Diwali 2021: లోకకంఠకుడిగా మారితే.. కొడుకైనా సరే వధించక తప్పదని తెలిపే కథ.. నరకాసుర వధ

Diwali 2021: హిందువుల పండుగలు హిందూ క్యాలెండర్ ప్రకారం జరుపుకుంటారు. అంతేకాదు హిందువుల పండుగలు ఏ సీజన్లో వస్తే.. ఆ సీజన్ కు అనుగుణంగా..

Diwali 2021: లోకకంఠకుడిగా మారితే.. కొడుకైనా సరే వధించక తప్పదని తెలిపే కథ.. నరకాసుర వధ
Narakasura Vadha
Follow us
Surya Kala

|

Updated on: Nov 02, 2021 | 7:57 PM

Diwali 2021: హిందువుల పండుగలు హిందూ క్యాలెండర్ ప్రకారం జరుపుకుంటారు. అంతేకాదు హిందువుల పండుగలు ఏ సీజన్లో వస్తే.. ఆ సీజన్ కు అనుగుణంగా జరుపుకుంటారు. కార్తీక మాసం అడుగు పెడుతూ సందడి తీసుకొస్తుంది. దీపావళి పండగను మోసుకొస్తుంది. ఈ పండగను దేశవ్యాప్తంగానే కాదు.. ప్రపంచంలో అనేక దేశాలు కూడా జరుపుకుంటాయి. చెడుపై మంచి గెలిచినందుకు సంతోషంవ్యక్తం చేస్తూ.. తమ ఆనందోత్సాలను దీపాల వెలుతురులో వ్యక్తం పరుస్తూ.. బాణాసంచా కాలుస్తారు.  అయితే దీపావళి పండగను జరుపుకోవడానికి పురాణాల్లో అనేక కథలున్నాయి. శ్రీరాముడు వనవాసం ముగించుకుని తిరిగి అయోధ్యకు చేరుకున్నందుకు దీపావళి చేసుకున్నారు అనేది ఒకటి అయితే.. మరొకటి.. లోకకంఠకుడైన రాక్షసుడు నరకాసురుడిని వధించి తమ జీవితంలో వెలుగులు పంచినందుకు ప్రజలు సంతోషంగా దీపాలు వెలిగించి దీపావళి జరుపుకున్నారని మరొక పురాణాల కథ.. దీపావళి సందర్భంగా నరకాసుర వధ గురించి తెలుసుకుందాం..

నరకాసుర జన్మ వృత్తాంతం: 

రాక్షసుడు హిరణ్యాక్షుడిని సంహరించడం కోసం విష్ణుమూర్తి వరాహ అవతారం ఎత్తారు. ఆ సమయంలో వరాహ స్వామి (విష్ణువు) వలన భూదేవి గర్భం దాల్చింది. అయితే తాను త్రేతాయుగంలో రాముడిగా అవతరించి..రావణ సంహారం చేస్తానని.. అనంతరం భూదేవి ప్రసవిస్తుందని విష్ణువు చెబుతాడు. ఈ నేపధ్యంలో త్రేతాయుగంలో లక్ష్మీదేవి సీతగా అవతరించి జనకుడి దొరుకుంతుంది. ఈ సమయంలో జనకుడితో భూదేవి ఒక మాట తీసుకుంటుంది. తనకు పుట్టబోయే బిడ్డను పెంచి పెద్ద చేయాలనీ కోరుతుంది. దీంతో రావణ సంహారం అనంతరం జన్మించిన భూదేవి కుమరుకి జనకుడు నరకాసురుడు అనే పేరు పెట్టి.. విద్యా బుద్ధులను నేర్పించాడు. అయితే నరకుడికి తల్లి భూదేవి జన్మ వృత్తాంతం చెబుతుంది. అప్పుడు విష్ణువు ప్రత్యక్షమై.. తనకుమారుడికి శక్తి అయుధాన్ని, దివ్య రథాన్ని వరంగా ఇచ్చాడు. అంతేకాదు కామరూప దేశాన్ని ప్రాగ్జ్యోతిష నగరం రాజధానిగా చేసుకుని రాజుగా పాలించమని చెప్పాడు.

ద్వాపరం యుగం: 

నరకుడికి ద్వాపర యుగంలో బాణుడు అనే రాక్షసుడితో స్నేహం ఏర్పడింది. దీంతో నరకాసుడికి దుర్ఘనాలు మొదలయ్యాయి. ప్రజలను, మునులను బాధించడం మొదలు పెట్టాడు. పూజలు చేయకుండా ఆలయాలను మూయించాడు. ఒకరోజు వశిష్ఠ మహర్షి ప్రాగ్జ్యోతిష పురములోని కామాఖ్యాదేవి పూజకు వెళ్తున్న సమయంలో దేవాలయం తలుపులు మూయించాడు. దీంతో వశిష్ట మహర్షి  కోపంతో నరకాసుడికి నీ మరణం నీ తల్లి చేతిలో పొందుతావని శాపం ఇచ్చాడు. వశిష్ట మహర్షి శాపంతో నరకుడిలో మరణం భయం ఏర్పడింది. దీంతో బ్రహ్మ అనుగ్రహం కోసం తపస్సు చేశాడు. తనకు దేవతలు, రాక్షసుల నుంచి మరణం లేకుండా వరం పొందాడు.

