Bitter taste foods: ఈ ఐదు చేదు పదార్థాలలో మేలు చేసే గుణాలే ఎక్కువ... (వీడియో)

Bitter taste foods: ఈ ఐదు చేదు పదార్థాలలో మేలు చేసే గుణాలే ఎక్కువ… (వీడియో)

Anil kumar poka

|

Updated on: Nov 04, 2021 | 9:17 AM

చేదు ఆహార పదార్థాలను తినడానికి చాలా మంది ఇష్టపడరు..కానీ శరీరానికి మేలు చేసి మనల్ని ఆరోగ్యంగా ఉంచడంలో చేదు ఆహార పదార్థాలు పనిచేస్తాయి. చేదు తినడం కష్టమే అయినా .. అనారోగ్య సమస్యలను తగ్గించడంలో చేదు రుచి కల్గిన ఆహార పదార్థాలు ప్రధాన పాత్ర పోషిస్తాయి.


చేదు ఆహార పదార్థాలను తినడానికి చాలా మంది ఇష్టపడరు..కానీ శరీరానికి మేలు చేసి మనల్ని ఆరోగ్యంగా ఉంచడంలో చేదు ఆహార పదార్థాలు పనిచేస్తాయి. చేదు తినడం కష్టమే అయినా .. అనారోగ్య సమస్యలను తగ్గించడంలో చేదు రుచి కల్గిన ఆహార పదార్థాలు ప్రధాన పాత్ర పోషిస్తాయి. సాధారణంగా చేదు రుచి కల్గిన పదార్థాలలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. మెంతులు చేదుగా ఉన్నప్పటికీ ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఇందులో ఖనిజాలు.. విటమిన్లు. ఫైబర్ పుష్కలంగా ఉంది. మెంతులను తీసుకోవడం వలన మలబద్దకం సమస్య తగ్గుతుంది. అలాగే రక్తంలో షుగర్ లెవల్స్ నియంత్రించడంలో భేషుగ్గా పనిచేస్తాయి.

కాకర కాయ ఆరోగ్యానికి మేలు చేస్తుందని అందరికి తెలిసిన విషయమే. ఇందులో విటమిన్ ఎ, సి, పోటాషియం, యాంటీ ఆక్సిడెంట్స్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. కాకర కాయ మధుమేహాన్ని నియంత్రిచండంలో ఎక్కువగా సహాయపడుతుంది. గ్రీన్ టీ రుచికి చేదుగా ఉన్నప్పటికీ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. పాలతో స్వీట్ టీ బదులుగా గ్రీన్ టీ తీసుకోవడం వలన బరువు తగ్గుతారు.. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండటంతో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.

బచ్చలికూర ఇతర ఆకు కూరలు కాస్త వగరుగా ఉంటాయి. అయితేనేం ఇవి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. వీటిలో ఉండే ఐరన్, కాల్షియం, విటమిన్స్, ఇతర పోషకాలు శరీరానికి మంచివి. మినల్ని ఫిట్ గా ఉంచడంలో సహాయపడతాయి. డార్క్ చాక్లెట్ తినడానికి కొందరు ఆసక్తి చూపించరు. డార్క్ చాక్లెట్ చేదుగా ఉంటుంది. ఇందులో కోకో పౌడర్ కలపడం వలన చేదుగా ఉంటుంది. కోకో పౌడర్‌ బీన్స్ నుండి తయారవుతుంది. ఇందులో జింక్, కాపర్, మెగ్నీషియం, ఐరన్, యాంటీ ఆక్సిడెంట్స్ ఒత్తిడి తగ్గించి గుండె ఆరోగ్యాన్నిస్తాయి.

మరిన్ని చదవండి ఇక్కడ: Rashmika Mandanna: అయ్యయ్యో.. అందాల ముద్దుగుమ్మను ఇలా చేశారేంటీ సుకుమార్ సర్.. రష్మిక ఎలా మారిపోయిందో చూశారా..(ఫొటోస్)

Hebah Patel: ఏంజెల్ లా మెరుస్తున్న ‘హెబ్బా పటేల్’.. ఇలా చుస్తే ఎవరైనా పడిపోవాల్సిందే.. (ఫొటోస్)