Team India: గెలిచినప్పుడే కాదు.. ఓటమి చెందినా వివరణ ఇవ్వాలి: కోహ్లీ, రవిశాస్త్రిల తీరుపై భారత మాజీ కెప్టెన్ ఆగ్రహం
T20 World Cup 2021: దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన గ్రూప్ 2 గేమ్‌లో టీమ్ ఇండియా న్యూజిలాండ్ చేతిలో ఓడిపోయిన సంగతి తెలిసిందే. మ్యాచ్ తర్వాత మీడియా సమావేశానికి ప్రధాన కోచ్ రవిశాస్త్రి..
T20 World Cup 2021: టీ20 ప్రపంచకప్‌లో భాగంగా ఆదివారం జరిగిన గ్రూప్ 2 గేమ్‌లో న్యూజిలాండ్ చేతిలో భారత్ ఓడిన తర్వాత, మ్యాచ్ తర్వాత మీడియా సమావేశానికి ప్రధాన కోచ్ రవిశాస్త్రి హాజరు కావాలని భారత మాజీ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్ అభిప్రాయపడ్డాడు. భారత పేసర్ జస్ప్రీత్ బుమ్రా మ్యాచ్ తర్వాత విలేకరుల సమావేశానికి హాజరయ్యారు. ఇది ఆమోదయోగ్యం కాదని ఈ భారత మాజీ క్రికెటర్ అన్నారు. “నా దృష్టిలో కోచ్ విలేకరుల సమావేశానికి రావాలి. విరాట్ కోహ్లి విలేకరుల సమావేశానికి హాజరు కాకూడదనుకుంటే ఫర్వాలేదు. కానీ, రవి (శాస్త్రి) భాయ్ విలేకరుల సమావేశానికి హాజరు కావాలి,” అని అజారుద్దీన్ అన్నారు.
‘‘గెలిచినప్పుడే ప్రెస్‌కాన్ఫరెన్స్‌లకు హాజరువావడం కాదు. ఓటములకు కూడా వివరణ ఇవ్వాలి. బుమ్రాను ప్రెస్‌కాన్ఫరెన్స్‌కి పంపడం సరికాదు. కెప్టెన్ లేదా కోచ్ ఎవరైనా ప్రెస్ కోసం రావాలి. కోచింగ్ స్టాఫ్‌లో ఎవరైనా రావాలి” అని పేర్కొన్నారు. ఇంత పేలవమైన ప్రదర్శన తర్వాత కోహ్లి, శాస్త్రి ప్రశ్నలు ఎదుర్కోవడానికి ఇష్టపడనున్నట్లున్నారు. ఓటమికి సిగ్గుపడాల్సిన అవసరం లేదని, అయితే బాధ్యత వహించాల్సిన అవసరం ఉందన్నారు.
“రెండు గేమ్‌లు ఓడిపోతే సిగ్గుపడాల్సిన పని లేదు. కానీ కెప్టెన్ లేదా కోచ్ వచ్చి దేశానికి ఎందుకు ఓడిపోయిందో వివరించాలి. ఈ ప్రశ్నలకు బుమ్రా సమాధానం ఇచ్చాడని ఆశించవచ్చు. కానీ, ఇది సరైంది మాత్రం కాదు. జట్టు గెలుపొందిన తర్వాత అలాగే జట్టు గడ్డు దశలో ఉన్నప్పుడు మీడియా ముందుకు వచ్చి కారణాలు చెప్పాల్సిన అవసరం అయితే ఉంది’ అని అన్నారు. అజహరుద్దీన్ భారత్ తరఫున 99 టెస్టులు, 334 వన్డేలు ఆడాడు.
20 ఓవర్లలో 110/7 స్కోరు చేసిన భారత టాప్-ఆర్డర్.. ఆదివారం మరోసారి విలువైన భాగస్వామ్యాలు అందించడంలో విఫలమైంది. న్యూజిలాండ్ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్ మూడు వికెట్లు పడగొట్టగా, ఇష్ సోధి కూడా రెండు వికెట్లు పడగొట్టాడు. భారత్ తరఫున రవీంద్ర జడేజా 19 బంతుల్లో 26 పరుగులు చేశాడు. డారిల్ మిచెల్ కేవలం 35 బంతుల్లో 49 పరుగులు చేయడంతో బ్లాక్‌క్యాప్‌లు కేవలం 14.3 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించారు.
టీమ్ ఇండియాకు ప్రస్తుతం సెమీస్‌కు అర్హత సాధించే అవకాశం ఉంది. వారు తమ మిగిలిన గేమ్‌లను ఖచ్చితంగా గెలవాలి. ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడి భారత జట్టు సెమీస్ దారులు ఆధారపడి ఉన్నాయి. బుధవారం అబుదాబిలోని షేక్ జాయెద్ స్టేడియంలో భారత్ తన తదుపరి మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్థాన్‌తో తలపడనుంది.
Also Read: