AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సమ్మర్‌లో మజ్జిగతో కలిపి ఇది తీసుకున్నారనుకోండి.. రోజంతా బాడీ కూల్.. కూల్

వేసవిలో శరీరాన్ని చల్లబరచడానికి, ఆరోగ్య ప్రయోజనాలను అందించడానికి కతీరా గోండ్ ఒక అద్భుతమైన ఔషధం. దీనిని తెలుగులో బాదం జిగురు. మూత్రనాళ ఇన్ఫెక్షన్లు, కిడ్నీలో రాళ్ల సమస్యలకు ఇది మంచి పరిష్కారం. ఇది తక్కువ ఖర్చుతో చలవ, ఆరోగ్యాన్ని అందించే అద్భుతమైన అమృతం.

సమ్మర్‌లో మజ్జిగతో కలిపి ఇది తీసుకున్నారనుకోండి.. రోజంతా బాడీ కూల్.. కూల్
Lifestyle
Ravi Kiran
|

Updated on: Apr 03, 2026 | 4:22 PM

Share

కతీరా గోండ్, దీనిని కటోరా లేదా ఇతర పేర్లతో కూడా పిలుస్తారు. ఇది ఒక సహజ సిద్ధమైన జిగురు. ఇది గట్టిపడి కటోరా రూపంలో లభిస్తుంది. వేసవి కాలంలో శరీరాన్ని చల్లగా ఉంచడంలో ఇది అద్భుతమైన పాత్ర పోషిస్తుంది. తక్కువ ఖర్చుతో కూడిన ఈ పదార్థం అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తూ, ఒక మంచి ఔషధంలా పనిచేస్తుంది. ముఖ్యంగా, ఇది మూత్రనాళ ఇన్ఫెక్షన్లు, కిడ్నీలో రాళ్ల సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది. కతీరా గోండ్ శరీరానికి చలవ చేయడమే కాకుండా, అనేక ఇతర ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. కతీరా గోండ్‌ను ఉపయోగించే ముందు, దానిని సుమారు 10 గంటల పాటు నీటిలో నానబెట్టడం ముఖ్యం. ఇది నీటిని పూర్తిగా పీల్చుకొని జెల్ లాంటి పదార్థంగా మారుతుంది. నీటిలో నానబెట్టిన కతీరా జెల్‌ను నేరుగా నీటిలో కలుపుకుని తాగవచ్చు. అయితే, రుచికరమైన పానీయాలను తయారు చేసుకోవాలనుకునేవారికి ఇదిగో డిఫరెంట్ రెసిపీలు ఇలా..

సుగంధి కతీరా సబ్జా డ్రింక్:

ఇది వేసవిలో దొరికే బెస్ట్ డ్రింక్. ఒక బౌల్‌లో సబ్జా గింజలను నానబెట్టి, అర కప్పు సుగంధి పానకం, రెండు స్పూన్ల నానబెట్టిన సబ్జాలు, మూడు స్పూన్ల నానబెట్టిన కతీరా గోండ్ కలిపి తయారు చేస్తారు. రుచికి తగ్గట్టుగా కొద్దిగా నిమ్మరసం కూడా కలుపుకోవచ్చు. ఈ డ్రింక్ రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.

కతీరా మజ్జిగ:

వేసవిలో శరీరానికి అత్యవసరమైన మజ్జిగతో కతీరా గోండ్‌ను కలిపి తీసుకోవచ్చు. మూడు స్పూన్ల నానబెట్టిన కతీరా గోండ్‌లో ఒక నిమ్మ చెక్క రసం, కొద్దిగా ఉప్పు, జీలకర్ర పొడి కలిపి, తరువాత మజ్జిగ పోసి బాగా కలుపాలి. ఇది చప్పగా ఉండకుండా, రుచికరంగా ఉంటుంది.

