Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Suriya & Jyothika: సూర్య రొమాంటిక్‌ పర్సన్‌… అందుకే నాకెక్కువ టెన్షన్‌!.. ఆసక్తికర విషయాలను చెప్పిన జ్యోతిక..

ఆమె ఓ స్టార్‌ హీరో భార్య. ఇద్దరు పిల్లల తల్లి. నచ్చిన స్క్రిప్ట్‏లు ఎంపిక చేసుకుని నటిస్తున్న బెస్ట్ ఆర్టిస్ట్. అన్నిటికీ మించి 2డీ ఎంటర్‌టైన్‌మెంట్స్‏కి బాస్‌ లేడీ.

Suriya & Jyothika: సూర్య రొమాంటిక్‌ పర్సన్‌... అందుకే నాకెక్కువ టెన్షన్‌!.. ఆసక్తికర విషయాలను చెప్పిన జ్యోతిక..
Jyothika
Follow us
Dr. Challa Bhagyalakshmi - ET Head

| Edited By: Janardhan Veluru

Updated on: Nov 03, 2021 | 10:58 AM

ఆమె ఓ స్టార్‌ హీరో భార్య. ఇద్దరు పిల్లల తల్లి. నచ్చిన స్క్రిప్ట్‏లు ఎంపిక చేసుకుని నటిస్తున్న బెస్ట్ ఆర్టిస్ట్. అన్నిటికీ మించి 2డీ ఎంటర్‌టైన్‌మెంట్స్‏కి బాస్‌ లేడీ. ఇన్ని బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తున్న జ్యోతిక మనసులోని మాటలు… తన గురించి, సౌత్‌ సినిమాల గురించి, భర్త సూర్య గురించి, ఓటీటీ ప్లాట్‌ఫార్మ్స్ గురించి…!

టెన్షన్‌ ఉంటుంది కెరీర్‌లో ఈ టైమ్‌లో కొత్త ఎక్స్ పెరిమెంట్స్ చేసిన ప్రతిసారీ చాలా టెన్షన్‌ ఉంటుంది. ప్రజలు ఎలా రిజీవ్‌ చేసుకుంటారు? అసలు వాళ్లు మన దగ్గర నుంచి ఏం ఎక్స్ పెక్ట్ చేస్తారు? వాళ్ల అటెన్షన్‌ ఎలా ఉంటుంది..? ఇలాంటివన్నీ చాలా లేయర్స్ ఉంటాయి. అవన్నీ టెన్షన్‌ పడాల్సిన విషయాలే. కానీ అలాంటివన్నీ చూసినప్పుడే ఇంకా ఎక్కువ నేర్చుకుంటాం.

ఒకే పేజ్‌లో ఇప్పుడు నేనుగానీ, సూర్యగానీ సమాజంతో పాటు నడుస్తున్నాం. థియేటర్లలోనే చూడాల్సిన సినిమాలు కొన్ని ఉన్నాయి. అసలు బిగ్‌ స్క్రీన్స్ కి అతీతంగా చెప్పే కథలు కొన్ని ఉంటాయి. అలాంటివాటిని ఓటీటీలో చూడొచచు. ఓటీటీ, థియేటర్స్ అనేవి సేమ్‌ సైడ్‌ ఆఫ్‌ పేజ్‌ అన్నట్టు మారిపోయాయి. ఇప్పుడు మా 2డీ ఎంటర్‌టైన్‌మెంట్స్ లో 15 కథలు సిద్ధంగా ఉన్నాయి. వాటిలో థియేటర్లకు ఉపయోగపడే సబ్జెక్టులున్నాయి. ఓటీటీలకు ఫిట్‌ అయ్యే కథలున్నాయి.

ప్రోత్సహిస్తున్నాం కథలో కొత్తదనం ఉంటే మేకర్స్ ఇండస్ట్రీకి చెందిన వాళ్లా? బయటివాళ్లా అని అసలు పట్టించుకోవడం లేదు. ఒన్‌ లైనర్స్ లో ఫ్రెష్‌నెస్‌ ఉంటే వెంటనే మేం పికప్‌ చేసుకుంటున్నాం. రియల్‌ ఇన్సిడెంట్స్ కి మంచి ట్రీట్‌మెంట్‌ ఇస్తే జనాలను టచ్‌ చేసే సబ్జెక్టులవుతాయి. నేను రీసెంట్‌గా చేసిన ఉడన్‌పిరప్పే కూడా ఒక రియల్‌ ఇన్సిడెంట్‌ని బేస్‌ చేసుకుని రూపుదిద్దిన సినిమానే.

మాట్లాడుకుంటాం నేను, సూర్య… కథల గురించి చాలా మాట్లాడుకుంటాం. చాలా ట్రాన్స్ పెరెంట్‌గానూ ఉంటాం. ఎందుకంటే గట్టిగా చర్చించుకున్నప్పుడు కథలో ఉన్న దమ్ము బయటపడుతుంది. సూర్య అంత తేలిగ్గా కన్విన్స్ అవ్వరు. నేను వినగానే కొత్తగా ఉందా లేదా అని మాత్రం చూస్తాను. చాలా వరకు ఫైనల్‌గా నేను చెప్పిన మాటకే అందరూ ఓటు వేస్తారు.

రొమాంటిక్‌ భర్త సూర్య చాలా రొమాంటిక్‌ భర్త. నన్ను, పిల్లలను బాగా చూసుకుంటారు. ప్రొడక్షన్‌ హౌస్‌లో నా భాగస్వామ్యాన్ని ఎంకరేజ్‌ చేస్తారు. నాకు నచ్చిన సినిమాలను ఎంకరేజ్‌ చేస్తారు. భార్య మాటకు విలువిస్తారు. నాతో ఉదయాన్నే కూర్చుని కాఫీ తాగుతారు. మేమిద్దరం ఔట్‌డోర్‌ జాగింగ్‌ ఇష్టపడతాం. ఇవన్నీ చాలా మంచి విషయాలు. అందుకే ఎంతో మంది అమ్మాయిలు ఆయన్ని ఇష్టపడుతుంటారు. అంతమంది లేడీస్‌ ఫాలో అవుతున్నారనే స్ట్రెస్‌ నాకు కొంచెం ఎక్కువగానే ఉంటుంది (సరదాగా).

Also Read: Aha 2.0 & Allu Arjun: ఆహా 2.0 సందడి షురూ.. అతిథిగా ఐకాన్ స్టార్..

Bigg Boss 5 Telugu: కలుసుకున్న బిగ్‏బాస్ ఎలిమినేట్ కంటెస్టెంట్స్… కానీ తను మాత్రమే మిస్..

Shyam Singha Roy: తిరగబడిన సంగ్రామం.. వెనకబడని చైతన్యం.. అంచనాలను పెంచేసిన శ్యామ్ సింగరాయ్..