Heart Attack: ఎక్కువగా బాత్‌రూమ్‌లోనే గుండెపోటు ఎందుకు వస్తుంది..? పరిశోధనలలో కీలక విషయాలు

Heart Attack: మారుతున్న కాలానుగుణంగా వివిధ రకాల వ్యాధుల బారిన పడే వారి సంఖ్య పెరిగిపోతోంది. రోజువారీ ఆహారపు అలవాట్ల కారణంగా మానవుడికి వ్యాధులు..

Heart Attack: ఎక్కువగా బాత్‌రూమ్‌లోనే గుండెపోటు ఎందుకు వస్తుంది..? పరిశోధనలలో కీలక విషయాలు
Follow us
Subhash Goud

| Edited By: Ravi Kiran

Updated on: Nov 07, 2021 | 7:37 AM

Heart Attack: మారుతున్న కాలానుగుణంగా వివిధ రకాల వ్యాధుల బారిన పడే వారి సంఖ్య పెరిగిపోతోంది. రోజువారీ ఆహారపు అలవాట్ల కారణంగా మానవుడికి వ్యాధులు దరిచేరుతున్నాయి. అయితే ఈ మధ్య కాలంలో గుండెపోటుతో బాధపడేవారి సంఖ్య కూడా పెరిగిపోతోంది. ఒకప్పుడు అధిక వయసు ఉన్నవారికి మాత్రమే గుండెపోటు వచ్చేది. కానీ ఇప్పుడున్న రోజుల్లో యుక్త వయసులో ఉన్నవారు కూడా గుండెపోటు బారిన పడుతున్నారు. పాతికేళ్ల వయసులోనే గుండెపోటుతో ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే చాలా మంది బాత్‌రూమ్‌లోనే గుండెపోటుతో కుప్పకూలిపోతున్నారు. మరీ బాత్‌రూమ్‌లోనే ఎందుకు గుండెపోటు వస్తుందనే దానిపై పరిశోధకులు పరిశోధనలు చేయగా, పలు విషయాలు వెల్లడైనట్లు పరిశోధకులు చెబుతున్నారు.

గుండెకు సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న వారు బాత్‌రూమ్‌లో వెళ్లినప్పుడు గుండెపోటు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. అమెరికా ఏజెన్సీ ఎన్‌సీబీఐ నివేదిక ప్రకారం.. ప్రపంచ వ్యాప్తంగా 11 శాతం గుండెపోటు మరణాలు బాత్‌రూమమ్‌లోనే జరుగుతున్నాయని గుర్తించారు.

స్నానం చేసేట‌ప్పుడు .. స్నానం చేసే సమయంలో చాలా మంది ముందుగా తలని రుద్దుకుంటారు. దాని వల్ల వేడి రక్తం గల శరీరం ఒక్కసారిగా చల్లటి ఉష్ణోగ్రతను బ్యాలెన్స్‌ చేసుకోలేకపోవడం వల్ల గుండెపోటుకు గురయ్యే ప్రమాదం ఉందంటున్నారు నిపుణులు. అన్ని విధాలుగా తల భాగం వైపు రక్త ప్రసరణ పెరుగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో రక్త నాళాల్లో ఏవైనా అడ్డంకులు ఉంటే గుండెపోటు వస్తుందని చెబుతున్నారు. అయితే శీతాకాలంలో ఇలాంటి గుండెపోటు ఘటనలు ఎక్కువగా సంభవిస్తాయని నిపుణులు చెబుతున్న మాట.

పైవైపు వెళ్లకపోవడమే మంచిది.. స్నానం చేసేటప్పుడు ముందుగా పాదాలను తడుపుకొని ఆ తర్వాత పైవైపు వెళ్లకుండా ఉండడమే మంచిదని, ముఖ్యంగా రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్‌, మైగ్రేన్‌తో బాధపడుతున్నవారు ఇలాంటివి పాటించాలంటున్నారు.

మలబద్దకం సమస్యతో.. ఇక మలమద్దకం సమస్యతో బాధపడుతున్నవారు విసర్జన సమయంలో బాత్‌రూమ్‌లో ఇబ్బందులకు గురవుతుంటారు. అలాంటి సమయంలో గుండెపోటు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని నిపుణులు వెల్లడిస్తున్నారు. అందుకే గుండెకు సంబంధిత సమస్యలతో బాధపడుతున్నవారితో పాటు మలబద్దకం ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. తలపై నుంచి స్నానం చేసే జాగ్రత్తలు తీసుకోవడం మంచిదంటున్నారు.

