- Telugu News Photo Gallery Viral photos Indian currency notes interesting facts what are indian notes made of if not paper
Indian Currency: కరెన్సీ నోట్లు ఏ విధంగా తయారు చేస్తారో మీకు తెలుసా..! ఆశ్చర్యపోతారు..
Indian Currency: కరెన్సీ నోట్లను ఏ విధంగా తయారుచేస్తారో మీకు తెలుసా.. ఎప్పుడైనా ఆలోచించారా.. అయితే ఈ నోట్లు కాగితంతో తయారుచేస్తారు అనుకుంటారు చాలామంది. కానీ ఇది నిజం కాదు.
Updated on: Nov 02, 2021 | 7:51 PM

కరెన్సీ నోట్లను ఏ విధంగా తయారుచేస్తారో మీకు తెలుసా.. ఎప్పుడైనా ఆలోచించారా.. అయితే ఈ నోట్లు కాగితంతో తయారుచేస్తారు అనుకుంటారు చాలామంది. కానీ ఇది నిజం కాదు.

కాగితంతో తయారు చేసిన నోట్ల జీవితకాలం ఎక్కువ రోజులు ఉండదు. తక్కువ సమయంలో ఆ నోట్లు చిరిగిపోతాయి. కానీ మన నోట్లు కాగితం కంటే మన్నికైనవి. ఎందుకంటే ఈ నోట్లు కాగితంతో కాదు పత్తితో తయారు చేస్తారు.

అవును! భారతీయ నోట్లు 100% పత్తితో తయారు చేస్తారు. సెంట్రల్ బ్యాంక్ RBI వెబ్‌సైట్‌లో నోట్ల దీని గురించిన సమాచారం ఉంది. దీని కారణంగా నోటు చాలా కాలం పాటు ఉంటుంది.

కాగితం కంటే పత్తి బలమైనది. అందుకే అవి త్వరగా పాడవవు. భారతదేశంలోనే కాదు అనేక ఇతర దేశాలలో కూడా నోట్ల తయారీకి పత్తిని మాత్రమే ఉపయోగిస్తారు. వీటిని కాటన్ ఫైబర్‌తో తయారు చేస్తారు.

వాస్తవానికి లెనిన్ అనే కాటన్ ఫైబర్‌లో ఫైబర్ కనిపిస్తుంది. నోట్స్ తయారు చేయడానికి పత్తితో పాటు గాట్లిన్, అడెసివ్ సొల్యూషన్‌ను ఉపయోగిస్తారు. దీని కారణంగా నోటు జీవితకాలం ఎక్కువగా ఉంటుంది.





























