SA vs BAN, T20 World Cup 2021: పోరాడి ఓడిన బంగ్లా టైగర్స్.. సెమీస్ రేసు నుంచి ఔట్.. 6 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికా విజయం
టోర్నీలో బంగ్లాదేశ్‌కు ఇది వరుసగా నాలుగో ఓటమి. అంటే బంగ్లా టీం ఇంతవరకు గెలుపు ఖాతా తెరవలేదు. మరోవైపు దక్షిణాఫ్రికా ప్రస్తుతం 4 మ్యాచ్‌ల్లో 3 గెలిచింది.
T20 World Cup 2021, SA vs BAN: టీ20 ప్రపంచకప్ 2021లో దక్షిణాఫ్రికాతో జరిగిన ఓటమితో బంగ్లాదేశ్ సెమీఫైనల్‌కు చేరుకోవాలనే ఆశలు ఆగిపోయాయి. అదే సమయంలో దక్షిణాఫ్రికా విజయంతో సెమీస్ చేరేందుక మరింత దగ్గరైంది. టోర్నీలో బంగ్లాదేశ్‌కు ఇది వరుసగా నాలుగో ఓటమి. అంటే బంగ్లా టీం గెలుపు ఖాతా తెరవలేదు. అదే సమయంలో, దక్షిణాఫ్రికా ప్రస్తుతం 4 మ్యాచ్‌ల్లో 3 గెలిచింది. గ్రూప్ 1 పాయింట్ల పట్టికలో రెండవ స్థానంలో నిలిచింది. దక్షిణాఫ్రికా 6 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌ను ఓడించి ఆస్ట్రేలియాకు కూడా ప్రమాద ఘంటికలు మోగించింది. ఎందుకంటే, దక్షిణాఫ్రికా ప్రస్తుతం మెరుగ్గా కనిపిస్తున్న రన్‌రేట్‌పై కూడా కన్నేసింది.
దక్షిణాఫ్రికా విజయంలో, దాని ఫాస్ట్ బౌలర్ల అద్భుత ప్రదర్శన, ఫలితంగా బంగ్లాదేశ్ జట్టు పెద్ద స్కోరు చేయలేకపోయింది. ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా కెప్టెన్ టాస్ గెలిచి బంగ్లాదేశ్‌ను ముందుగా బ్యాటింగ్‌కు పంపాడు. కానీ, బంగ్లాదేశ్ జట్టు పూర్తి 50 ఓవర్లు కూడా ఆడలేక 18.2 ఓవర్లలో 84 పరుగులకే ఆలౌటైంది. బంగ్లాదేశ్‌లో కేవలం ముగ్గురు బ్యాట్స్‌మెన్స్ మాత్రమే పది పరుగులు దాటారు. 27 పరుగులు చేసిన మెహదీ హసన్ అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. దక్షిణాఫ్రికా తరఫున నార్కియా, రబడా తలో 3 వికెట్లు తీసి విజయవంతమైన బౌలర్లుగా నిలిచాడు. రబాడా 4 ఓవర్లలో 20 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు. అలాగే 3.2 ఓవర్లలో 8 పరుగులకే 3 వికెట్లు పడగొట్టాడు నార్కియా.
బంగ్లాదేశ్ పోరాడినా.. దక్షిణాఫ్రికా గెలిచింది.. లక్ష్యం 85 పరుగులే కావడంతో దక్షిణాఫ్రికా సులువుగా సాధిస్తుందనిపించింది. కానీ, బంగ్లాదేశ్ బౌలర్లు పవర్‌ప్లేలో దక్షిణాఫ్రికా 3 వికెట్లు పడగొట్టడంతో, మ్యాచ్ బంగ్లా చేతిలోకి వచ్చినట్లు అనిపించింది. బంగ్లాదేశ్ ఫాస్ట్ బౌలర్లు స్వల్ప స్కోరు చేసినప్పటికీ తమ జట్టును మ్యాచ్‌లో నిలిపేందుకు తమ శాయశక్తులా ప్రయత్నించారు. తొలి 3 వికెట్లు చేజార్చుకున్న దక్షిణాఫ్రికాను బంగ్లాదేశ్ బౌలర్లు 13వ ఓవర్లో మరో దెబ్బ తీశారు. కానీ, ఈ ప్రయత్నాలు విజయాల మెట్లు ఎక్కలేకపోయాయి. ఫలితంగా ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
బంగ్లాదేశ్‌పై దక్షిణాఫ్రికా ఆధిపత్యం కొనసాగుతోంది.. టీ20 ఇంటర్నేషనల్‌లో దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్‌ల మధ్య ఇది 7వ పోరు. ఈ 7 మ్యాచ్‌ల్లోనూ బంగ్లాదేశ్‌పై దక్షిణాఫ్రికా విజయం సాధించింది. అంటే టీ20లో బంగ్లాదేశ్‌పై 100 శాతం విజయం సాధించిన జట్టుగా తన రికార్డు చెక్కుచెదరలేదు. టీ20 ప్రపంచ కప్‌లో, రెండు జట్లు 2007 తర్వాత తలపడ్డాయి. ఇందులో దక్షిణాఫ్రికా మరోసారి బంగ్లాదేశ్‌ను ఓడించగలిగింది.
Also Read: T20 World Cup 2021: రోహిత్ శర్మ ఓపెనింగ్ చేయకపోవడానికి కారణం ఏమిటో తెలుసా?