వీటిని రోజూ పిడికెడు తింటే చాలు.. పొద్దు తిరుగుడు పువ్వంత అందం మీ సొంతం..!
పొద్దుతిరుగుడు విత్తనాల గురించి దాదాపుగా అందరికీ తెలుసు.. కానీ, అవి ఆరోగ్యానికి, చర్మానికి చాలా ప్రయోజనకరంగా ఉంటాయని చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. మీ చర్మాన్ని సహజంగా మెరిపించుకోవాలనుకుంటే పొద్దుతిరుగుడు విత్తనాలు ఎంతగానో సహాయపడతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. వాటిని క్రమం తప్పకుండా తినడం వల్ల మీకు పోషకాలు లభించడమే కాదు.. అనేక వ్యాధుల నుండి మిమ్మల్ని దూరంగా ఉంచుతాయి.

మీ చర్మాన్ని సహజంగా మెరిసేలా చేసుకోవాలనుకుంటే కొన్ని విత్తనాలు మీకు అద్భుతంగా సహాయపడతాయి. వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మీకు పోషకాలు లభించడమే కాకుండా, అనేక వ్యాధుల నుండి మిమ్మల్ని దూరంగా ఉంచుతుంది. అలాంటి విత్తనాలలో పొద్దు తిరుగుడు అతి ముఖ్యమైనవి. మీ ముఖం మీద మొటిమలు, మచ్చలు రాకుండా ఉండాలంటే ఈ గింజలను రోజూ తినమని నిపుణులు సూచిస్తున్నారు. దీంతో మీ చర్మం మెరుస్తుందని చెబుతున్నారు.
పొద్దుతిరుగుడు చెట్టు శాస్త్రీయ నామం హెలియంతస్ అన్నూస్. దీని ఒక్క పువ్వులో దాదాపు 2000 విత్తనాలు ఉంటాయని చెబుతారు. ఈ విత్తనాలను సాధారణంగా ఎండబెట్టి లేదా వేయించి తింటారు. దానికి ఉప్పు కలిపితే మరింత రుచిగా ఉంటుంది. కేవలం రుచిలో మాత్రమే కాదు.. పొద్దుతిరుగుడు విత్తనాలలో ఖనిజాలు, రాగి, మాంగనీస్, ఇనుము, జింక్, మెగ్నీషియం, భాస్వరం, పొటాషియం, కాల్షియం, సెలీనియం వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి చర్మానికి, ముఖ్యంగా శీతాకాలంలో అవసరమైన అంశాలు.
పొద్దుతిరుగుడు విత్తనాలలో విటమిన్ E లభిస్తుంది. ఇది చర్మానికి చాలా ఉపయోగకరం. ఇది వృద్ధాప్య సంకేతాలను దూరం చేస్తుంది.. ఇందులో యాంటీఆక్సిడెంట్ సెలీనియం ఉంటుంది. విటమిన్ E చర్మాన్ని రిపేర్ చేయడంలో సహాయపడుతుంది. వాటిలో రాగి కూడా ఉంటుంది. ఇది చర్మంలో మెలనిన్ ఉత్పత్తిని పెంచుతుంది. ఇది చర్మానికి మెరుపును ఇస్తుంది.
ఇన్ని లాభాలు కలిగిన పొద్దుతిరుగుడు విత్తనాలు ఆరోగ్యానికి ఒక నిధి అంటున్నారు ఆయుర్వేద నిపుణులు. మధుమేహం, అధిక రక్తపోటు (అధిక బిపి), గుండె జబ్బులు ఉన్న రోగులకు అవి చాలా ప్రయోజనకరంగా ఉంటాయి.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..