వర గర్వం: 

నరకాసురిడిలో తనకు చావు లేదు అనే వర గర్వంతో లోక కంఠకుడిగా మారాడు. మంచి చెడుల విచక్షణ మరచి.. దేవతలపై యుద్ధం చేశాడు. ఇంద్రాది దేవతలను జయించాడు. ఋషులను, ప్రజలు బాధిచడం మొదలు పెట్టాడు. అంతేకాదు..  పదహారువేల రాజకన్యలను చెరపట్టాడు. దీంతో తమను నరకాసుడి బారిన నుంచి కాపాడమని.. విష్ణు అవతారమైన శ్రీకృష్ణుడికి ఇంద్రాదిదేవతలు మొరపెట్టుకున్నారు.  మహావిష్ణువు ద్వాపరయుగంలో శ్రీకృష్ణ భగవానునిగా అవతరించినప్పుడు భూదేవి సత్యభామగా జన్మిస్తుంది.

నరకాసుర వధ: 

తనని ఆశ్రయించిన వారికీ విష్ణువు అభయం ఇస్తూ.. నరకాసుడి పై యుద్ధానికి కామరూప దేశానికి బయలు దేరుతున్నాడు. అదే సమయంలో కృష్ణడు భార్య సత్యభామ కూడా కదన రంగంలోకి వెళ్ళింది.  శ్రీకృష్ణుడు నరకాసురుడితో యుద్ధం చేస్తూ అలసి పోయినట్లు రథంలో కూలబడడంతో.. సత్యభామ విల్లంబులు చేబట్టింది. నరకాసుడితో యుద్ధం చేసింది.. నరకాసుడిని వధించింది. అప్పుడు తనకు వశిష్టడు ఇచ్చిన శాపం గుర్తు తెచ్చుకుని తాను తన తల్లి చేతిలో మరణిస్తున్నట్లు అర్ధం చేసుకుంటారు. నరకాసురుడు ఆశ్వయుజ కృష్ణ చతుర్దశినాటి రాత్రి రెండుజాములకు నరకాసుర సంహారం జరిగింది. ఈరోజున హిందువులు నరక చతుర్దశిగా జరుపుకుంటారు.

దీపావళి అమావాస్య: 

నరకాసురుడు మరణించాడని మర్నాడు ప్రజలకు,  దేవతలకు తెలియడంతో తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ సంబరాలు జరుపుకున్నారు. అమావాస్య రోజున చీకటి పారద్రోలుతూ.. తమ జీవితంలో వెలుగులు నింపేలా దీపాలను వెలిగించారు. బాణా సంచా కాలుస్తూ కాల్చి వేడుక చేసుకున్నారు. కాలక్రమంలో అదే దీపావళి పర్వదినంగా మారింది.

Also Read:  రిజల్ట్ అనంతరం గెల్లు శ్రీనివాస్ కంట కన్నీరు.. సోషల్ మీడియాలో వీడియో వైరల్..

ఏపీ, తెలంగాణ మధ్య పోటీ అవసరం లేదు: సీఎం రేవంత్ రెడ్డి
ఏపీ, తెలంగాణ మధ్య పోటీ అవసరం లేదు: సీఎం రేవంత్ రెడ్డి
హిమాయత్ నగర్‌ మినర్వా హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం..
హిమాయత్ నగర్‌ మినర్వా హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం..
సంక్రాంతి తర్వాత ఆ రాశుల వారికి ఆర్థిక విజయాలు
సంక్రాంతి తర్వాత ఆ రాశుల వారికి ఆర్థిక విజయాలు
హైదరాబాదీలకు గుడ్ న్యూస్.. ఇక ఆ మార్గంలో ట్రాఫిక్ కష్టాలకు చెక్
హైదరాబాదీలకు గుడ్ న్యూస్.. ఇక ఆ మార్గంలో ట్రాఫిక్ కష్టాలకు చెక్
రవి, శనుల యుతి.. ఆ రాశుల వారికి అధికార యోగం పక్కా..!
రవి, శనుల యుతి.. ఆ రాశుల వారికి అధికార యోగం పక్కా..!
22 బంతుల్లోనే 106 రన్స్..17 ఏళ్ల కుర్రాడి వైల్డ్ ఫైర్ ఇన్నింగ్స్
22 బంతుల్లోనే 106 రన్స్..17 ఏళ్ల కుర్రాడి వైల్డ్ ఫైర్ ఇన్నింగ్స్
పది మంది కడుపు నింపుతున్న ఈ వ్యక్తి గురించి సలాం కొట్టాల్సిందే!
పది మంది కడుపు నింపుతున్న ఈ వ్యక్తి గురించి సలాం కొట్టాల్సిందే!
దబిడి దిబిడి సాంగ్‌పై ట్రోల్స్.. బాలకృష్ణ సంచలన ట్వీట్
దబిడి దిబిడి సాంగ్‌పై ట్రోల్స్.. బాలకృష్ణ సంచలన ట్వీట్
అకౌంట్లో డబ్బులు పడ్డాయని బ్యాలెన్స్‌ చెక్‌ చేశారంటే అంతే సంగతి..
అకౌంట్లో డబ్బులు పడ్డాయని బ్యాలెన్స్‌ చెక్‌ చేశారంటే అంతే సంగతి..
నోరూరించే టమాటా వెల్లుల్లి చట్నీ.. వేడి అన్నంతో తింటే రుచే వేరు!
నోరూరించే టమాటా వెల్లుల్లి చట్నీ.. వేడి అన్నంతో తింటే రుచే వేరు!