AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Zodiac Signs: ఈ 3 రాశులవారికి అసూయ ఉండదు..! ఇతరుల విజయాన్ని ఆనందిస్తారు..

Zodiac Signs: మీ స్నేహితుడు లేదా మీకు తెలిసిన వ్యక్తి విజయం సాధించాడనుకో మీరు ఏం చేస్తారు. కొంతమంది మాత్రం అసూయపడుతారు. కొంతమంది మాత్రం సంతోషం

Zodiac Signs: ఈ 3 రాశులవారికి అసూయ ఉండదు..! ఇతరుల విజయాన్ని ఆనందిస్తారు..
Zodiac Signs
uppula Raju
|

Updated on: Nov 02, 2021 | 9:18 PM

Share

Zodiac Signs: మీ స్నేహితుడు లేదా మీకు తెలిసిన వ్యక్తి విజయం సాధించాడనుకో మీరు ఏం చేస్తారు. కొంతమంది మాత్రం అసూయపడుతారు. కొంతమంది మాత్రం సంతోషం వ్యక్తం చేస్తారు. మరికొందరు తామే విజయం సాధించినట్లుగా ఫీలవుతారు. కొంతమంది తొందరగా స్పందిస్తారు. మరికొంతమంది ఆలస్యంగా స్పందిస్తారు. వ్యక్తులను బట్టి వారి ప్రవర్తనను ఉంటుంది. కానీ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ 3 రాశుల వారికి అసూయ అనేది అస్సలు ఉండదు. ఇతరుల విజయాన్ని కూడా ఎంజాయ్ చేస్తారు. అలాంటి రాశుల గురించి ఒక్కసారి తెలుసుకుందాం.

సింహరాశి సింహ రాశి వ్యక్తులు ఎల్లప్పుడు తమ స్నేహితులను ప్రోత్సహిస్తారు. ఎప్పుడు ఎగతాళి చేయరు. ఏ విషయంలోనైనా సరే నిరుత్సాహ పరుచరు. ఆత్మీయులను ఆదరిస్తారు. వారు విజయం సాధించాలని కోరుకుంటారు. ప్రతి ఒక్కరినీ సంతోషంగా చూడడానికి ఇష్టపడతారు. వారికి దగ్గరగా ఉన్నవారు జీవితంలో విజయం సాధించినప్పుడు వారు చాలా సంతోషంగా ఉంటారు.

మేషరాశి మేష రాశి వారు కూడా సింహ రాశి వారిలాగే తమ చుట్టూ ఉన్న వ్యక్తులు విజయం సాధించాలని కోరుకుంటారు. అంతేకాదు ఎవరికైనా సహాయం చేయడానికి ఎప్పుడూ వెనుకాడరు.స్నేహితులు, కుటుంబ సభ్యులు విజయతీరాలకు చేరడానికి తమ వంతు సాయం చేస్తారు. ఎందుకంటే వారికి కూడా జీవితంలో ఒక అవకాశం వస్తుందని తెలుసు.

కుంభ రాశి కుంభరాశి వ్యక్తులు సౌమ్యులు. అందరితో స్నేహంగా ఉంటారు. శత్రువు గురించి అయినా సరే మంచిగా ఆలోచిస్తారు. ఎవరి విజయాన్ని చూసి అసూయపడరు. వీరు జీవితంలో కష్టపడి పనిచేస్తారు. ఉన్నత స్థాయికి చేరుకోవడానికి కష్టపడాలని భావిస్తారు. అందుకే ప్రతి ఒక్కరిని గౌరవిస్తారు.

గమనిక- ఇక్కడ ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలు, జానపద విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. సాధారణ పాఠకుల ఆసక్తిని బట్టి రాయడం జరిగింది.

Indian Railway: ట్రైన్‌ డ్రైవర్‌ జీతం ఇంజనీర్‌ కంటే ఎక్కువ..! ఎందుకో తెలుసా..?

Puneeth Raj Kumar: పునీత్ రాజ్ కుమార్ చివరి క్షణాలు.. ఈ సీసీ ఫుటేజ్ చూస్తే కన్నీళ్లు ఆగవు..

Telangana High Court: అలా ఎలా అంటారు?.. సిద్దిపేట కలెక్టర్‌పై సీరియస్ అయిన తెలంగాణ హైకోర్టు…