Virat Kohli: విరాట్ కోహ్లీ కుటుంబానికి బెదిరింపులు.. స్పందించిన డీసీడబ్ల్యూ.. ఢిల్లీ పోలీసులకు నోటీసులు జారీ

Virat Kohli: ఈరోజు తెల్లవారుజామున ఢిల్లీ మహిళా కమిషన్ కోహ్లి కుమార్తెపై వచ్చిన బెదిరింపులపై విచారణకు సంబంధించి ఢిల్లీ పోలీసులకు నోటీసులు పంపింది.

Virat Kohli: విరాట్ కోహ్లీ కుటుంబానికి బెదిరింపులు.. స్పందించిన డీసీడబ్ల్యూ.. ఢిల్లీ పోలీసులకు నోటీసులు జారీ
Virat Kohli And Anushka Sharma
Follow us
Venkata Chari

|

Updated on: Nov 02, 2021 | 6:36 PM

Virat Kohli: టీ20 ప్రపంచకప్‌లో కోహ్లీసేన పాకిస్థాన్‌తో 10 వికెట్ల తేడాతో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సహచర ఆటగాడు మహమ్మద్ షమీకి మద్దతుగా మాట్లాడినందుకుగాను కోహ్లీ తొమ్మిది నెలల కుమార్తెపై బెదిరింపులు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఈరోజు తెల్లవారుజామున ఢిల్లీ మహిళా కమిషన్‌ ఢిల్లీ పోలీసులకు నోటీసులు పంపింది. కోహ్లి కూతురికి బెదిరింపులపై చర్యలు తీసుకోవాలని ఆ నోటీసులో కోరింది.

ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టు పేలవ ప్రదర్శనపై భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ, అతని కుటుంబ సభ్యులకు ఆన్‌లైన్‌లో బెదిరింపులు వచ్చినట్లు ఆరోపణలపై ఢిల్లీ మహిళా కమిషన్ ఢిల్లీ పోలీసులకు నోటీసు పంపింది. కోహ్లితో పాటు అతని కుమార్తెకు కూడా బెదిరింపులు వస్తున్నట్లు మీడియాలో వచ్చిన కథనాలపై సుమోటోగా విచారణ చేపట్టినట్లు డీసీడబ్ల్యూ తెలిపింది.

డీసీడబ్ల్యూ డిప్యూటి కమీషనర్ ఆఫ్ పోలీస్ (సైబర్) విభాగానికి నోటీసు పంపింది. విరాట్ కోహ్లీ, బాలీవుడ్ నటి అనుష్క శర్మ కుమార్తెపై వచ్చిన బెదిరింపులు “చాలా సిగ్గుచేటు” అని డీసీడబ్ల్యు చైర్‌పర్సన్ అన్నారు. బెదిరింపులకు పాల్పడే వారిపై మండిపడుతూ ట్వీట్ చేశారు. “ప్రియమైన విరాట్, ఈ వ్యక్తులు ద్వేషంతో నిండి ఉన్నారు. ఎందుకంటే వారికి ఎవరూ ప్రేమను ఇవ్వరు. వారిని క్షమించండి. జట్టును రక్షించండి” అని రాహుల్ గాంధీ మంగళవారం సాయంత్రం ట్వీట్ చేశారు.

“నిందితులను అరెస్టు చేయలేకపోతే, నిందితులను అరెస్టు చేయడానికి ఢిల్లీ పోలీసులు తీసుకున్న చర్యల వివరాలను దయచేసి అందించండి” అని నోటీసులో డీసీడబ్య్లూ ఆదేశించింది.

గత వారం కోహ్లి మత వివక్షకు వ్యతిరేకంగా శక్తివంతమైన ప్రకటన విడుదల చేసిన సంగతి తెలిసిందే. “వెన్నుముక లేని వారే ఇలాంటి కామెంట్లు చేస్తారని, అలాంటి వారి కామెంట్లకు మేం బెదిరేలేదు” అని కోహ్లీ న్యూజిలాండ్ మ్యాచ్‌కు ముందు విలేకరులతో చెప్పాడు.

Also Read: T20 World Cup 2021: ఇషాన్‎ను ఓపెనర్‎గా పంపడం సరైన నిర్ణయం కాదు.. షోయబ్ అక్తర్..

Team India: గెలిచినప్పుడే కాదు.. ఓటమి చెందినా వివరణ ఇవ్వాలి: కోహ్లీ, రవిశాస్త్రిల తీరుపై భారత మాజీ కెప్టెన్ ఆగ్రహం