Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aha 2.0 & Allu Arjun: ఆహా 2.0 సందడి షురూ.. అతిథిగా ఐకాన్ స్టార్..

తెలుగు ప్రేక్షకులకు ఎప్పటికప్పుడు బ్లాక్ బస్టర్ చిత్రాలను.. సస్పెన్స్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. అదిరిపోయే టాక్ షో... ఇంట్రెస్టింగ్

Aha 2.0 & Allu Arjun: ఆహా 2.0 సందడి షురూ.. అతిథిగా ఐకాన్ స్టార్..
Aha
Follow us
Rajitha Chanti

|

Updated on: Nov 02, 2021 | 6:58 PM

తెలుగు ప్రేక్షకులకు ఎప్పటికప్పుడు బ్లాక్ బస్టర్ చిత్రాలను.. సస్పెన్స్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. అదిరిపోయే టాక్ షో… ఇంట్రెస్టింగ్ గేమ్ షోస్‏తో దూసుకుపోతుంది తొలి తెలుగు మాధ్యమం ఆహా. ప్రారంభించిన అతి తక్కున సమయంలోనే ఇతర ఓటీటీ సంస్థలకు గట్టి పోటీనిస్తూ.. డిజిటల్ రంగంలో నెంబర్ వన్ దిశగా దూసుకుపోతుంది. ఇక రోజు రోజుకీ ఆహా సబ్ స్కైబర్స్ సంఖ్య పెంచుకుంటూ నెవ్వర్ బిఫోర్ ఎవ్వర్ ఆఫ్టర్ అని నిరూపించుకుంటుంది ఆహా.

ఇదిలా ఉంటే.. అతి తక్కువ సమయంలో ఇంతటీ క్రేజ్ సంపాదించుకున్న ఆహా… ఇప్పుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సమర్పణలో ఆహా 2.0 అవతరించనుంది. దీపావళి పండుగ సందర్భంగా ఆహా యాప్‏ను 2.0గా అప్ గ్రేడ్ చేసి సరికొత్త ఫీచర్స్ అందించనున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్‏లో ఐకాన్ స్టార్ ప్రెజెంట్స్ ఆహా 2.0 అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. కాసేపటి క్రితమే ఈ వేడుక ఘనంగా ప్రారంభమైంది. ఈ వేడుకకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా పాల్గోననున్నారు. అల్లు అరవింద్‌, జూపల్లి రాము రావు అధ్యక్షతన ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇక అప్‌గ్రేడ్‌ వెర్షన్‌లో ప్రేక్షకులకు మరింత వినోదాల విందును అందించనుంది ఆహా. ఆడియో, వీడియో పరంగా మరింత నాణ్యతతో కూడిన వరల్డ్‌ క్లాస్‌ ఫీచర్స్‌ను అందిచనున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ 2.0 లాంచింగ్‌ కార్యక్రమంలో త్వరలో ఆహాలో రానున్న సూప‌ర్ హిట్ చిత్రాలు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్‌, ల‌క్ష్య, మంచిరోజులొచ్చాయి. డీజే టిల్లు, రొమాంటిక్‌, అనుభ‌వించు రాజా, పుష్పక విమానం, గ‌ని వంటి ఫిక్షన‌ల్‌, నాన్ ఫిక్షన‌ల్ చిత్రాల‌తో పాటు ఆహా ఒరిజిన‌ల్స్ అయిన అన్‌స్టాప‌బుల్‌, సేనాప‌తి, భామా క‌లాపం, త్రీరోజెస్ వంటి చిత్రాల‌కు సంబంధించి కూడా వివ‌రాల‌ను తెలియజేయనున్నారు.  ఈ వేడుకను మీరు టీవీ 9 తెలుగులో లైవ్ వీక్షించవచ్చు.

Also Read: Shyam Singha Roy: తిరగబడిన సంగ్రామం.. వెనకబడని చైతన్యం.. అంచనాలను పెంచేసిన శ్యామ్ సింగరాయ్..

Bigg Boss 5 Telugu: నెట్టింట్లో వైరల్ అవుతున్న లోబో రెమ్యునరేషన్.. ఇంతకీ ఎంత తీసుకున్నాడంటే..

Puneeth Raj Kumar: పునీత్ రాజ్ కుమార్ కుటుంబాన్ని పరామర్శించిన నాగార్జున..