- Telugu News Photo Gallery Viral photos Fire cracker facts where did fire crackers come from know all about firecrackers origin history and production
Diwali 2021: బాణాసంచా ఉత్పత్తిలో రెండో స్థానంలో భారత్.. అత్యధికంగా ఈ నగరంలోనే తయారు చేస్తారు..
Diwali 2021: ఆరో శతాబ్దంలో మొదటిసారిగా చైనాలో బాణాసంచా ప్రారంభమైనట్లు చరిత్రకారులు చెబుతున్నారు. దాని ఆవిష్కరణ వెనుక అనుకోని కారణం ఉంది.
Updated on: Nov 03, 2021 | 4:10 PM

ఆరో శతాబ్దంలో మొదటిసారిగా చైనాలో బాణాసంచా ప్రారంభమైనట్లు చరిత్రకారులు చెబుతున్నారు. దాని ఆవిష్కరణ వెనుక అనుకోని కారణం ఉంది. చైనాలోని ఓ వంట మనిషి పొటాషియం నైట్రేట్‌ను మంటలో వేసింది. దీంతో మంటలు ఒక్కసారిగా చెలరేగాయి. అందులో బొగ్గు, సల్ఫర్ పడటం వల్ల పేలుడు సంభవించింది.

13వ శతాబ్దంలో చైనా నుంచి బాణసంచా బయటకు వచ్చింది. అయితే ప్రపంచంలోనే బాణాసంచా ఉత్పత్తిలో చైనా మొదటి స్థానంలో ఉంది. భారతదేశం రెండో స్థానంలో ఉంది. బాణాసంచా ప్యాకెట్లలో శివకాశి ముద్రని మీరు తప్పకుండా చూసే ఉంటారు.

శివకాశి దక్షిణ భారతదేశంలోని తమిళనాడులో ఉన్న ఒక నగరం. ఇది చెన్నైకి 500 కిలోమీటర్ల దూరంలో ఉంది. దేశంలో అత్యధికంగా క్రాకర్లు ఈ నగరంలోనే తయారవుతాయి. దేశం మొత్తం ఉత్పత్తిలో 80 శాతం బాణాసంచా ఫ్యాక్టరీలు ఇక్కడే ఉన్నాయి. క్రాకర్ పరిశ్రమతో లక్షలాది మంది ఇక్కడ జీవనోపాధి పొందుతున్నారు.

క్రాకర్ పరిశ్రమలో శివకాశికి చెందిన నాడార్ బ్రదర్స్ పెద్ద పేరు. షణ్ముగం నాడార్, అయ్య నాడార్ 1922 సంవత్సరంలో కోల్‌కతా నుంచి అగ్గిపెట్టెలు చేసే కళను నేర్చుకుని వారి స్వస్థలమైన శివకాశికి వెళ్లారు. ముందుగా అగ్గిపెట్టె ఫ్యాక్టరీని ఏర్పాటు చేసుకున్నారు. 4 సంవత్సరాల తరువాత ఇద్దరు సోదరులు విడిపోయి బాణసంచా తయారీ ప్రారంభించారు.

ఈ రోజు శ్రీ కాళీశ్వరి ఫైర్ వర్క్స్, స్టాండర్డ్ ఫైర్ వర్క్స్, దేశంలో రెండు అతిపెద్ద బాణసంచా తయారు చేసే కంపెనీలు. ఇక్కడ తయారయ్యే క్రాకర్లను ఇతర దేశాలకు కూడా ఎగుమతి చేస్తారు. భారతదేశంలో బాణాసంచా వ్యాపారం రూ.5000 కోట్లకు పైగానే ఉంటుంది.





























