Indian Cricket Team: టీ20 కెప్టెన్‌గా టీమిండియా ఓపెనర్.. న్యూజిలాండ్ సిరీస్‌లో తొలిసారిగా చేపట్టనున్న పగ్గాలు
స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరిగే టీ20 సిరీస్‌లో సీనియర్లకు విశ్రాంతిని ఇవ్వనున్నారు. ఇప్పటికే తీరిక లేని షెడ్యూల్ కారణంగా వీరిని మూడు టీ20 సిరీస్‌లో పక్కనపెట్టే ఆలోచనలో బీసీసీఐ ఉన్నట్లు తెలుస్తోంది.
India vs New Zealand: తీరిక లేని షెడ్యూల్ తర్వాత సీనియర్ ప్లేయర్లకు విశ్రాంతిని ఇవ్వనున్నారు. ఈ నెలలో న్యూజిలాండ్ టీంతో జరగబోయే టీ20, టెస్ట్ సిరీస్‌లో యువ ఆటగాళ్లలో బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరిగే టీ20 సిరీస్‌లో సీనియర్లకు విశ్రాంతిని ఇవ్వనున్నారు. ఇప్పటికే తీరిక లేని షెడ్యూల్ కారణంగా వీరిని మూడు టీ20 సిరీస్‌లో పక్కనపెట్టే ఆలోచనలో బీసీసీఐ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే న్యూజిలాండ్‌తో జరగబోయే టీ20 సిరీస్‌లో భారత్‌కు నాయకత్వం వహించడంలో కేఎల్ రాహుల్ ముందువరుసలో ఉన్నాడు. నవంబర్ 17 న జైపూర్‌లో సిరీస్ ప్రారంభమవుతుంది. నవంబర్ 19న రాంచీ, 21 న కోల్‌కతాలో మిగతా టీ20లు జరగనున్నాయి. టీ20ఐల తర్వాత నవంబర్ 25-29 (కాన్పూర్), డిసెంబర్ 3-7 (ముంబై) వరకు రెండు టెస్టులు జరుగుతాయి.
టీమిండియా టీ20 ప్రపంచ కప్ స్క్వాడ్ సభ్యులందరూ గతేడాదిగా ఎంతో బిజీ షెడ్యూల్‌ను కలిగి ఉన్నారు. IPL 2020లో విశ్రాంతి లేకుండా ఆడారు. దీంతో సెలెక్టర్లు సీనియర్లకు విశ్రాంతిని ఇవ్వడానికి ప్రేరేపిస్తుంది. వీరి గైర్హాజరీలో రాహుల్ రెండో శ్రేణి జట్టుకు నాయకత్వం వహించే అవకాశం ఉంది.
“సీనియర్‌లకు కొంత విశ్రాంతిని ఇవ్వనున్నాం. టీ20 నిర్మాణంలో రాహుల్ అంతర్భాగం. అతను నాయకత్వం వహించడం దాదాపు ఖాయం” అని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి.
అలాగే ఈటీ20 సిరీస్ కోసం స్టేడియంలోకి పరిమితంగా ప్రేక్షకులను అనుమతిస్తున్నట్లు బీసీసీఐ తెలిపింది. “అవును, ప్రేక్షకులు స్టేడియాలకు వస్తారు. కానీ అది పూర్తి సామర్థ్యంతో మాత్రం కాదు. మేం స్థానిక అధికారులతో కలిసి పని చేస్తాం. ముందుకు వెళ్లే మార్గాన్ని ప్లాన్ చేస్తాం” అని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు.
పృథ్వీ షా, రుతురాజ్ గైక్వాడ్, మయాంక్ అగర్వాల్‌లు ఈ సిరీస్‌లో రాహుల్‌తో పాటు ఓపెనింగ్‌కు వచ్చే ప్రధాన పోటీదారులుగా ఉన్నారు. అయితే టీ20 ప్రపంచకప్ జట్టులో ఎంపిక చేయని యుజ్వేంద్ర చాహల్, శిఖర్ ధావన్‌లు కూడా ఎంపికయ్యే అవకాశం ఉంది.
ఐపీఎల్‌లో ఆకట్టుకున్న అవేష్ ఖాన్, మహ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్, చేతన్ సకారియా, హర్షల్ పటేల్ కూడా పేస్ విభాగంలో సెలక్ట్ అయ్యే అవకాశం ఉంది. రవి బిష్ణోయ్ కూడా స్పిన్ విభాగంలో అవకాశం ఫొందే ఛాన్స్ ఉంది.
చేతన్ శర్మ నేతృత్వంలోని జాతీయ సెలక్షన్ కమిటీ ఈ సిరీస్‌కు జట్టును ఎంపిక చేసే పనిలో నిమగ్నమైంది. రాబోయే రెండు రోజుల్లో సమావేశమవుతుందని భావిస్తున్నారు. అయితే ఈ ముగింపు తర్వాత విరాట్ కోహ్లీ టీ20 కెప్టెన్సీ నుంచి పదవీవిరమణ చేయబోతున్నందున భారత కొత్త టీ20ఐ కెప్టెన్‌కు సంబంధించి కూడా నిర్ణయం తీసుకోవలసి ఉంది.
కోహ్లి స్థానంలో రోహిత్ శర్మకు అవకాశం ఉంది. కానీ, రోహిత్ ఈ సిరీస్‌కు విశ్రాంతి తీసుకోవడంతో, న్యూజిలాండ్ సిరీస్ కోసం రాహుల్ నాయకత్వం వహించే అవకాశాలు బలంగా ఉన్నాయి.
Also Read: T20 World Cup 2021: ఇషాన్‌ను ఓపెనర్‌గా పంపడం సరైన నిర్ణయం కాదు.. షోయబ్ అక్తర్..