Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Alcohol: మద్యం తాగుతున్నారా.. ఇది మీకు బ్యాడ్ న్యూసే.. మీ బాడీలో ‘నిషా’ ఎప్పటివరకు ఉంటుందంటే..

ప్రస్తుతం యువతలో మద్యం తాగే ట్రెండ్ నెలకొంది. కొంత మంది యువకులు హాబీ కోసం, మరికొందరు స్టైల్ కోసం మద్యం తాగుతున్నారు. ఆల్కహాల్ ఒక మాదక పదార్ధం, ఇది ఒక రకమైన డిప్రెసెంట్‌గా..

Alcohol: మద్యం తాగుతున్నారా.. ఇది మీకు బ్యాడ్ న్యూసే.. మీ బాడీలో ‘నిషా’ ఎప్పటివరకు ఉంటుందంటే..
Alcohol
Follow us
Sanjay Kasula

|

Updated on: Nov 10, 2021 | 2:31 PM

ప్రస్తుతం యువతలో మద్యం తాగే ట్రెండ్ నెలకొంది. కొంత మంది యువకులు హాబీ కోసం, మరికొందరు స్టైల్ కోసం మద్యం తాగుతున్నారు. ఆల్కహాల్ ఒక మాదక పదార్ధం, ఇది ఒక రకమైన డిప్రెసెంట్‌గా కూడా పరిగణించబడుతుంది. ఆల్కహాల్ శరీరంలో ఉండిపోతే అది కొద్ది కాలమే అయినా దాని ప్రభావం ఎక్కువ కాలం ఉంటుంది. మీరు ఆల్కహాల్ తాగినప్పుడు అది మీ రక్తప్రవాహంలోకి ప్రవేశిస్తుంది. తర్వాత అది నెమ్మదిగా మొత్తం శరీరానికి చేరుతుంది. ఆల్కహాల్ మెటబాలైజ్ కావడానికి దాదాపు రెండు గంటల సమయం పడుతుంది. అటువంటి పరిస్థితిలో మద్యం సేవించిన తర్వాత  అది శరీరంలో ఎంతకాలం ఉంటుంది. దాని ప్రభావం ఏమిటో తెలుసుకుందాం.

ఆల్కహాల్ ప్రభావం తగ్గడానికి ఎంత సమయం పడుతుంది?

ఆల్కహాల్‌ను జీర్ణం చేయడం కూడా స్థిరమైన జీవక్రియ రేటును కలిగి ఉంటుంది. అయితే కొందరు వ్యక్తులు చాలా కాలం పాటు ఆల్కహాల్‌తో ప్రభావితమవుతారు. ప్రతి ఒక్కరికి రక్తంలో ఆల్కహాల్ గాఢత భిన్నంగా ఉండటం దీనికి కారణం. ఒకరి లోపల ఆల్కహాల్ స్థాయి 20 mg/dL ఉంటే ప్రతి వ్యక్తిలో ఆల్కహాల్ ఒక గంటలో జీవక్రియ చేయబడుతుంది. అయితే BACలు చాలా మారవచ్చు.

ఆల్కహాలిక్ డ్రింక్స్ మెటాబోలైజ్ చేసే సమయం ఇలా..

చిన్న షాట్ – 1

 పింట్ బీర్ – 2 గంటలు

పెద్ద గ్లాసు వైన్ – 3 గంటలు

కొన్ని పెద్ద పానీయాలు – కొన్ని గంటలు

మీ శరీరం ఆల్కహాల్‌ను గ్రహించడంలో సహాయపడే ఆహారం వంటి ఆల్కహాల్ ప్రభావాలను తగ్గించడంలో సహాయపడటానికి మీరు తీసుకోగల దశలు ఉన్నాయి. నీరు మీ BACని తగ్గించడంలో సహాయపడుతుంది. కాఫీ, ఎనర్జీ డ్రింక్స్ లేదా ఇతర పానీయాలు మత్తును త్వరగా తగ్గిస్తాయి.

ఆల్కహాల్ ఎలా జీవక్రియ చేయబడుతుంది?

మీరు ఆల్కహాల్ తీసుకున్నప్పుడల్లా అది మొదట జీర్ణవ్యవస్థలోకి ప్రవేశిస్తుంది. ఆహారం, ఇతర పానీయాల మాదిరిగా ఆల్కహాల్ జీర్ణం కాదని మీకు తెలియజేద్దాం. అయినప్పటికీ, దాదాపు 20 శాతం ఆల్కహాల్ నేరుగా రక్తంలోకి వెళుతుంది, అది మీ మెదడుకు చేరుకుంటుంది. మిగిలిన 80 శాతం పేగుల్లోనే ఉంటుంది. ఇది కాలేయంపై కూడా ప్రభావం చూపుతుంది.

నేటి కాలంలో, మద్యం సేవించిన 80 గంటల తర్వాత, మీరు మూత్ర పరీక్ష ద్వారా మద్యం సేవించే సమయాన్ని తెలుసుకోవచ్చు. శ్వాస పరీక్షతో, మీరు సుమారు 24 గంటల్లో మద్యం సేవించే సమయాన్ని కనుగొనవచ్చు.  

ఇవి కూడా చదవండి: Chanakya Niti: శత్రువును ద్వేషించకు స్నేహితుడిలా చూడు.. చాణక్యుడు చెప్పిన సక్సెస్ సీక్రెట్ ఇదే..

Mukesh Ambani Antilia Case: ముఖేష్ అంబానీ కుటుంబానికి ఎలాంటి ముప్పు లేదు.. చిరునామా అడిగిన వ్యక్తి ఎవరో తేల్చిన పోలీసులు..