Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Puneeth Raj Kumar: పునీత్ రాజ్ కుమార్ చివరి క్షణాలు.. ఈ సీసీ ఫుటేజ్ చూస్తే కన్నీళ్లు ఆగవు..

కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ అకాల మరణంతో చిత్రపరిశ్రమ శోక సంద్రంలో మునిగిపోయింది. తమ అభిమాన హీరో మరణాన్ని కన్నడిగులు.

Puneeth Raj Kumar: పునీత్ రాజ్ కుమార్ చివరి క్షణాలు.. ఈ సీసీ ఫుటేజ్ చూస్తే కన్నీళ్లు ఆగవు..
Puneeth Raj Kumar
Follow us
Rajitha Chanti

|

Updated on: Nov 02, 2021 | 8:24 PM

కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ అకాల మరణంతో చిత్రపరిశ్రమ శోక సంద్రంలో మునిగిపోయింది. తమ అభిమాన హీరో మరణాన్ని కన్నడిగులు.. సినీ ప్రముఖులు జీర్ణించుకోలేకపోతున్నారు.. ఎంతో ఆరోగ్యంగా.. ఫిట్‏గా ఉండే పునీత్ ఆకస్మాత్తుగా ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్లడంతో సినీ పరిశ్రమ ఒక్కసారిగా షాకయ్యింది. పునీత్ మరణ వార్తను విని అభిమానులు గుండెలు ఆగిపోయాయి. శుక్రవారం ఉదయం వ్యాయమం చేస్తున్న సమయంలో పునీత్‏కు ఛాతిలో నొప్పి వచ్చిందని.. వెంటనే తనను వారి ఫ్యామిలీ డాక్టర్ ఆసుపత్రికి తీసుకెళ్లారని.. అక్కడ పునీత్‍కు ఈసీజీ నిర్వహించిన డాక్టర్ రమణారావు.. ఆయన గుండె చప్పుడులో మార్పు గమనించి.. వెంటనే విక్రమ్ ఆసుపత్రికి సమాచారం అందించారు.

అయితే పునీత్.. అక్కడి నుంచి విక్రమ్ ఆసుపత్రికి వెళ్లడం.. చికిత్స తీసుకుంటూ తుది శ్వాస విడిచారని ఇప్పటికే డాక్టర్స్ వివరణ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆకస్మాత్తుగా జరిగిన ఈ సంఘటనలను ఇప్పటికీ అటు పునీత్ కుటుంబసభ్యులకు.. అభిమానులు ఇంకా నమ్మకం కలగడం లేదు.

29వతేదీ శుక్రవారం ఉదయం జిమ్ చేసిన తర్వాత గుండెల్లో నొప్పి రావడంతో తన భార్య అశ్వినితో కలిసి ఫ్యామిలీ డాక్టర్ రమణారావు ఇంటికి వెళ్లారు పునీత్.. ఈసీజీ తీసేవరకూ చాలా యాక్టివ్‏గా ఉన్నారు పునీత్. ఈసీజీ రిపోర్ట్‏లో ప్రమాదాన్ని గుర్తించి వెంటనే విక్రమ్ హాస్పిటల్ కు తరలించాలని డాక్టర్ రమణారావు సూచించారు. అయితే వారి ఇంటి నుంచి కారు వరకు తానే స్వయంగా నడుచుకుంటూ వెళ్లి ఎక్కినట్లుగా కనిపిస్తోంది. తనకేమీ కాలేదని ఎలాంటి నొప్పి లేదన్న తన భార్యతో చెప్పారు. అనంతరం కారు ఎక్కిన వెంటనే భార్య ఒడిలో పునీత్ పడుకున్నారు.. ఇక ఆ తర్వాత.. ఐదు నిమిషాల ప్రయాణం అనంతరం విక్రమ్ ఆసుపత్రికి చేరిలోపు భార్య ఒడిలోనే పునీత్ కన్ను మూశారు. అయితే తాజాగా పునీత్ తన ఫ్యామిలీ డాక్టర్ రమణారావు ఆసుపత్రి నుంచి కారు వరకు నడుచుకుంటు వెళ్లడం అక్కడ సీసీ టీవీ ఫుటేజ్‏లో రికార్డ్ అయ్యింది. ఇందుకు సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇక పునీత్ చివరి క్షణాలకు సంబంధించిన విజువల్స్ చూస్తే కళ్లు చెమ్మగిళ్లకమానవు..

