CM Jagan: బద్వేల్ గెలుపు ప్రజాప్రభుత్వానికి, సుపరిపాలనకు ప్రజలు ఇచ్చిన దీవెనలుగా భావిస్తున్నా అన్న సీఎం జగన్ 

Andhra Pradesh CM Jagan: కడప జిల్లాలోని బద్వేలు అసెంబ్లీ ఉపఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి.  ఈ ఉపఎన్నికల్లో కూడా వైసీపీ పార్టీ తిరుగులేని విజయాన్ని సొంతం..

CM Jagan: బద్వేల్ గెలుపు ప్రజాప్రభుత్వానికి, సుపరిపాలనకు ప్రజలు ఇచ్చిన దీవెనలుగా భావిస్తున్నా అన్న సీఎం జగన్ 
Ycp Mla Sudhamma
Follow us
Surya Kala

|

Updated on: Nov 02, 2021 | 5:13 PM

Andhra Pradesh CM Jagan: కడప జిల్లాలోని బద్వేలు అసెంబ్లీ ఉపఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి.  ఈ ఉపఎన్నికల్లో కూడా వైసీపీ పార్టీ తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకుంది. వైసీపీ అభ్యర్థి డా. సుధమ్మ ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థిపై భారీ ఓట్ల తేడాతో విజయాన్ని సొంతం చేసుకున్నారు.  ఈ విజయంపై సీఎం జగన్ మోహన్ రెడ్డి ట్విట్టర్ వేదికగా స్పందించారు.  బద్వేల్ ఉపఎన్నికల్లో అఖండ విజయాన్ని అందించిన ప్రతి అక్కచెల్లెమ్మకు, అవ్వాతాతకు, ప్రతీ ఆత్మీయ సోదరునికి పేరుపేరునా జగన్ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెప్పారు. అంతేకాదు బద్వేల్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై.. శాసన సభలో అడుగు పెట్టనున్న డా. సుధమ్మకు ముఖ్యమంత్రి అభినందనలు చెప్పారు.

దేవుడి దయ, మీ అందరి చల్లని దీవెనల వల్లే ఇంతటి ఘన విజయం సాధ్యమైందని అన్నారు. అంతేకాదు ఈ గెలుపు ప్రజాప్రభుత్వానికి, సుపరిపాలనకు ప్రజలు ఇచ్చిన దీవెనలుగా తాను భావిస్తున్నట్లు తెలిపారు సీఎం జగన్. ఈ విజయం అందించిన స్పూర్తితో ఆంధ్ర ప్రదేశ్ లోని ప్రజలకు మరింత మంచి చేసేందుకు కృషి చేస్తానని చెప్పారు ముఖ్యమంత్రి.

Also Read:  రాజోలు YCP ఇన్ఛార్‌గా జనసేన ఎమ్మెల్యే.? కార్యకర్తలు సంబరాలు.. పాల్గొన్న అమలాపురం ఎంపీ