T20 World Cup 2021: రోహిత్ శర్మ ఓపెనింగ్ చేయకపోవడానికి కారణం ఏమిటో తెలుసా?

టీ20 ప్రపంచ కప్ 2021లో రోహిత్ శర్మ న్యూజిలాండ్‌తో ఓపెనింగ్ చేయడానికి రాలేదు. విరాట్ కోహ్లీ తీసుకున్న నిర్ణయంపై ఎన్నో ప్రశ్నలు తలెత్తాయి. అయితే ఈ ఆలోచన మాత్రం మెంటార్ సింగ్‌ ధోనీదేనంటూ రూమర్లు వస్తున్నాయి.

T20 World Cup 2021: రోహిత్ శర్మ ఓపెనింగ్ చేయకపోవడానికి కారణం ఏమిటో తెలుసా?
Dhoni Ravi Shastri Virat Kohli
Follow us
Venkata Chari

|

Updated on: Nov 02, 2021 | 6:48 PM

Rohit Sharma: టీ 20 ప్రపంచ కప్ 2021లో టీమ్ ఇండియా తన మొదటి రెండు మ్యాచ్‌లలో ఓడిపోయింది. ప్రస్తుతం సెమీ-ఫైనల్‌కు చేరుకోవడం దాదాపు అసాధ్యం. టీమ్ ఇండియా ఓటమి తర్వాత ఎన్నో ప్రశ్నలు తలెత్తాయి. టీం మేనేజ్‌మెంట్‌పై క్రికెట్ నిపుణులు, అభిమానులు ఎప్పటికప్పుడు ప్రశ్నలు సంధిస్తున్నారు. న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో పుట్టిన ప్రశ్నపై చాలా రచ్చ జరుగుతోంది. ప్రశ్న ఏమిటంటే – రోహిత్ శర్మను ఓపెనింగ్ నుంచి ఎవరు, ఎందుకు తొలగించారు? న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో కేఎల్ రాహుల్‌తో కలిసి ఇషాన్ కిషన్‌ను టీమ్ ఇండియా ఓపెనింగ్‌కు పంపింది. అదే సమయంలో రోహిత్ శర్మ 3వ స్థానంలో నిలిచాడు. ఈ మార్పులను చూసి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ నిపుణులు, అభిమానులు ఆశ్చర్యానికి గురయ్యారు. టీమ్ ఇండియా 8 వికెట్ల తేడాతో ఓడిపోవడంతో ఈ నిర్ణయంపై ప్రశ్నలు తలెత్తాయి. ఓటమిపాలైన రెండు రోజుల తర్వాత, ఈ ప్రశ్నకు సమాధానం లభించినట్లు రూమర్లు వస్తున్నాయి.

రూమర్ల ప్రకారం, రోహిత్ శర్మను ఓపెనింగ్ నుంచి తొలగించాలనే ఆలోచన మెంటార్ ఎంఎస్ ధోనీదేనంట. ఇన్‌సైడ్ స్పోర్ట్‌లో ప్రచురించిన వార్తల ప్రకారం, ఇషాన్ కిషన్‌తో ఓపెనింగ్ చేయించి, రోహిత్ శర్మను 3వ స్థానంలో దింపాలనే ఆలోచన మొదట ధోనీ వెల్లడించాడంట. ఆ తర్వాత జట్టు మొత్తం అంగీకరించింది. కెప్టెన్ విరాట్ కోహ్లి, ప్రధాన కోచ్ రవిశాస్త్రి కూడా ధోనీ అభిప్రాయాన్ని సమర్థించడంతో రోహిత్‌ను నంబర్ 3లో పంపించారు.

ధోనీ ఆలోచన టీమ్ ఇండియాకు భారమైంది.. కాగా, ధోనీ ఆలోచన టీమ్ ఇండియాకు పెద్ద భారంలా మారింది. ఓపెనింగ్‌లో ఇషాన్ కిషన్ 8 బంతులు మాత్రమే ఆడాడు. కేవలం 4 పరుగులకే పెవిలియన్‌కు చేరుకున్నాడు. రోహిత్ శర్మ కూడా కేవలం 14 పరుగులకే ఔటయ్యాడు. విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్ బ్యాట్ నుంచి ఎలాంటి పరుగులు రాలేదు. భారీ షాట్లు ఆడుతూ భారత టాప్ ఆర్డర్‌లోని నలుగురు బ్యాట్స్‌మెన్‌లు ఔట్ అయ్యారు. 2021 టీ20 ప్రపంచ కప్‌కు ధోని మెంటార్‌గా నియమించారనే సంగతి తెలిసిందే. ప్రతి ఒక్కరూ జట్టుపై చాలా అంచనాలు పెట్టుకున్నారని, అయితే అతని రాక ఎటువంటి ప్రయోజనాన్ని చూపలేదు. ఇప్పటికే రెండు మ్యాచ్‌ల్లో టీమిండియా ఓడిపోయింది. అతను పాకిస్థాన్ చేతిలో 10 వికెట్ల తేడాతో ఓడిపోగా, కివీ జట్టుపై 8 వికెట్ల తేడాతో ఓడిపోయారు. రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోయిన టీమిండియా ప్రస్తుతం సెమీఫైనల్ చేరడం దాదాపు అసాధ్యంగా మారింది. టీం ఇండియా తన తదుపరి మ్యాచ్‌ని అబుదాబిలో ఆఫ్ఘనిస్థాన్‌తో ఆడాల్సి ఉంది. అఫ్ఘాన్ జట్టు ఫామ్‌లో ఉండటంతో పాటు మూడు మ్యాచ్‌లకు గాను రెండింట్లో విజయం సాధించడంతో ఈ మ్యాచ్ కూడా భారత జట్టుకు కష్టతరంగా మారనుంది.

Also Read: Virat Kohli: విరాట్ కోహ్లీ కుటుంబానికి బెదిరింపులు.. స్పందించిన డీసీడబ్ల్యూ.. ఢిల్లీ పోలీసులకు నోటీసులు జారీ

T20 World Cup 2021: ఇషాన్‎ను ఓపెనర్‎గా పంపడం సరైన నిర్ణయం కాదు.. షోయబ్ అక్తర్..