AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Virat Kohli: వన్డే కెప్టెన్సీ నుంచి కోహ్లీ ఔట్.? త్వరలోనే బీసీసీఐ నిర్ణయం!!

టీమిండియా, విరాట్ కోహ్లీకి ఏదీ కలిసి రావట్లేదు. టీ20 ప్రపంచకప్‌లో అద్భుత ప్రదర్శనలు కనబరుస్తుందనుకున్న టీమిండియా నిరాశపరిచింది.

Virat Kohli: వన్డే కెప్టెన్సీ నుంచి కోహ్లీ ఔట్.? త్వరలోనే బీసీసీఐ నిర్ణయం!!
Virat Kohli
Ravi Kiran
| Edited By: Anil kumar poka|

Updated on: Nov 06, 2021 | 1:32 PM

Share

టీమిండియా, విరాట్ కోహ్లీకి ఏదీ కలిసి రావట్లేదు. టీ20 ప్రపంచకప్‌లో అద్భుత ప్రదర్శనలు కనబరుస్తుందనుకున్న భారత్.. అటు ప్రేక్షకులను.. ఇటు బీసీసీఐని పూర్తిగా నిరాశపరిచింది. పేలవమైన ఫామ్‌తో పాకిస్తాన్, న్యూజిలాండ్ చేతుల్లో ఘోర పరాజయాలు ఎదుర్కుంది. దీనితో టోర్నీ నుంచి దాదాపుగా నిష్క్రమణకు దగ్గరైంది.

ఇదిలా ఉంటే ఈ ఓటములకు విరాట్ కోహ్లీ తీసుకున్న నిర్ణయాలే ముఖ్య కారణమని పలువురు మాజీలు, విమర్శకులు అంటుంటే.. మరోవైపు మెంటార్‌గా ఉన్న ధోని సలహాలు ఏవైనా తీసుకుంటున్నారా.? అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

ఇదిలా ఉంటే.. టీ20 ప్రపంచకప్ తర్వాత టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్లు విరాట్ కోహ్లీ గతంలోనే ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు అతడి వన్డే కెప్టెన్సీ కూడా ప్రమాదంలో పడినట్లు తెలుస్తోంది. టీ20, వన్డేలకు ఒకే కెప్టెన్‌ను ఎన్నుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. విరాట్ కోహ్లీ సారధ్యంలో టీమిండియా ప్రస్తుతం టీ20 ప్రపంచకప్‌లో పేలవ ప్రదర్శన చూపిస్తుండగా.. దీనిపై బీసీసీఐ తీవ్ర అసంతృప్తితో ఉందని తెలుస్తోంది. ఈ నేపధ్యంలోనే కోహ్లీని వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించాలని బీసీసీఐ యోచిస్తోందని అధికారి ఒకరు జాతీయ మీడియాకు తెలిపారు.

త్వరలోనే రాహుల్ ద్రావిడ్ టీమిండియా హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టబోతున్న నేపధ్యంలో.. సెలెక్టర్లు జట్టు కూర్పుపై కసరత్తులు మొదలుపెట్టారని తెలుస్తోంది. త్వరలోనే జరగబోయే బీసీసీఐ సెలెక్టర్ల సమావేశంలో ఈ చర్చ జరగనుందని సమాచారం. కాగా, విరాట్ కెప్టెన్సీలో టీమిండియా 2017 ఛాంపియన్స్ ట్రోఫీ, 2019 ODI ప్రపంచకప్, 2021 ఛాంపియన్స్ ట్రోఫీని కోల్పోయింది. ప్రస్తుతం టీ20 ప్రపంచకప్‌లో కూడా టీమ్ ఇండియా సూపర్-12 నుంచి నిష్క్రమించే అవకాశం ఉంది. ఈ పరిణామాల మధ్య టీ20, వన్డేలకు రోహిత్ శర్మను లేదా మరెవరైనా కెప్టెన్‌గా నియమించి.. టెస్టులకు విరాట్ కోహ్లీని కెప్టెన్‌గా కొనసాగించాలని బీసీసీఐ భావిస్తోందట. మరి దీనిపై అధికారిక ప్రకటన రావాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే.!

Read Also: ఉపకారం మరువని ఉడత… వీడియో చూస్తే మైమరచిపోతారు

డ్రైవర్‌ సీటుకి వెనుకవైపు ఉన్న సందేశం చూసి ఆశ్చర్య పోయిన ప్యాసింజర్.. ఇంతకీ ఆ సందేశం ఏంటో తెలుసా..?? వీడియో

ఫోన్‌లో ఆడుతూ రూ.61 వేలకి ఆర్డర్‌ చేసిన చిన్నారి… పెట్టిన ఆర్డర్ చూసి షాక్ అయిన తల్లిదండ్రులు.. వీడియో

ప్రతి ఒక్కరు విమానంలో తినే సదా అవకాశం… ఎయిర్‌క్రాఫ్ట్‌ రెస్టారెంట్‌.. ఎక్కడ ఉన్నదో తెలుసా..??