పునీత్ అకాల మరణంతో కర్ణాటక చిత్రపరిశ్రమ ఒక్కసారిగా మూగబోయింది. పునీత్ పార్థివ దేహాన్ని సందర్శించేందుకు దాదాపు పది లక్షల మంది అభిమానులు కంఠీరవ స్టేడియానికి వచ్చినట్లుగా పోలీసులు అంచనా వేశారు. ఇటు టాలీవుడ్ స్టార్ హీరోలు బాలకృష్ణ, చిరంజీవి, తారక్ బెంగుళూరుకు వెళ్లి పునీత్ పార్ధీవదేహానికి నివాళులర్పించారు.

Also Read: Suriya & Jyothika: సూర్య రొమాంటిక్‌ పర్సన్‌… అందుకే నాకెక్కువ టెన్షన్‌!.. ఆసక్తికర విషయాలను చెప్పిన జ్యోతిక..

Bigg Boss 5 Telugu: కలుసుకున్న బిగ్‏బాస్ ఎలిమినేట్ కంటెస్టెంట్స్… కానీ తను మాత్రమే మిస్..

కొండముచ్చు జాలీ కార్ రైడ్.. ఏం జరిగిందంటే..?
కొండముచ్చు జాలీ కార్ రైడ్.. ఏం జరిగిందంటే..?
విమానంలో లగేజ్‌ ఛార్జీలు తప్పించుకోవటానికి ఇంత బరువు మోశావా..?
విమానంలో లగేజ్‌ ఛార్జీలు తప్పించుకోవటానికి ఇంత బరువు మోశావా..?
ఆస్తిలోనూ అతివల హవా.. టాప్-10 రిచెస్ట్ మహిళల్లో భారతీయ మహిళ ఈమే.!
ఆస్తిలోనూ అతివల హవా.. టాప్-10 రిచెస్ట్ మహిళల్లో భారతీయ మహిళ ఈమే.!
మయన్మార్‌లోనే ఎందుకు ఇన్ని భూకంపాలు..?
మయన్మార్‌లోనే ఎందుకు ఇన్ని భూకంపాలు..?
ఈ మిమిక్రీ ఆర్టిస్టును గుర్తు పట్టారా? ఇప్పుడు టాలీవుడ్ హీరో
ఈ మిమిక్రీ ఆర్టిస్టును గుర్తు పట్టారా? ఇప్పుడు టాలీవుడ్ హీరో
వైశాఖ, శ్రావణ మాసాల్లో ఈ రాశుల వారికి పెళ్లి గ్యారంటీ..!
వైశాఖ, శ్రావణ మాసాల్లో ఈ రాశుల వారికి పెళ్లి గ్యారంటీ..!
నెలకు రూ12 వేలు జమ చేస్తే చేతికి కోటి రూపాయలు.. అద్భుతమైన స్కీమ్
నెలకు రూ12 వేలు జమ చేస్తే చేతికి కోటి రూపాయలు.. అద్భుతమైన స్కీమ్
అదిరిపోయిన హోండా ఈవీ స్కూటర్.. ఫస్ట్ అండ్ బెస్ట్ రివ్యూ ఇదే..!
అదిరిపోయిన హోండా ఈవీ స్కూటర్.. ఫస్ట్ అండ్ బెస్ట్ రివ్యూ ఇదే..!
తప్పిపోయిన బాలిక.. వెంటనే డ్రోన్‌తో యాక్షన్‌లోకి పోలీసులు
తప్పిపోయిన బాలిక.. వెంటనే డ్రోన్‌తో యాక్షన్‌లోకి పోలీసులు
రామ జన్మభూమి వాచ్‌ను ధరించిన సల్మాన్.. కాస్ట్ ధరెంతో తెలుసా?
రామ జన్మభూమి వాచ్‌ను ధరించిన సల్మాన్.. కాస్ట్ ధరెంతో తెలుసా?