Junior Soundarya: మనిషిని పోలిన మనుషులు… అచ్చు సౌందర్యలా ఉన్న ఓ యువతి.. వీడియోలు సోషల్ మీడియాలో వైరల్..

Junior Soundarya Photos: సనాతన ధర్మంలో మనిషిని పోలిన మనుషులు ప్రపంచంలో ఏడుగురు ఉంటారని నమ్మకం. ఇదే విషయం నిజమేమో అనిపించేలా..

Junior Soundarya: మనిషిని పోలిన మనుషులు... అచ్చు సౌందర్యలా ఉన్న ఓ యువతి.. వీడియోలు సోషల్ మీడియాలో వైరల్..
Jr Soundarya
Follow us
Surya Kala

|

Updated on: Nov 02, 2021 | 5:58 PM

Junior Soundarya Photos: సనాతన ధర్మంలో మనిషిని పోలిన మనుషులు ప్రపంచంలో ఏడుగురు ఉంటారని నమ్మకం. ఇదే విషయం నిజమేమో అనిపించేలా కొంతమందిని చూస్తుంటే.. వీళ్ళని ఎక్కడో చూశాం.. మనకు బాగా తెలిసినవారే అనిపిస్తారు. ఇక సినీ నటీనటులు, క్రికెటర్స్ పోలికలు ఉన్న మనుషులకు చెందిన ఫోటోలు తరచుగా చూస్తూనే ఉంటున్నాం.. ఇప్పుడు దివంగత నటి సౌందర్య మళ్ళీ పుట్టిందా అనిపించేలా ఓ అమ్మాయికి చెందిన ఫోటోలు, వీడియో లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వివరాల్లోకి వెళ్తే..

కన్నడ సోయగం సౌందర్య.. తెలుగులో మనవరాలి పెళ్లి సినిమాతో అడుగు పెట్టింది. స్టార్ హీరో, చిన్న హీరో అనే తేడాలేకుండా హీరోయిన్ గా నటించి భాషతో సంబంధం లేకుండా అభిమానులను సొంతం చేసుకుంది. సావిత్రి తర్వాత అందం, అభినయంతో ఆ స్టేజ్ లో గుర్తింపు సొంతం చేసుకున్న సౌందర్య చిన్న వయసులోనే ప్రమాదానికి గురై.. తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయింది.

View this post on Instagram

A post shared by Chitra❤ (@chitra_jii2)

సౌందర్య మరణించి ఇన్నేళ్లు అయినా తెలుగు సినీ ప్రేక్షకుల మదిలో ఓ జ్ఞాపకంగా ఉండిపోయింది. ఆమె సినిమాలను చూస్తున్న సమయంలో సౌందర్యని గుర్తు చేసుకుని ఇప్పటికీ కంటతడిపెడుతూనే ఉంటారు. తాజాగా సోషల్ మీడియాలో సౌందర్య పోలికతో ఉన్న ఒక అమ్మాయి వీడియో హల్ చల్ చేస్తోంది.

View this post on Instagram

A post shared by Chitra❤ (@chitra_jii2)

మలేషియాలో జన్మించిన చిత్ర తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసిన ఫోటోలు, వీడియోలు చూసి సౌందర్య ఫ్యాన్స్ షాక్ తిన్నారు. అచ్చం సౌందర్యలా ఉన్న చిత్ర వీడియో నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.  chitra_jii2 పేరుతో ఇన్ స్టాగ్రామ్ లో ఉన్న వీడియోలు చూసిన నెటిజన్లు అచ్చు సౌందర్య ఈ అమ్మాయి ఉందని..

View this post on Instagram

A post shared by Chitra❤ (@chitra_jii2)

సౌందర్యాన్ని గుర్తు చేస్తున్నాయంటూ..  కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం చిత్రకు 77వేలకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. కొంతమంది సౌందర్య మళ్ళీ పుట్టిందేమో అంటున్నారు. ప్రస్తుతం చిత్ర ఇన్ స్టాగ్రామ్ కు  77,000కు పైగా ఫాలోవర్లు ఉన్నారు.

Also Read:  బద్వేల్ గెలుపు ప్రజాప్రభుత్వానికి, సుపరిపాలనకు ప్రజలు ఇచ్చిన దీవెనలుగా భావిస్తున్నా అన్న సీఎం జగన్