Giant Pumpkin: ప్రపంచంలోనే అతి పెద్దగుమ్మడి కాయ .. 17 మందికి సమానం దీని బరువు.. ఎక్కడంటే

Guinness World Record: పదేళ్ల క్రితం వరకు ది గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అని పిలవబడిన గిన్నీస్ ప్రపంచ రికార్డులు.. ప్రతి ఏడాది ముద్రిస్తున్న...

Giant Pumpkin: ప్రపంచంలోనే అతి పెద్దగుమ్మడి కాయ .. 17 మందికి సమానం దీని బరువు.. ఎక్కడంటే
Guinness World Record
Follow us
Surya Kala

|

Updated on: Nov 02, 2021 | 6:19 PM

Guinness World Record: పదేళ్ల క్రితం వరకు ది గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అని పిలవబడిన గిన్నీస్ ప్రపంచ రికార్డులు.. ప్రతి ఏడాది ముద్రిస్తున్న ఒక ప్రమాణిక పుస్తకం. ఈ పుస్తకంలో మానవులు సాధించిన ఘనవిజయాలు, ప్రకృతిలో జరిగే విపరీతాలను పొందుపరుస్తారు. తిండి తినడం, నిద్రపోవడం, పరిగెత్తడం ఇది అది అని కాదు.. అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన వాటిని ప్రపంచ రికార్డులుగా నమోదు చేస్తారు. గిన్నిస్‌ రికార్డ్స్‌గా దీంతో చాలా మంది గిన్నిస్‌ రికార్డ్స్‌లో స్థానం దక్కించుకోవటం కోసం రకరకాలుగా ప్రయత్నిస్తుంటారు. చాలామందిలాగే తాజాగా ఓ రైతు అతి పెద్ద గుమ్మడికాయ పండించి గిన్నిస్ రికార్డ్ లో చోటు దక్కించుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే..

టుస్కానీలోని చియాంటిలో రాడ్డాకు చెందిన స్టెఫానో కట్రుపి అనే రైతు పెద్ద పెద్ద గుమ్మడికాయలను పండిస్తుంటాడు. ఈ క్రమంలో అతని తోటలో పండిన అతి పెద్ద గుమ్మడికాయను సెప్టెంబర్ 26న పెక్సియోలీలో జరిగిన గుమ్మడికాయల పండుగలో ప్రదర్శనకు తీసుకు వచ్చాడు. ఈ గుమ్మడి కాయ ఉత్పత్తి, నాణ్యత పరంగా పోటీకి సరిపోతుందని గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ వెబ్‌సైట్‌ ధృవీకరించిందని తెలిపారు కట్రుపి. వాతావరణ నియంత్రణ అనేది అంకురోత్పత్తి నుండి పంట చేతికందేవరకూ ఎంతో కీలకమైన అంశమని కట్రుపి తెలిపారు. అంతేకాదు మొక్కలు ఆరోగ్యంగా పెరిగి, మంచి పంట రావాలంటే సమ శీతోష్ణ పరిస్థితులు కల్పించడం, షేడింగ్ చేయడం, మంచు తుడవడం, సమయానుసారంగా నీరు అందించడం వంటివి చాలా ముఖ్యమని చెప్పారు, ” ఇక కట్రుపి ప్రదర్శించిన ఈ గుమ్మడికాయ2020లో గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ వెబ్‌సైట్‌ ధృవీకరించిన బరువు, చుట్టుకొలతల్లో అతి పెద్ద జాక్‌ ఓలాంతర్న్‌ తర్వాత ఇదే నిలుస్తుందని స్పష్టం చేసినట్లు తెలిపారు.

Also Read:  మనిషిని పోలిన మనుషులు… అచ్చు సౌందర్యలా ఉన్న ఓ యువతి.. వీడియోలు సోషల్ మీడియాలో వైరల్..