IBPS 2021: నిరుద్యోగులకు గుడ్‌ న్యూస్‌.. IBPS నుంచి నోటిఫికేషన్.. స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీ..

IBPS 2021: ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం1828 పోస్టులను భర్తీ చేయనుంది. ఈ పోస్టులకు

IBPS 2021: నిరుద్యోగులకు గుడ్‌ న్యూస్‌.. IBPS నుంచి నోటిఫికేషన్.. స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీ..
Ibps So Recruitment
Follow us

|

Updated on: Nov 02, 2021 | 8:20 PM

IBPS 2021: ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం1828 పోస్టులను భర్తీ చేయనుంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు IBPS అధికారిక వెబ్‌సైట్ ibps.inని సందర్శించడం ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ప్రక్రియ 3 నవంబర్ 2021 నుంచి ప్రారంభమవుతుంది.

అభ్యర్థులు ఆన్‌లైన్‌లో 23 నవంబర్ 2021 వరకు అప్లై చేసుకోవచ్చు. ఫీజు చెల్లించడానికి చివరి తేదీ 23 నవంబర్ 2021. నోటిఫికేషన్ ప్రకారం.. ఈ ఖాళీలకు ప్రిలిమ్స్ పరీక్ష 26 డిసెంబర్ 2021న నిర్వహిస్తారు. మెయిన్స్ పరీక్ష 30 జనవరి 2022న నిర్వహిస్తారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న నోటిఫికేషన్‌ను పరిశీలించండి.

ఖాళీ వివరాలు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 1828 ఖాళీలు ఉంటాయి. స్పెషలిస్ట్ ఆఫీసర్‌లు 220 పోస్టులు, ఐటీ ఆఫీసర్‌కు 220, అగ్రికల్చర్ ఫీల్డ్ ఆఫీసర్‌కు 884 పోస్టులు, రాజభాష అధికారికి 84 పోస్టులు, లా ఆఫీసర్‌కు 44 పోస్టులు, హెచ్‌ఆర్ లేదా పర్సనల్ ఆఫీసర్‌కు 61 పోస్టులు, మార్కెటింగ్ ఆఫీసర్‌కు 535 పోస్టులు ఉంటాయి.

అర్హత విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం.. వివిధ పోస్టులకు వేర్వేరు అర్హతలు ఉంటాయి. ఇందులో IT ఆఫీసర్ పోస్టుకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్ నుంచి B లెవల్ సర్టిఫికేట్ లేదా కంప్యూటర్ సైన్స్‌లో ఇంజనీరింగ్ డిగ్రీని కలిగి ఉండాలి. ఇది కాకుండా అగ్రికల్చర్ ఫీల్డ్ ఆఫీసర్ పోస్టుకు దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులు అగ్రికల్చర్ ఫీల్డ్‌లో బ్యాచిలర్ డిగ్రీని కలిగి ఉండాలి.

అదే సమయంలో రాజ్‌భాషా అధికారి పోస్టుకు దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులు హిందీ సబ్జెక్టు నుంచి మాస్టర్స్ డిగ్రీని కలిగి ఉండాలి. అలాగే ఇంగ్లీష్ సబ్జెక్టును ఒక సబ్జెక్ట్‌గా కలిగి ఉండటం తప్పనిసరి. అంతే కాకుండా సంస్కృతంలో మాస్టర్స్ డిగ్రీ ఉన్న అభ్యర్థులు కూడా ఇందులో దరఖాస్తు చేసుకోవచ్చు. లా ఆఫీసర్ పోస్టుకు దరఖాస్తు చేయడానికి ఒకరు 3 లేదా 5 సంవత్సరాల LLB డిగ్రీని కలిగి ఉండాలి. అర్హతకు సంబంధించిన మరింత సమాచారం కోసం నోటిఫికేషన్‌ను చూడవచ్చు.

వయస్సు పరిధి ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 20 ఏళ్లు పైబడి 30 ఏళ్లలోపు ఉండాలి. అభ్యర్థుల వయస్సు 1 నవంబర్ 2021 నాటికి లెక్కిస్తారు. రిజర్వేషన్ల పరిధిలోకి వచ్చే అభ్యర్థులకు నిబంధనల ప్రకారం గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఇస్తారు.

దరఖాస్తు రుసుము ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే జనరల్, ఓబీసీ కేటగిరీ అభ్యర్థులు దరఖాస్తు రుసుముగా రూ.850 డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ, పీహెచ్ కేటగిరీ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు రూ.175గా నిర్ణయించారు. ఫీజును డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్ లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా ఆన్‌లైన్ మోడ్‌లో చెల్లించవచ్చు.

Indian Currency: కరెన్సీ నోట్లు ఏ విధంగా తయారు చేస్తారో మీకు తెలుసా..! ఆశ్చర్యపోతారు..

Diwali 2021: దీపావళి పండగకి ఈ రోగులు దూరంగా ఉండాలి.. లేదంటే పరిస్థితి మరీ దారుణంగా మారుతుంది..

SBI Two Wheeler Loan: బైక్‌ కొనాలనుకుంటున్న వారికి ఎస్‌బీఐ గుడ్‌న్యూస్‌.. తక్కువ వడ్డీతో టూ-విలర్‌ లోన్‌ స్కీమ్‌..