బాదం కతీరా మిల్క్:

ఇది కొంచెం ప్రత్యేకమైన రెసిపీ. ముందుగా బాదం పప్పులను నానబెట్టాలి. సమయం లేకపోతే వేడినీళ్లలో నానబెట్టి తొక్క తీయవచ్చు. ఈ బాదం పప్పులను కొద్దిగా నీటితో మెత్తగా పేస్ట్ చేయాలి. పాలను మరిగించి, కొద్దిగా నీటిని, పటిక బెల్లం(లేదా చక్కెర), మూడు యాలకుల పొడి కలిపి, ఆపై బాదం పేస్ట్ వేసి బాగా మరిగించాలి. పాలు చల్లారిన తర్వాత, రెండు స్పూన్ల నానబెట్టిన సబ్జాలు, మూడు స్పూన్ల నానబెట్టిన కతీరా గోండ్ కలిపి, ఫ్రిజ్‌లో పెట్టి చల్లగా సర్వ్ చేయాలి.

సుగంధి కతీరా పాలు:

ఈ పానీయం తయారుచేయడానికి, ఒక గ్లాసు పాలను బాగా మరిగించి చల్లార్చాలి. చల్లారిన పాలలో ఒక కప్పు సుగంధి పానకం, మూడు స్పూన్ల నానబెట్టిన కతీరా గోండ్ కలిపి, ఫ్రిజ్‌లో చల్లబరచి తాగవచ్చు.

కొబ్బరి నీళ్లతో కతీరా:

ఇది వేసవిలో శరీరాన్ని అత్యంత చల్లబరిచే పానీయాలలో ఒకటి. ఒక బౌల్‌లో పటిక బెల్లం ముక్క వేసి, కొబ్బరిబొండం నీళ్లు పోసి, పటిక బెల్లం కరిగే వరకు ఉంచాలి. ఆపై మూడు నుండి నాలుగు స్పూన్ల నానబెట్టిన కతీరా గోండ్ కలిపి తాగాలి. కొబ్బరి నీళ్లు, పటిక బెల్లం, కతీరా గోండ్ కలిసి శరీరానికి అద్భుతమైన చలవను అందిస్తాయి.

ఇది చదవండి: ఇలా చేస్తే దోసెలు పెనానికి జన్మలో కూడా అతుక్కోవు.. ఎలాగో మీరూ చూడండి

మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
చాలా రోజుల తర్వాత కనిపించిన రవితేజ కూతురు.. క్యూట్ ఫొటోస్ ఇదిగో
చాలా రోజుల తర్వాత కనిపించిన రవితేజ కూతురు.. క్యూట్ ఫొటోస్ ఇదిగో
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. డిగ్రీ అర్హతతో రైల్వేశాఖలో ఉద్యోగాలు
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. డిగ్రీ అర్హతతో రైల్వేశాఖలో ఉద్యోగాలు
బెంగళూరు ట్రాఫిక్.. ఈ నిజం తెలిస్తే IT ఉద్యోగుల దిమ్మతిరిగిపోద్ది
బెంగళూరు ట్రాఫిక్.. ఈ నిజం తెలిస్తే IT ఉద్యోగుల దిమ్మతిరిగిపోద్ది
ఐపీఎల్ వేలంలోకి నయా విధ్వంసం ఎంట్రీ.. అన్ని రికార్డులు బద్దలే..!
ఐపీఎల్ వేలంలోకి నయా విధ్వంసం ఎంట్రీ.. అన్ని రికార్డులు బద్దలే..!
క్యాండీ క్రష్‌లో బీహార్‌ యువకుడి ప్రపంచ రికార్డ్!
క్యాండీ క్రష్‌లో బీహార్‌ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విమానంలో ఏయే వస్తువులను తీసుకెళ్లవచ్చు..? వీటికి నో ఎంట్రీ
విమానంలో ఏయే వస్తువులను తీసుకెళ్లవచ్చు..? వీటికి నో ఎంట్రీ
ట్రాక్‌ మధ్యలో కంకరాళ్లు ఎందుకు వేస్తారో తెలుసా? వాటిని ఏమంటారంటే
ట్రాక్‌ మధ్యలో కంకరాళ్లు ఎందుకు వేస్తారో తెలుసా? వాటిని ఏమంటారంటే
నమ్మితే నట్టేట ముంచాడు.. అతని చేతిలో దారుణంగా మోసపోయిన శివారెడ్డి
నమ్మితే నట్టేట ముంచాడు.. అతని చేతిలో దారుణంగా మోసపోయిన శివారెడ్డి
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు