాయాల కారణంగా కంటి లోపలి భాగం చిరిగిపోవడం లేదా, ఏదైనా వస్తువు కంటిలోపల పడటం జరుగుతుంది. వీటి కారణంగా సరిదిద్దలేని దృష్టి లోపం ఏర్పడవచ్చని తెలిపారు డాక్టర్ భానుప్రకాష్ మెటుకుల్.

కాబట్టి ఈ దీపావళికి, క్రాకర్లు కాల్చేటప్పుడు కళ్లకు తగిన రక్షణ పరికరాలు ధరించడం మర్చిపోకండి. అంతే కాదు పిల్లలను బాణాసంచా కాల్చనీయకపోవడమే మంచిది. ఒకవేళ వాళ్లు కాల్చుతామంటే కచ్చితంగా పెద్దల పర్యవేక్షణ ఉండాలి. “ఖాళీ ప్రదేశాల్లో ఇళ్లకు దూరంగా ఎండిన ఆకులు, లేదా గడ్డి, మండే స్వభావం కలిగిన పదార్ధాలు లేని చోట బాణాసంచా కాల్చడం మంచిది. అత్యవసర పరిస్థితుల కోసం అలాగే పేలకుండా లేదా అంటుకోకుండా ఉండిపోయిన బాణాసంచాపై నీళ్లు పోసేందుకు దగ్గరలో ఒక బకెట్‌లో నీళ్లు ఉంచుకోవాలి. కంటైనర్‌ ముఖ్యంగా గ్లాస్ లేదా మెటల్ కంటైనర్‌లో ఎప్పుడూ బాణసంచా కాల్చకండి. అలాగే సరిగా పని చేయని బాణసంచాలను మళ్లీ వెలిగించడానికి ఎప్పుడూ ప్రయత్నించవద్దు. వాటిని నీటిలో నానబెట్టి సురక్షితంగా పారవేయండి. బాణాసంచా కాల్చేటప్పుడు చూసే వాళ్లు కూడా ప్రమాదం బారిన పడవచ్చు. కాబట్టి, సరైన భద్రత సూచనలు అనుసరిస్తూ కనీసం 5 అడుగుల దూరం నుంచి చూడటం మంచిది” అని సూచిస్తున్నారు డాక్టర్ భానుప్రకాష్ మెటుకుల్.

ముఖ్యంగా నిల్చొబెట్టి కాల్చే రాకెట్లు, బాంబుల కారణంగా ఎక్కువ గాయాలవుతుంటాయి కాబట్టి వాటిని దూరం పెట్టాలి. అంతే కాదు ఏ మాత్రం హానికరం కానివని అనిపించే కాకరపూవ్వొత్తుల కారణంగా కూడా ప్రమాదాలు సంభవిస్తాయి. అవి 1093 డిగ్రీ సెల్సియస్‌ వేడిలో కాలుతూ ఉంటాయి కాబట్టి వాటి కారణంగా కంటికి తీవ్రగాయాలు అవడమే కాదు చూపు పోయే అవకాశం ఉంది.

కంటికి గాయాలు ఏర్పడకుండా చేయాల్సినవి, చేయకూడనివి: • డాక్టర్ సలహా లేకుండా ఎటువంటి ఐ డ్రాప్స్ ఉపయోగించవద్దు. • కళ్లు రుద్దకండి • కళ్లు శుభ్రం చేయవద్దు • కళ్లపై ఒత్తిడి పెట్టవద్దు • కంటిలో ఇరుక్కుపోయిన వస్తువులను తీసివేయవద్దు.

Also Read:  ప్రపంచంలోనే అతి పెద్దగుమ్మడి కాయ .. 17 మందికి సమానం దీని బరువు.. ఎక్కడంటే..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu