T20 World Cup 2021: అశ్విన్‎ను ఎందుకు తీసుకోలేదు.. దీనిపై విచారణ చేయాలి.. వెంగ్‎సర్కార్..

టీ20 ప్రపంచ కప్ భారత‎ తుది జట్టులోకి అశ్విన్‎ను తీసుకోకపోవడంపై మాజీ చీఫ్ సెలెక్టర్ దిలీప్ వెంగ్‌సర్కార్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ప్లేయింగ్ ఎలెవన్ నుంచి అశ్విన్‌ను పదేపదే మినహాయించడంపై దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశాడు...

T20 World Cup 2021: అశ్విన్‎ను ఎందుకు తీసుకోలేదు.. దీనిపై విచారణ చేయాలి.. వెంగ్‎సర్కార్..
Ashwin
Follow us
Srinivas Chekkilla

|

Updated on: Nov 02, 2021 | 9:37 PM

టీ20 ప్రపంచ కప్ భారత‎ తుది జట్టులోకి అశ్విన్‎ను తీసుకోకపోవడంపై మాజీ చీఫ్ సెలెక్టర్ దిలీప్ వెంగ్‌సర్కార్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ప్లేయింగ్ ఎలెవన్ నుంచి అశ్విన్‌ను పదేపదే మినహాయించడంపై దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశాడు. పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఏ మాత్రం ప్రభావం చూపని మిస్టరీ స్పిన్నర్‌ వరుణ్‌ చక్రవర్తిని కివీస్‌తో మ్యాచ్‌లోనూ ఆడించారని. దీంతో రెండు మ్యాచ్‌ల్లో అవకాశం వచ్చినా అతడు నిరూపించుకోలేకపోయాడని అన్నాడు. సీనియర్‌ స్పిన్నర్‌ను కాదని అతడిని ఎందుకు తీసుకున్నారని వెంగ్‌సర్కార్‌ అసహనం వ్యక్తం చేశారు. “ఆటగాళ్లు మందకొడిగా కనిపించారు. ఇది బయోబబుల్ అలసట లేదా మరేదైనా నాకు తెలియదు, నేను చాలా కాలంగా ఆటగాళ్లలో అలాంటి బాడీ లాంగ్వేజ్ చూడలేదు” అని వెంగ్‌సర్కర్ అన్నాడు.

న్యూజిలాండ్‌తో ఎనిమిది వికెట్ల పరాజయం. “బ్యాటింగ్, బౌలింగ్‌లో ఇది చాలా పేలవమైన ప్రదర్శన. ఈ ఫార్మాట్ మిమ్మల్ని బాల్ వన్ నుండి ఎనర్జిటిక్‌గా ఉండాలని కోరుతుంది” అని చెప్పాడు. “అశ్విన్‌ని ఇంత కాలం ఎందుకు తొలగించారు? ఇది విచారణకు సంబంధించిన విషయం. ఫార్మాట్‌లలో అతను 600 కంటే ఎక్కువ అంతర్జాతీయ వికెట్లు సాధించిన అత్యుత్తమ స్పిన్నర్. అతను సీనియర్ మోస్ట్ స్పిన్నర్, మీరు అతనిని ఎంపిక చేయరు.” అని అన్నాడు. ఇంగ్లండ్‌ టెస్టు సిరీస్‌లో ఒక్క మ్యాచ్‌ కూడా ఆడలేదు. అలాంటప్పుడు అతన్ని ఎందుకు ఎంచుకుంటారు? ఇది నాకు మిస్టరీగా ఉంది.” హార్దిక్ పాండ్యా ఆదివారం టోర్నమెంట్‌లో మొదటిసారి బౌలింగ్ చేశాడని చెప్పాడు.

గత ఆదివారం న్యూజిలాండ్‎తో జరిగిన మ్యాచ్‎లో భారత్ ఎనిమిది వికెట్ల తేడాతో ఓడిపోయింది. మొదట బ్యాటింగ్ చేసిన ఇండియా 20 ఓవర్లకు ఏడు వికెట్లు కోల్పోయి 110 పరుగులు చేసింది. రవీంద్ర జడేజా 23 పరుగులు, హార్దిక్ పాండ్యా 23 పరుగులు చేశారు. కివీస్ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్ మూడు వికెట్లు తీశాడు. మిచేల్ 49 పరుగులు, కేన్ విలియమ్సన్ 33 పరుగులతో రాణించడంతో న్యూజిలాండ్ 14.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. అంతకుముందు ఆదివారం పాకిస్తాన్‎తో జరిగిన మ్యాచ్‎లో ఇండియా 10 వికెట్ల తేడాతో ఓడిపోయింది. దీంతో గ్రూప్-2 ఐదో స్థానంలో నిలిచిన భారత్ సెమీస్ ఆశలు గల్లంతు చేసుకుంది.

Read Also.. T20 World Cup 2021: ఐపీఎల్ ఆడితే చాలనుకుంటున్నారు.. అందుకే ఓడిపోయారు.. వసీం అక్రమ్..

బాబోయ్‌ ఇదేం రద్దీరా సామీ..! అందమైన నగరాన్ని నరకంలా మార్చేశారుగా
బాబోయ్‌ ఇదేం రద్దీరా సామీ..! అందమైన నగరాన్ని నరకంలా మార్చేశారుగా
ప్రశాంత్ కిషోర్ దీక్ష భగ్నం.. ఆస్పత్రికి తరలించిన పోలీసులు
ప్రశాంత్ కిషోర్ దీక్ష భగ్నం.. ఆస్పత్రికి తరలించిన పోలీసులు
అరెరె.. ఈ డాక్టరమ్మను ఎక్కడో చూసినట్లు ఉంది కదా.. గుర్తు పట్టారా?
అరెరె.. ఈ డాక్టరమ్మను ఎక్కడో చూసినట్లు ఉంది కదా.. గుర్తు పట్టారా?
ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా X ఫ్యాక్టర్‌ ఇతడే.. ఇదిగో ప్రూఫ్
ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా X ఫ్యాక్టర్‌ ఇతడే.. ఇదిగో ప్రూఫ్
మిర్చి రైతు వినూత్న ఆలోచన..పొలంలో పెట్టిన ఫ్లెక్సీ చూస్తే అవాక్కే
మిర్చి రైతు వినూత్న ఆలోచన..పొలంలో పెట్టిన ఫ్లెక్సీ చూస్తే అవాక్కే
ఒళ్లు గగుర్పొడిచే దృశ్యాలు.. పూజారి ఇంట్లోకి వచ్చిన చిరుత..
ఒళ్లు గగుర్పొడిచే దృశ్యాలు.. పూజారి ఇంట్లోకి వచ్చిన చిరుత..
మరో మంచి పనికి శ్రీకారం చుట్టిన స్టార్ హీరో కిచ్చా సుదీప్
మరో మంచి పనికి శ్రీకారం చుట్టిన స్టార్ హీరో కిచ్చా సుదీప్
కోహ్లీకి అదొక్కటే దారి! విలువైన సలహా ఇచ్చిన ఫేమస్ క్రికెటర్..
కోహ్లీకి అదొక్కటే దారి! విలువైన సలహా ఇచ్చిన ఫేమస్ క్రికెటర్..
గిన్నిస్ వరల్డ్ రికార్డులో తెలంగాణడ్రిల్ మ్యాన్.ఒళ్లు గగుర్పొడిచే
గిన్నిస్ వరల్డ్ రికార్డులో తెలంగాణడ్రిల్ మ్యాన్.ఒళ్లు గగుర్పొడిచే
రజనీకాంత్‌కు గుడి కట్టి పూజలు చేస్తోన్న రిటైర్డ్ జవాన్.. వీడియో
రజనీకాంత్‌కు గుడి కట్టి పూజలు చేస్తోన్న రిటైర్డ్ జవాన్.. వీడియో