AP Weather Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. రాగల మూడు రోజులు ఏపీకి భారీ వర్ష సూచన..
AP Weather Report: తమిళనాడు తీరం, శ్రీలంక తీరం పరిసర ప్రాంతాలలో ఏర్పడిన అల్పపీడనం ప్రస్తుతం కొమరిన్, ఉత్తర శ్రీలంక పరిసర ప్రాంతాల మీదుగా ఉందని భారత వాతావరణ కేంద్రం...
AP Weather Report: తమిళనాడు తీరం, శ్రీలంక తీరం పరిసర ప్రాంతాలలో ఏర్పడిన అల్పపీడనం ప్రస్తుతం కొమరిన్, ఉత్తర శ్రీలంక పరిసర ప్రాంతాల మీదుగా ఉందని భారత వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. అనుబంధ ఉపరితల ఆవర్తనం సగటున సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి కొనసాగుతోంది. ఇది రాగల 24 గంటలలో ఆగ్నేయ అరేబియా సముద్ర ప్రాంతం మీదకు ప్రవేశించే అవకాశం ఉంది. ఈ అల్పపీడనం ఉత్తర వాయువ్య దిశగా ప్రయాణించే అవకాశం ఉంది. తదుపరి 48 గంటలలో మరింత బలపడుతుంది. మరొక ఉపరితల ద్రోణి.. కొమరిన్, ఉత్తర శ్రీలంక పరిసర ప్రాంతాల మీద నుంచి పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దక్షిణ కోస్తాంధ్ర తీరం వరకు మన్నార్ గల్ఫ్, తమిళనాడు తీర ప్రాంతం మీదుగా సగటున సముద్ర మట్టం వద్ద వ్యాపించి ఉంది.
వీటి ఫలితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల పాటు వాతారణ పరిస్థితుల్లో మార్పలు ఉండవచ్చని ఐఎండీ అధికారులు తెలిపారు. ఈ మేరకు ఏపీకి సంబంధించి మూడు రోజుల వాతావరణ వివరాలతో కూడిన నివేదికను వెల్లడించారు. ఈ రిపోర్ట్ ప్రకారం.. రోజు, రేపు, ఎల్లుండి ఉత్తర కోస్తాంధ్రా ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాల ప్రదేశాల్లో కురిసే అవకాశం ఉంది. ఒకటి లేదా రెండు చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
దక్షిణ కోస్తాంధ్రాలో ఇవాళ ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాల చోట్ల కురిసే అవకాశం ఉంది. ఒకటి లేక రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక రేపు, దక్షిణ కోస్తాంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలా ప్రదేశాల్లో కురిసే అవకాశం ఉంది. ఒకటి లేక రెండు చోట్ల భారీనుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాల ప్రదేశాల్లో కురిసే ఛాన్స్ ఉంది. ఒకటి లేక రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ఇక రాయలసీమలోనూ ఇంచుమించు అదే పరిస్థితి ఉండనుంది. ఈ రోజు, రేపు, ఎల్లుండి రాయలసీమలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాల చోట్ల కురిసే అవకాశం ఉంది. ఒకటి లేక రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అని వాతావరణ కేంద్రం అధికారులు ప్రకటించారు.
Also read:
Huzurabad By Election Result: బండి సంజయ్‌కి అమిత్ షా ఫోన్.. హుజురాబాద్ ఫలితాలపై ఆరా..
Kasturi Shankar: కమింగ్ సూన్.. ఆప్ ట్రావెల్స్ అండ్ టూర్స్.. నటీ కస్తూరి షాకింగ్ కామెంట్స్ వైరల్..
T20 World Cup 2021: ఇషాన్‌ను ఓపెనర్‌గా పంపడం సరైన నిర్ణయం కాదు.. షోయబ్ అక్తర్..