‘విద్యాకానుక’పై సీఎం జగన్ కీలక ఆదేశాలు.. విద్యార్ధులకు ఇచ్చేవి ఇవే.. ఖర్చు ఎంతంటే.!

విద్యార్ధులకు 'జగనన్న విద్యా కానుక' ద్వారా పంపిణీ చేసే కిట్లలో నోట్‌ బుక్స్, షూలు, స్కూలు బ్యాగు, బెల్టు, యూనిఫాం, పాఠ్యపుస్తకాలు, వర్క్‌బుక్స్‌‌తో..

'విద్యాకానుక'పై సీఎం జగన్ కీలక ఆదేశాలు.. విద్యార్ధులకు ఇచ్చేవి ఇవే.. ఖర్చు ఎంతంటే.!
Cm Jagan
Follow us
Ravi Kiran

|

Updated on: Nov 02, 2021 | 4:18 PM

విద్యార్ధులకు ‘జగనన్న విద్యా కానుక’ ద్వారా పంపిణీ చేసే కిట్లలో నోట్‌ బుక్స్, షూలు, స్కూలు బ్యాగు, బెల్టు, యూనిఫాం, పాఠ్యపుస్తకాలు, వర్క్‌బుక్స్‌‌తో పాటు ఇంగ్లీష్-తెలుగు నిఘంటువులను ఇవ్వనున్నట్లు ఏపీ ప్రభుత్వం తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సుమారు 47.32 లక్షల మందికిపైగా విద్యార్ధులకు జగనన్న విద్యాకానుక కోసం 2021-22 విద్యా సంవత్సరానికి రూ. 790 కోట్లకుపైగా ఖర్చు అవుతుందని అంచనా వేస్తోంది. విద్యారంగంలో ‘నాడు – నేడు’ కార్యక్రమం అత్యంత ప్రాధాన్యత కలిగినదని.. ఈ కార్యక్రమాన్ని సమర్ధవంతంగా ముందుకు తీసుకెళ్లాలని అధికారులకు సీఎం జగన్ సూచించారు. అలాగే జగనన్న గోరుముద్ద కోసం 2021–22లో రూ.1625 కోట్లు, మనబడి ‘నాడు –నేడు’ రెండో విడత కోసం దాదాపు రూ.4,535 కోట్లు ఖర్చు అవుతుందని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేస్తోంది.

ఇదిలా ఉంటే.. తాజాగా విద్యారంగంతో పాటు.. వైద్యం, ఆరోగ్యం, నైపుణ్యాభివృద్ధి, వాటర్‌ గ్రిడ్, రోడ్లు, సాగునీటి ప్రాజెక్టులు, పట్టణాభివృద్ధి, గృహనిర్మాణం, పోర్టులు, ఫిషింగ్‌ హార్బర్లు, వైఎస్సార్ స్టీల్‌ప్లాంట్‌ తదితర కార్యక్రమాలను, అంశాలను సమీక్షించిన సీఎం జగన్.. పలు కీలక నిర్ణయాలను తీసుకున్నారు. అటు నైపుణ్యాభివృ‌ద్ది కాలేజీలకు సంబంధించిన పనులను వెంటనే మొదలుపెట్టాలని సీఎం జగన్ ఆదేశించారు. ఉద్దానం, పులివెందుల, డోన్‌లలో కొనసాగుతున్న వాటర్‌ గ్రిడ్‌ పనులపైనా సమీక్షించిన సీఎం.. ప్రాధాన్యతా క్రమంలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణ పనులు పూర్తి చేయాలన్నారు.

ఇక రోడ్ల నిర్మాణంపై పలు కీలక వివరాలను అధికారులు సీఎం జగన్‌కు వివరించారు. వచ్చే ఏడాది మే నెల నాటికి రోడ్ల నిర్మాణం పూర్తవుతుందన్నారు. దీనితో రోడ్ల నిర్మాణంపై మరింతగా ధ్యాస పెట్టాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు. అమరావతి ప్రాంతానికి వెళ్లే కరకట్ట రోడ్డు విస్తరణపై దృష్టి పెట్టాలని.. పనులు వేగంగా ముందుకు సాగేలా తగిన చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ ఆదేశించారు. మరోవైపు రాష్ట్రంలో జగనన్న కాలనీల్లో శాశ్వత మౌలిక సదుపాయాల ఏర్పాటుపైనా ముఖ్యమంత్రి సమీక్షించారు. కాగా, రామాయపట్నం, మచిలీపట్నం, భావనపాడు గ్రీన్‌ఫీల్డ్‌ పోర్టులతోపాటు షిషింగ్‌ హార్బర్ల నిర్మాణాలూ వేగంగా సాగేలా చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ స్పష్టం చేశారు.

ప్రభాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ !! ది రాజా సాబ్ నుంచి అప్డేట్
ప్రభాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ !! ది రాజా సాబ్ నుంచి అప్డేట్
NBK 109 టైటిల్.. అదేనా ?? సోషల్ మీడియా లో ఫుల్ ట్రెండ్
NBK 109 టైటిల్.. అదేనా ?? సోషల్ మీడియా లో ఫుల్ ట్రెండ్
కోహ్లీ కమ్ బ్యాక్ ఖాయమన్న టీమిండియా మాజీ కోచ్
కోహ్లీ కమ్ బ్యాక్ ఖాయమన్న టీమిండియా మాజీ కోచ్
ఓటీటీలోకి దుల్కర్ సల్మాన్ లక్కీ భాస్కర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీలోకి దుల్కర్ సల్మాన్ లక్కీ భాస్కర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఆరెంజ్‌ జ్యూస్‌ తెచ్చిన అదృష్టం.. ఏకంగా రూ. 2.10 కోట్లు !!
ఆరెంజ్‌ జ్యూస్‌ తెచ్చిన అదృష్టం.. ఏకంగా రూ. 2.10 కోట్లు !!
జిల్‌ బైడెన్‌ టీ పార్టీకి పిలిచినా రానన్న ట్రంప్‌ సతీమణి..
జిల్‌ బైడెన్‌ టీ పార్టీకి పిలిచినా రానన్న ట్రంప్‌ సతీమణి..
ఊహించామా..మంచినీళ్లు సైతం కొనుక్కుని తాగి మంచాన పడాల్సి వస్తుందని
ఊహించామా..మంచినీళ్లు సైతం కొనుక్కుని తాగి మంచాన పడాల్సి వస్తుందని
దూకుడుగా క్రిప్టోకరెన్సీ.. బిట్‌కాయిన్‌ విలువ ఇన్ని లక్షలా ??
దూకుడుగా క్రిప్టోకరెన్సీ.. బిట్‌కాయిన్‌ విలువ ఇన్ని లక్షలా ??
కోల్‌కతా వైద్యురాలి కేసులో నిందితుడు. సంజయ్ రాయ్ సంచలన వ్యాఖ్యలు
కోల్‌కతా వైద్యురాలి కేసులో నిందితుడు. సంజయ్ రాయ్ సంచలన వ్యాఖ్యలు
RRR రికార్డు బ్రేకయ్యేలా ఉందిగా.. పుష్ప 2 రన్ టైమ్ ఎంతంటే?
RRR రికార్డు బ్రేకయ్యేలా ఉందిగా.. పుష్ప 2 రన్ టైమ్ ఎంతంటే?