T20 World Cup 2021: అంపైర్‌ మైఖేల్ గోఫ్‎పై ఐసీసీ వేటు.. ఆరు రోజులపాటు సస్పెండ్ చేస్తూ నిర్ణయం.. ఎందుకంటే..

ఇంగ్లిష్ అంపైర్ మైఖేల్ గోఫ్‎పై ఐసీసీ వేటు వేసింది. అతన్ని ఆరు రోజులపాటు సస్పెండ్ చేసింది. కోవిడ్ నిబంధనలో భాగమైన బయోబబూల్‌ బయటకు వచ్చి నిబంధనలు ఉల్లఘించినందుకు గాఫ్‌ను ఆరురోజుల పాటు అంపైరింగ్‌ విధుల నుంచి తప్పిస్తున్నట్లు మంగళవారం పేర్కొంది....

T20 World Cup 2021: అంపైర్‌ మైఖేల్ గోఫ్‎పై ఐసీసీ వేటు.. ఆరు రోజులపాటు సస్పెండ్ చేస్తూ నిర్ణయం.. ఎందుకంటే..
Umpair
Follow us

|

Updated on: Nov 02, 2021 | 8:08 PM

ఇంగ్లిష్ అంపైర్ మైఖేల్ గోఫ్‎పై ఐసీసీ వేటు వేసింది. అతన్ని ఆరు రోజులపాటు సస్పెండ్ చేసింది. కోవిడ్ నిబంధనలో భాగమైన బయోబబూల్‌ బయటకు వచ్చి నిబంధనలు ఉల్లఘించినందుకు గాఫ్‌ను ఆరురోజుల పాటు అంపైరింగ్‌ విధుల నుంచి తప్పిస్తున్నట్లు మంగళవారం పేర్కొంది. మైకెల్‌ గాఫ్‌ ప్రస్తుతం టీ20 ప్రపంచకప్‌ 2021లో ఫీల్డ్‌ అంపైర్‌గా వ్యవహరిస్తున్నారు. ఆరు రోజుల పాటు ఒంటరిగా ఉండాలని బయో-సెక్యూరిటీ అడ్వైజరీ కమిటీ అంపైర్ మైఖేల్ గోఫ్‌ను ఆదేశించింది.

అక్టోబర్‌ 29న మైకెల్‌ గాఫ్‌ బయోబబూల్‌ను దాటి బయటికి వెళ్లి కొంతమందిని కలిశాడు. ఈ విషయం తెలుసుకున్న ఐసీసీ నిబంధనలు ఉల్లఘించినందుకుగానూ గాఫ్‌ను అంపైరింగ్‌ విధుల నుంచి తప్పించి ఆరు రోజుల పాటు కఠిన క్వారంటైన్‌కు తరలించింది. హోటల్‌ను విడిచిపెట్టినట్లు నివేదిక అందిన వెంటనే ఐసీసీ ఈ నిర్ణయం తీసుకుంది. గత ఆదివారం దుబాయ్‌ ఇంటర్నేషనల్ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్‌ మధ్య జరిగిన మ్యాచ్‌కు అంపైర్‎గా ఉండాల్సింది. కాని అతను బయోబబూల్ నిబంధన ఉల్లంఘించినందున అతడిని తప్పించారు. అతడి స్థానంలో దక్షిణాఫ్రికాకు చెందిన మరైస్ ఎరాస్మస్‌ని నియమించారు.

టీ20 ప్రపంచ కప్‎లో గ్రూప్-2లో భారత్ వరుసగా రెండు మ్యాచ్‎లు ఓడిపోయి ఐదో స్థానంలో ఉంది. పాక్ అగ్రస్థానంలో ఉండగా.. ఆఫ్ఘానిస్తాన్ రెండు స్థానంలో, కివీస్ మూడో స్థానంలో ఉంది. ఇక గ్రూప్-1లో ఇంగ్లాండ్ సెమీస్‎కు దూసుకెళ్లింది. రెండో స్థానంలో సౌతాఫ్రికా, మూడో స్థానంలో ఆస్ట్రేలియా ఉంది.

Read Also.. Blatant Cheating: గాల్లోకి బంతి లేపింది.. పట్టుకోకుండా అడ్డుకుంది.. చివరికి ఏమైందంటే..