AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TGSRTC: తెలంగాణ ఆర్టీసీ ప్రయాణికులకు మరో శుభవార్త.. త్వరలో మరిన్ని సిద్దం..

టీజీఎస్‌ఆర్టీసీ ప్రయాణికులకు శుభవార్త. త్వరలో 200 కొత్త బస్సులు రోడ్డెక్కనున్నాయి. దీని వల్ల బస్సుల్లో ప్రయాణికుల రద్దీ తగ్గడంతో పాటు మెరుగైన ప్రయాణ సౌకర్యం అందనుంది. మహిళా సంఘాలు ఈ బస్సులను ఆర్టీసీకి అద్దెకు ఇవ్వనున్నాయి. ఇప్పటికే బాడీ బిల్డింగ్ పూర్తయ్యాయి.

TGSRTC: తెలంగాణ ఆర్టీసీ ప్రయాణికులకు మరో శుభవార్త.. త్వరలో మరిన్ని సిద్దం..
Tsrtc
Venkatrao Lella
|

Updated on: Feb 26, 2026 | 9:22 PM

Share

తెలంగాణలోని ఆర్టీసీ ప్రయాణికులకు టీజీఎస్‌ఆర్టీసీ శుభవార్త అందించింది. త్వరలో మహిళా సంఘాలకు సంబంధించిన కొత్త బస్సులు రోడ్డెక్కనున్నాయి. మహిళా పొదుపు సంఘాలు తమ నిధులతో ఈ బస్సులను ఆర్టీసీ ఆధ్వర్యంలో నడవనున్నాయి. అద్దె ప్రతిపాదినక ఈ బస్సులను ఆర్టీసీ తరపున మహిళా సంఘాలు నడపనున్నాయి. దీని వల్ల మహిళలకు ఆదాయం లభించడమే కాకుండా టీజీఎస్‌ఆర్టీసీలో కొత్త బస్సు సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. దీని వల్ల ప్రయాణికులకు కూడా కొత్త బస్సు సౌకర్యాలు అందనున్నాయి. ఇప్పటికే మహిళలకు పెట్రోల్ బంక్‌లు, ఆహార పరిశ్రమలు కేటాయించిన ప్రభుత్వం.. ఇప్పుడు ఆర్టీసీ సేవల ద్వారా ఆదాయం పొందే అవకాశం కల్పించందుకు ఈ నిర్ణయం అమలు చేస్తోంది. కోటి మంది  మహిళలను ఆర్ధికంగా అభివృద్ది చేయాలనే టార్గెట్ ప్రభుత్వం పెట్టుకుంది. అందలో భాగంగా వివిధ రంగాల్లో మహిళలకు తోడ్పాటునందిస్తుంది.

త్వరలో 200 కొత్త బస్సులు

ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా మహిళా సంఘాలు తమ నిధులతో బస్సులను కొనుగోలు చేసి వాటికి ఆర్టీసీకి అద్దెకు ఇవ్వొచ్చు. ఈ విధానంలో త్వరలో మహిళా సంఘాల నుంచి ఆర్టీసీకి కొత్తగా 200 బస్సులు అందనున్నాయి. ప్రస్తుతం ఈ బస్సులకు బాడీ బిల్డింగ్ పూర్తవ్వగా.. త్వరలో ప్రారంభించనున్నారు. ఇక మరో 248 బస్సులు మార్చి నెలాఖరు నాటికి సిద్దం కానున్నాయని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. గతంలో 142 బస్సులను పొదుపు సంఘాల మహిళల నుంచి ఆర్టీసీ అద్దెకు తీసుకురాగా.. అవి విజయవంతంగా నడుస్తున్నాయి. ఇప్పుడు 200కిపైగా బస్సులు కొత్తగా రానున్నాయి. త్వరలోనే ప్రభుత్వం నుంచి ఆమోదం లభించాక ఈ బస్సును ఆర్టీసీ నడపనుంది. గతంలో తీసుకున్న బస్సులను వరంగల్, కరీంనగర్, మహబూబ్ నగర్ జిల్లాల్లో తిప్పుతున్నారు.

600 బస్సులే టార్గెట్

మహిళా సంఘాల తరపున 600 బస్సులను ఆర్టీసీకి అద్దెకు ఇవ్వాలని సెర్ప్ లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే అందుబాటులోకి వచ్చిన 152 బస్సులతో పాటు త్వరలో 200 బస్సులు రానున్నాయి. భవిష్యత్తులో మిగతా 448 బస్సులు కూడా ఆర్టీసీకి సమకూర్చనున్నారు. మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం కల్పించడం వల్ల బస్సుల్లో విపరీతంగా రద్దీ ఉంటుంది. కనీసం కాలు పెట్టడానికి కూడా స్థలం ఉండటం లేదు. దీంతో రద్దీని తగ్గించాలంటే ఆర్టీసీకి కొత్త బస్సులు అవసరం. ఒకేసారి పెద్ద సంఖ్యలో బస్సులను కొనుగోలు చేయాలంటే బడ్జెట్ సరిపోదు. దీంతో గతంల ప్రైవేట్ వ్యక్తుల నుంచి బస్సులను ఆర్టీసీ అద్దెకు తీసుకునేది. కానీ ఇప్పటినుంచి మహిళా సంఘాల నుంచి అద్దెకు తీసుకుంటుంది.

Follow Us