Woman Delivers 4 babies: హైదరాబాద్‌లో అరుదైన ప్రసవం.. ఓ గర్భిణికి అత్యంత అరుదుగా నలుగురు బిడ్డలు.. (వీడియో)
హైదరాబాద్‌లో అరుదైన ఘటన చోటు చేసుకుంది. ఓ గర్భిణి మహిళ అత్యంత అరుదుగా నలుగురు బిడ్డలకు జన్మనిచ్చింది.. మెహదీపట్నంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఓ నిండుగర్భిణి పురిటినొప్పులతో ప్రసవం కోసం చేరింది. అయితే...
Hyd delivers 4 babies: హైదరాబాద్‌లో అరుదైన ఘటన చోటు చేసుకుంది. ఓ గర్భిణి మహిళ అత్యంత అరుదుగా నలుగురు బిడ్డలకు జన్మనిచ్చింది.. మెహదీపట్నంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఓ నిండుగర్భిణి పురిటినొప్పులతో ప్రసవం కోసం చేరింది. అయితే ఆపరేషన్ చేసిన డాక్టర్లే ఆశ్చర్యపోయేలా ఆమె ఒకరిద్దరు కాదు ఏకంగా నలుగురు బిడ్డలకు జన్మనిచ్చింది. పుట్టిన నలుగురు పిల్లలు కూడా పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఒకే కాన్పులో నలుగురు బిడ్డలను కనడం చాలా అరుదని, పుట్టిన నలుగురూ ఆరోగ్యవంతంగా వుండటం మరీ అరుదని డాక్టర్లు అభిప్రాయపడుతున్నారు. ఒకేసారి నలుగురు బిడ్డలు పుట్టడంతో ఆ తల్లిదండ్రుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది. తల్లీ, బిడ్డలు క్షేమంగా వున్నట్లు డాక్టర్లు చెబుతున్నారు. కొన్నిరోజులు తమ పర్యవేక్షణలో తల్లీ బిడ్డలను వుంచుకుని ఎలాంటి సమస్యలులేకుంటే డిశ్చార్జి చేసి పంపిస్తామని హాస్పిటల్ సిబ్బంది తెలిపారు.
మరిన్ని చదవండి ఇక్కడ: Unstoppable With NBK: అనిపించింది అందాం.. అనుకుంది చేద్దాం.. ఎవడాపుతాడో చూద్దాం.. దుమ్ములేపిన బాలయ్య..(ట్రేండింగ్ ఫొటోస్)
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