చలికాలంలో ఎక్కువగా గుండెపోటు.. ఇక శీతాకాలంలో రక్త నాళాలు కుంచించుకుపోతాయి. ఇరుకైన రక్తనాళాల గుండా రక్తం వెళ్లడానికి ఎక్కువ ఒత్తిడి పెరుగుతుంది. ఈ కారణంగా రక్తపోటు వచ్చే అవకాశాలుంటాయి. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ ప్రకారం.. తీవ్రమైన చలి సమయంలో రక్తం మందంగా, జిగటగా మారుతుంది. ఇది రక్తం గడ్డకట్టడాన్ని సులభతరం చేస్తుంది. చాలా స్ట్రోక్స్‌ రక్తం గడ్డకట్టడం వల్లనే సంభవిస్తాయి. న్యూయార్క్‌ మౌంట్ సినాయ్‌ ఐకాన్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ ప్రకారం.. శీతాకాలంలో జలుబు, ఫ్లూ నుంచి రక్షణ పొందడానికి రోగనిరోధక వ్యవస్థ రక్త స్థాయిలు అనేక రెట్లు పెరుగుతాయి. దీనివల్ల ధమనుల గోడలపై ప్లేక్స్‌ పేరుకుపోతాయి. ఇది గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతుంది.

గుండె సమస్యలను తగ్గించుకోవాలంటే.. అయితే శీతాకాలంలో గుండెకు సంబంధించిన సమస్యలను తగ్గించుకునేందుకు ఎన్నో మార్గాలున్నాయి. వీటిలో ముఖ్యంగా నిత్యం 20 నిమిషాల సూర్యకాంతిలో ఉండటం, ఆహారంలో 30 శాతం ప్రొటీన్లు తీసుకోవడం, రోజూ 40 నిమిషాలు పాటు వ్యాయామం చేయడం వంటివి. వీటి వల్ల ఎంతో ఉపయోగం ఉంటుంది. వీటిని పాటించడం వల్ల చలికాలంలో గుండెపోటు నుంచి రక్షించుకోవచ్చని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. ప్రతి రోజు కనీసం 20 నిమిషాల పాటు సూర్యకాంతిలో ఉన్నట్లయితే గుండెకు సంబంధిత వ్యాధుల నుంచి దూరం కావచ్చంటున్నారు. సూర్యరశ్మి కారణంగా శరీరం శరీరంలో యాంటీబాడీలను ఎక్కువగా తయారవుతాయి. ఈ సూర్యకాంతి మనకు వాపు, అధిక రక్తపోటును కూడా తగ్గిస్తుంది. మెదడు పని చేసే సామర్థ్యాన్ని మెరుగు పరుస్తుంది. అందువల్ల నిత్యం 20 నిమిషాలపాటు ఉదయం ఎండలో కూర్చోవడం అలవాటు చేసుకోవడం మంచిదంటున్నారు నిపుణులు. చలికాలంలో ప్రతి రోజు కనీసం 40 నిమిషాల పాటు వ్యాయామం చేయడం వల్ల గుండె సమస్యల నుంచి గట్టెక్కవచ్చంటున్నారు నిపుణులు.

ఇవి కూడా చదవండి:

Children Health: తల్లిపాలతో న్యుమోనియాకు చెక్‌.. పిల్లల్లో ఆ వ్యాధులు రాకుండా ఉండాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలి!

Hand Numbness: మీకు తిమ్మిర్లు ఎక్కువగా వస్తున్నాయా..? కారణాలు ఏమిటి.. వైద్యులేమంటున్నారు..?

Carrots Benefits: క్యారెట్‌తో ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో తెలుసా..? గుండె ఆరోగ్యానికి మంచి ఔషధం..!

Ginger Tea: ప్రతి రోజు ఉదయాన్నే అల్లం టీ తాగితే ఎన్నో ఉపయోగాలు.. తెలిస్తే తాగకుండా ఉండలేరు..!