Dhana Triodashi: ధన త్రయోదశి రోజున భారీగా పసిడి అమ్మకాలు.. 20 టన్నుల మేర విక్రయాలు జరిగినట్టు అంచనా..
కార్తీక మాసం కృష్ణ పక్ష త్రయోదశిని ధన త్రయోదశిగా జరుపుకుంటారు. ధన త్రయోదశి అంటే సంపదను, శ్రేయస్సుని ఇచ్చేదని అర్థం. దీపావళి పండగను ఐదు రోజుల పాటు పర్వదినాలుగా జరుపుకుంటారు...
కార్తీక మాసం కృష్ణ పక్ష త్రయోదశిని ధన త్రయోదశిగా జరుపుకుంటారు. ధన త్రయోదశి అంటే సంపదను, శ్రేయస్సుని ఇచ్చేదని అర్థం. దీపావళి పండగను ఐదు రోజుల పాటు పర్వదినాలుగా జరుపుకుంటారు. మొదటి రోజును ధన త్రయోదశిగా నిర్వహిస్తారు. హిందూ సంప్రదాయంలో ఐశ్వర్య దేవతగా లక్ష్మీదేవిని భావిస్తారు. ధన త్రయోదశి రోజు బంగారం, వెండి కొంటారు. ఈ ఏడాది ధన త్రయోదశి రోజు సంతృప్తికర స్థాయిలో బంగారం అమ్మాకలు జరిగినట్లు తెలుస్తోంది. ధన త్రయోదశి రోజున దాదాపు 20 టన్నుల మేర బంగారం విక్రయాలు జరిగినట్లు అంచనా వేశారు.
క్షీరసాగర మథనం సమయంలో ధన త్రయోదశిరోజున లక్ష్మీదేవి పాలసముద్రం నుంచి ఉద్భవించిందని..పురాణాల కథనం. అంతేకాదు.. ఇదేరోజున ధన్వంతరి బంగారు కలశంతో దర్శనమిచ్చాడని మరికొందరి నమ్మకం. అందుకనే ఈ రోజున లక్ష్మీదేవి తో పాటు ధన్వంతరి, కుబేరుడులను కూడా పూజిస్తారు. ధన త్రయోదశి రోజున లక్ష్మీదేవిని పూజిస్తే ఆర్థిక కష్టాలు ఉండవని హిందువుల విశ్వాసం. అందుకనే ఇంటిని శుభ్రం చేసి.. సాయంత్రం ఇంటి ప్రధాన ద్వారం, ప్రాంగణం, ఇంటి దక్షిణం వైపు కచ్చితంగా దీపం వెలిగిస్తారు.
అంతేకాదు ఈరోజున యమదీపాలను పెడతారు. ఇలా యమదీపం పెట్టిన ఇల్లు సుఖసంతోషాలు, సౌఖ్యాలు సంపదలతో నిండి ఉంటుందని విశ్వాసం. ధన్ తేరాస్ రోజున సూర్యాస్తమయంలో అంటే సాయంత్రం లక్ష్మీదేవీని పూజిస్తే సకల శుభాలు కలుగుతాయి. ప్రదోషకాలంలో లక్ష్మీ పూజ నిపూజిస్తే.. అమ్మవారి ఇంట్లో స్థిర నివాసం ఉంటుందని పెద్దలనమ్మకం. ధనత్రయోదశిరోజున షాపింగ్ చేయడం శుభప్రదమని నమ్ముతారు. ముఖ్యంగా బంగారం, వెండి వస్తువులను కొనడానికి ఆసక్తిని చూపిస్తారు. అంతేకాదు మరికొందరు ఇంటిలో ఉపయోగించే వస్తువులు, కార్లు, మోటార్, భూమి వంటివాటిని కొనుగోలు చేస్తారు
Read Also.. Diwali 2021: లోకకంఠకుడిగా మారితే.. కొడుకైనా సరే వధించక తప్పదని తెలిపే కథ.. నరకాసుర వధ