T20 World Cup 2021: ఇషాన్‎ను ఓపెనర్‎గా పంపడం సరైన నిర్ణయం కాదు.. షోయబ్ అక్తర్..

టీ20 వరల్డ్ కప్ 2021లో ఆదివారం జరిగిన డూ ఆర్ డై మ్యాచ్‎లో న్యూజిలాండ్ చేతిలో భారత్ ఎనిమిది వికెట్ల తేడాతో ఓడిపోయింది. ప్రస్తుతం ఇండియా టీ20 వరల్డ్ కప్ నుంచి దాదాపు నిష్క్రమించే  పరిస్థితిలో ఉంది...

T20 World Cup 2021: ఇషాన్‎ను ఓపెనర్‎గా పంపడం సరైన నిర్ణయం కాదు.. షోయబ్ అక్తర్..
Shoyab
Follow us
Srinivas Chekkilla

|

Updated on: Nov 02, 2021 | 3:40 PM

టీ20 వరల్డ్ కప్ 2021లో ఆదివారం జరిగిన డూ ఆర్ డై మ్యాచ్‎లో న్యూజిలాండ్ చేతిలో భారత్ ఎనిమిది వికెట్ల తేడాతో ఓడిపోయింది. ప్రస్తుతం ఇండియా టీ20 వరల్డ్ కప్ నుంచి దాదాపు నిష్క్రమించే  పరిస్థితిలో ఉంది. వరుసగా రెండు మ్యాచ్‎ల్లో భారత్ ఓడిపోవటంతో ఆటగాళ్లపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అభిమానులే కాకుండా మాజీ క్రికెటర్లు సోషల్ మీడియా వేదికగా మాట్లాడుతున్నారు. కివీస్‎పై భారత్ ఎందుకు గెలవలేకపోయిందనే దానిపై మాజీ పాక్ క్రికెటర్లు స్పందించారు.

భారత్‌కు ఇంకా సమయం ఉందని.. ఇండియా పుంజుకునే అవకాశం ఉందని షాహిద్ అఫ్రిది అన్నాడు. “భారత్‌ సెమీస్‌కు అర్హత సాధించే అవకాశం ఉంది. అయితే ఈ ఈవెంట్‌లో వారు ఆడిన రెండు మ్యాచ్‎లు ఎలా ఆడారో చూశాం” అఫ్రిది ట్వీట్ చేశాడు. న్యూజిలాండ్‎తో జరిగిన మ్యాచ్‎లో ఇషాన్ కిషన్‎ను ఓపెనర్‎గా పంపడాన్ని షోయబ్ అక్తర్ విమర్శించారు. టీం ఇండియా కథ దాదాపుగా ముగిసినట్లేనని అన్నాడు. రోహిత్ శర్మ 3వ స్థానంలో, విరాట్ కోహ్లీ 4వ ర్యాంక్‌లో రావడం సరైన చర్య కాదని అతను అభిప్రాయపడ్డాడు.

ఇండియా ఓటమిపై మాజీ క్రికెటర్ సెహ్వాగ్ ట్విట్టర్‎లో స్పందించారు. భారత బ్యాటర్ల పేలవమైన షాట్ ఎంపికను తప్పుబట్టాడు. “భారత జట్టు చాలా నిరుత్సాహపరిచింది. కివీస్ అద్భుతంగా ఆడింది. ఇండియా ఆటగాళ్ల తీరు గొప్పగా లేదు. భారత్ తదుపరి దశకు చేరుకోలేదని న్యూజిలాండ్ గెలుపు నిర్ధారించింది. ఇది ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన సమయం’ అని సెహ్వాగ్ ట్వీట్ చేశాడు. మాజీ భారత ఆల్ రౌండర్ పఠాన్ భారత్ ఓటమిపై స్పందించాడు. విలియమ్సన్ అండ్ కోని అభినందించాడు. ” ఆటగాళ్లకు స్థిరత్వం అవసరమని” పఠాన్ ట్వీట్ చేశాడు. ఇండియా, కివీస్ మ్యాచ్‎పై మాజీ క్రికెటర్లు వీవీఎస్ లక్ష్మణ్, వసీం జాఫర్, ఆకాశ్ చోప్రా, భారత వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ కూడా స్పందించారు.

భారత్ ఆటపై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ విమర్శలు గుప్పించారు. “భారత్ ఈ T20 వరల్డ్‌కప్ నుంచి నిష్క్రమించేలా ఉందన్నారు. ఇంత ప్రతిభ ఉండి, పెద్ద జట్టుగా పేరొందిన టీమిండియా పరిమిత ఓవర్ల క్రికెట్‌లో దారుణంగా విఫలమవుతుందని ట్వీట్ చేశాడు. ప్రపంచంలోని ఇతర దేశాల్లో నిర్వహిస్తున్న అన్ని లీగ్‌ మ్యాచ్‌లలో ఆడేందుకు భారత క్రికెటర్లకు అనుమతినివ్వాలని బీసీసీఐకి మైకేల్‌ వాన్‌ సూచించాడు. తద్వారా వారికి అనుభవం వస్తుందన్నారు. మరో ఇంగ్లాండ్ మాజీ ఆటగాడు పీటర్సన్ టీం ఇండియాకు మద్దతుగా నిలిచాడు. “క్రీడలలో గెలుపు, ఓటములు ఉంటాయి. ఏ ఆటగాడు ఓడిపోవడానికి ఆట ఆడడు. మీ దేశానికి ప్రాతినిధ్యం వహించడం గొప్ప గౌరవం. క్రీడాకారులు రోబోలు కాదని, వారికి అన్ని సమయాల్లో మద్దతు అవసరమని దయచేసి గ్రహించండి.” అంటూ ట్వీట్ చేశాడు.

Read Also.. Team India: గెలిచినప్పుడే కాదు.. ఓటమి చెందినా వివరణ ఇవ్వాలి: కోహ్లీ, రవిశాస్త్రిల తీరుపై భారత మాజీ కెప్టెన్ ఆగ్రహం

బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.