Huzurabad By Election Result: బండి సంజయ్‌కి అమిత్ షా ఫోన్.. హుజురాబాద్ ఫలితాలపై ఆరా..
హుజురాబాద్ ఉపఎన్నిక ఫలితాలపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆరా తీశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కి ఫోన్ చేసి ఫలితాలు ఎలా వస్తున్నాయని అడిగి తెలుసుకున్నారు...
హుజురాబాద్ ఉపఎన్నిక ఫలితాలపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆరా తీశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కి ఫోన్ చేసి ఫలితాలు ఎలా వస్తున్నాయని అడిగి తెలుసుకున్నారు. బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ అధిక్యంలో కొనసాగుతున్నట్లు బండి అమిత్ షాకు వివరించారు. బీజేపీ కార్యకర్తలు కష్టపడి పనిచేయటం వల్లే హుజరాబాద్లో బీజేపీ గెలుస్తోందని చెప్పారు హుజురాబాద్ ఉప ఎన్నిక ఫలితాలపై అమిత్ షా అభినందనలు తెలిపారు.
హుజురాబాద్ ఉప ఎన్నికలో బీజేపీ హవా కొనసాగుతుండటంతో బండి సంజయ్ సంతోషం వ్యక్తం చేశారు. నిజమైన సేవ చేసేవారికే ప్రజలు పట్టం కడుతారని అన్నారు. హుజురాబాద్‌లో కాషాయ జెండా ఎగురబోతోందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఈటల రాజేందర్ విజయం సాధించి అసెంబ్లీలో అడుగుపెట్డం ఖాయమన్నారు.
ఇదిలావుంటే నియోజకవర్గ ప్రజలు కరీంనగర్ జిల్లా కేంద్రానికి చేరుకుంటున్నారు. దీంతో జిల్లా కేంద్రం బీజేపీ కార్యకర్తలతో సందడిగా మారింది. రౌండ్ రౌండుకు బీజేపీకి ఆధిక్యం పెరుగుతుండడంతో ఈటల క్యాంప్ కార్యాలయానికి పార్టీ కార్యకర్తలు క్యూకడుతున్నారు. విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేక పోవడంతో కరీంనగర్‌లోకి హుజురాబాద్‌కు చెందిన బీజేపీ కార్యకర్తలను అనుమతించడం లేదు. కరీంనగర్ శివారులోని మానకొండూరు KSR గార్డెన్ వరకే అనుమతించారు. గార్డెన్‌కు వచ్చిన ఈటల కార్యకర్తలను కలుసుకున్నారు. ఉదయం మొదటగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కింపు చేపట్టగా టీఆర్ఎస్ ఆధిక్యంలో నిలిచింది. అయితే తొలి లీడ్ నుంచి ఈటల రాజేందర్ అధిక్యంలో కొనసాగుతున్నారు.
Read Also.. Huzurabad By Election Counting: ఎనిమిదో రౌండ్‌లో కారు జోరు.. తొలిసారి లీడ్‌లోకి వచ్చిన గెల్లు..
Huzurabad Result: హుజూరాబాద్ విజయం ఈటల రాజేందర్‌దే.. బీజేపీది కాదన్న కాంగ్రెస్ నేత పొన్నం