Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian Railway: ట్రైన్‌ డ్రైవర్‌ జీతం ఇంజనీర్‌ కంటే ఎక్కువ..! ఎందుకో తెలుసా..?

Indian Railway: ప్రభుత్వ ఉద్యోగాల విషయానికి వస్తే నిరుద్యోగుల మొదటి ఎంపిక రైల్వే డిపార్ట్‌మెంట్. ఎందుకంటే ఇందులో మంచి జీతంతో పాటు, ఉద్యోగులకు అనేక

Indian Railway: ట్రైన్‌ డ్రైవర్‌ జీతం ఇంజనీర్‌ కంటే ఎక్కువ..! ఎందుకో తెలుసా..?
Train Driver
Follow us
uppula Raju

|

Updated on: Nov 02, 2021 | 9:14 PM

Indian Railway: ప్రభుత్వ ఉద్యోగాల విషయానికి వస్తే నిరుద్యోగుల మొదటి ఎంపిక రైల్వే డిపార్ట్‌మెంట్. ఎందుకంటే ఇందులో మంచి జీతంతో పాటు, ఉద్యోగులకు అనేక సౌకర్యాలు, అలవెన్సులు లభిస్తాయి. దీని కారణంగా ప్రతి ఒక్కరూ రైల్వేలో ఉద్యోగం కోసం ప్రయత్నిస్తారు. అంతేకాదు వారికి రైలులో ఉచిత ప్రయాణం కూడా లభిస్తుంది. అందుకే ఇటీవల జరిగిన రైల్వే ఎన్‌టీపీసీ పరీక్షకు కోట్లాది మంది దరఖాస్తు చేసుకోవడం విశేషం. అయితే రైల్వే ఉద్యోగాలలో ట్రైన్‌ డ్రైవర్ ఉద్యోగం ఎంతో బరువైన, బాధ్యతతో కూడిన ఉద్యోగం.

అందుకే వీరికి ఇంజనీర్ల కంటే ఎక్కువ జీతం ఉంటుంది. అయితే వీరు ఎలాంటి పనులు నిర్వర్తిస్తారో తెలుసుకుందాం. అధికార భాషలో వీరిని లోకో పైలట్లు అంటారు. ఈ ఉద్యోగం చాలా కఠినమైనది. అలాగే జీతం కూడా ఎక్కువగా ఉంటుంది. రైలు డ్రైవర్ చాలా జాగ్రత్తగా ఉంటాడు. రైలులో వేలాది మంది ప్రయాణికులు ఉంటారు. వారిని సురక్షితంగా వారి గమ్యస్థానానికి చేర్చడం రైలు డ్రైవర్ బాధ్యత. పగలు, రాత్రి, ఎండ, వాన అనే తేడా లేకుండా ప్రతి పరిస్థితిలోనూ తన కర్తవ్యాన్ని నిర్విర్తిస్తాడు.

ఎంతో అప్రమత్తంగా వ్యవహరిస్తాడు. కొంచెం అలసత్వంగా ఉన్నా ప్రమాదం ముంచుకొస్తుంది. అందుకే వీరికి జీతం ఎక్కువగా చెల్లిస్తారు. లోకో పైలట్లకు రోజువారీ దినచర్య స్థిరంగా ఉండదు. వీరి విధులు రోస్టర్ ప్రకారం ఉంటాయి. నివేదికల ప్రకారం అతనికి 14 రోజుల రోస్టర్ ఇస్తారు. ఇందులో 2 రోజులు విశ్రాంతి ఉంటుంది. ఈ రోస్టర్ ప్రకారం దాదాపు104 గంటల పాటు పని చేయాల్సి ఉంటుంది. కొన్నిసార్లు వారు మరింత పని చేయాల్సి ఉంటుంది. వారి మొదటగా ALPగా చేరుతారు. అంటే అసిస్టెంట్ లోకో పైలట్ (ALP) అని అర్థం. రైల్వే నుంచి వివిధ అలవెన్సులు పొందుతారు.

100 కిలోమీటర్లు నడిచే రైలులో అలవెన్స్, ఓవర్ టైం అలవెన్స్, నైట్ డ్యూటీ అలవెన్స్, హాలిడే అలవెన్స్, డ్రెస్ అలవెన్స్ మొదలైనవి ఉంటాయి. వారు ALP నుంచి LPకి అంటే లోకో పైలట్‌గా పదోన్నతి పొందినప్పుడు అన్ని అలవెన్స్‌లతో పాటు వారి జీతం చాలా రెట్లు పెరుగుతుంది. సుమారు రూ.1 లక్షకు పెరుగుతుంది. వారి డ్యూటీ కూడా చాలా కష్టం. సాధారణంగా వారు 3-4 రోజుల తర్వాత ఇంటికి తిరిగి వస్తారు. 14 రోజుల డ్యూటీలో 104 గంటల కంటే ఎక్కువ సమయం ఇచ్చినందుకు వారికి ఓవర్ టైం చెల్లిస్తారు. ఉద్యోగం కారణంగా చాలా మంది రైలు డ్రైవర్‌గా మారడానికి ఇష్టపడరు. అయితే గత కొన్నేళ్లుగా పెద్ద సంఖ్యలో మహిళలు లోకో పైలట్‌లుగా పనిచేస్తుండటం విశేషం.

IBPS 2021: నిరుద్యోగులకు గుడ్‌ న్యూస్‌.. IBPS నుంచి నోటిఫికేషన్.. స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీ..

Puneeth Raj Kumar: పునీత్ రాజ్ కుమార్ చివరి క్షణాలు.. ఈ సీసీ ఫుటేజ్ చూస్తే కన్నీళ్లు ఆగవు..

Telangana High Court: అలా ఎలా అంటారు?.. సిద్దిపేట కలెక్టర్‌పై సీరియస్ అయిన తెలంగాణ హైకోర్టు…