T20 World Cup 2021: ఐపీఎల్ ఆడితే చాలనుకుంటున్నారు.. అందుకే ఓడిపోయారు.. వసీం అక్రమ్..
టీం ఇండియాపై విమర్శలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. తాజాగా పాకిస్తాన్ మాజీ కెప్టెన్ వసీం అక్రమ్ ఇండియా వైఫల్యాలపై మాట్లాడాడు. పరిమిత ఓవర్ల అంతర్జాతీయ క్రికెట్ ఎక్కువగా ఆడకపోవడం వల్లే భారత్ ప్రస్తుతం జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌లో తమ పేలవ ప్రదర్శన చేస్తుందని చెప్పాడు...
టీం ఇండియాపై విమర్శలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. తాజాగా పాకిస్తాన్ మాజీ కెప్టెన్ వసీం అక్రమ్ ఇండియా వైఫల్యాలపై మాట్లాడాడు. పరిమిత ఓవర్ల అంతర్జాతీయ క్రికెట్ ఎక్కువగా ఆడకపోవడం వల్లే భారత్ ప్రస్తుతం జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌లో తమ పేలవ ప్రదర్శన చేస్తుందని చెప్పాడు. టీ20 ప్రపంచ కప్‌కు ముందు సీనియర్ ఆటగాళ్లు గత మార్చిలో చివరిగా అంతర్జాతీయ పరిమిత ఓవర్ల సిరీస్‌లో ఇంగ్లాండ్‌తో ఆడారని పేర్కొన్నాడు. ఇటీవల ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఆటగాళ్లు పాల్గొన్నప్పటికీ, ఏ లీగ్ క్రికెట్ అయినా అంతర్జాతీయ క్రికెట్ ప్రమాణాలకు సరిపోలలేదని స్పష్టం చేశాడు.
“భారతదేశం చివరిసారిగా మార్చిలో సీనియర్ ఆటగాళ్లందరితో పరిమిత ఓవర్ల సిరీస్‌ను ఆడింది. ఇప్పుడు మనం నవంబర్‌లో ఉన్నాం. కాబట్టి వారు ఆ అంతర్జాతీయ సిరీస్‌లను సీరియస్‌గా తీసుకోవడం లేదని అర్థమవుతుంది. వారు IPL ఆడితే సరిపోతుందని వారు భావిస్తున్నారు. మీరు లీగ్ క్రికెట్‌లో అంత ఎక్కువ ఆడతారు. మీకు కావలసిన ప్రపంచం. లీగ్ క్రికెట్ ఆడుతున్నప్పుడు, మీరు ప్రత్యర్థి జట్టులో ఒకరిద్దరు మంచి బౌలర్లను కనుగొంటారు. అంతర్జాతీయ క్రికెట్‌లో, మీరు ఐదుగురు మంచి బౌలర్లను ఎదుర్కొంటారు ”అని అక్రమ్ అన్నాడు. టాస్ ఓడిపోవడం కూడా భారత్ ఓటమికి ఒక కారణంగా చెప్పాడు.
“జులై చివరిలో శ్రీలంకలో భారత్ మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడింది. అయితే సీనియర్ ఈ మ్యాచ్‌ల్లో సీనియర్ ఆటగాళ్లు పాల్గొనలేదు. ఆదివారం నాటి మ్యాచ్‌లో భారత్ ఎనిమిది వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌తో ఓడిపోయి సెమీ-ఫైనల్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది” అ చెప్పాడు. రోహిత్‌ను మూడో స్థానంలో పంపడాన్ని కూడా అక్రమ్ తప్పుబట్టారు. “ఇది గొప్ప ఆట కాదు. ఇది ఏకపక్ష గేమ్. భారత్ చాలా తప్పులు చేసింది. టాస్ ఓడిపోయినప్పుడు, వారు మానసికంగా కొంచెం వెనక బడ్డారని నేను భావిస్తున్నాను. అతిపెద్ద గందరగోళం రోహిత్ శర్మను మూడో స్థానంలో పంపడం. కీలకమైన, డూ-ఆర్-డై మ్యాచ్‌లో ఓపెనర్‌గా కుర్రాడిని పంపారు” అని అక్రమ్ ఎత్తి చూపాడు.
Read Also.. T20 World Cup 2021: అంపైర్ మైఖేల్ గోఫ్పై ఐసీసీ వేటు.. ఆరు రోజులపాటు సస్పెండ్ చేస్తూ నిర్ణయం.. ఎందుకంటే..