AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch: మరోసారి స్టెప్పులతో ఇరగదీసిన ట్రంప్.. మలేసియా రెడ్ కార్పెట్‌ వెల్కమ్‌లో డాన్స్

మలేషియన్‌ సంప్రదాయ నృత్య కళాకారుల బృందంతో కలిసి సాంప్రదాయ నృత్యం చేస్తూ స్వాగతించారు. ఈ సందర్భంగా రెడ్ కార్పెట్‌పై ట్రంప్ తనదైన స్టయిల్‌లో డ్యాన్స్ చేస్తూ సందడి చేశారు. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్‌నెట్‌లో వేగంగా దూసుకెళ్తోంది. దీంతో ట్రంప్‌ మరోసారి ప్రజల దృష్టిని విపరీతంగా ఆకర్షించారు.

Watch: మరోసారి స్టెప్పులతో ఇరగదీసిన ట్రంప్.. మలేసియా రెడ్ కార్పెట్‌ వెల్కమ్‌లో డాన్స్
Trump Dance At Malaysia
Jyothi Gadda
|

Updated on: Oct 26, 2025 | 12:09 PM

Share

అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ డ్యాన్స్ చేస్తున్న వీడియో సోషల్ విపరీతంగా వైరల్‌ అవుతోంది. మలేసియాలో ఆసియాన్ సదస్సుకు హాజరైన డొనాల్డ్ ట్రంప్ తన ప్రత్యేక శైలిని ప్రదర్శించాడు. ఆదివారం కౌలాలంపూర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో మలేషియాలో అడుగుపెట్టగానే ఆ దేశ ప్రధాన మంత్రి అన్వర్ ఇబ్రహీం ట్రంప్‌కు ఘన స్వాగతం పలికారు. మలేషియన్‌ సంప్రదాయ నృత్య కళాకారుల బృందంతో కలిసి సాంప్రదాయ నృత్యం చేస్తూ స్వాగతించారు. ఈ సందర్భంగా రెడ్ కార్పెట్‌పై ట్రంప్ తనదైన స్టయిల్‌లో డ్యాన్స్ చేస్తూ సందడి చేశారు. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్‌నెట్‌లో వేగంగా దూసుకెళ్తోంది. దీంతో ట్రంప్‌ మరోసారి ప్రజల దృష్టిని విపరీతంగా ఆకర్షించారు.

వీడియో ఇక్కడ చూడండి..

ఇవి కూడా చదవండి

ట్రంప్ ఈ డ్యాన్స్‌ వీడియోని వైట్ హౌస్ అధికారిక వెబ్‌సైట్‌ ఆన్‌లైన్‌లో షేర్ చేసింది. అది త్వరగా వైరల్ అయింది. సోషల్ మీడియా వినియోగదారులు ఫన్నీ, కామెంట్స్‌తో ప్రశంసలు కురిపించారు. బిగ్ బాస్ ఎనర్జీ అంటూ ఒకరు రాశారు.. డోనాల్డ్ ట్రంప్ ఎయిర్ ఫోర్స్ వన్ నుండి దిగి అన్వర్ ఇబ్రహీం ఆ మెట్ల దిగువన వేచి ఉండగా, ప్రపంచ వేదికలో సగం మందికి చెమటలు పట్టించే ప్రవేశ ద్వారం ఇది అంటూ మరొకరు రాశారు.

ట్రంప్ వేసిన స్టెప్స్ చూడాల్సిందే..

ఇకపోతే, అమెరికా వాణిజ్య సంబంధాలు, ప్రపంచ ప్రభావాన్ని బలోపేతం చేయడానికి ట్రంప్ ఆసియా అంతటా ఐదు రోజుల పర్యటనలో ఉన్నారు. మలేషియా తర్వాత, ఆయన టోక్యోలో కొత్తగా ఎన్నికైన జపాన్ నాయకుడు సనే తకైచిని, దక్షిణ కొరియాలో చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్‌ను కలవనున్నారు. ఉత్తర కొరియా నాయకుడు కిమ్ జోంగ్ ఉన్‌ను పలకరించడానికి కొరియా నిస్సైనిక మండలంలో చివరి నిమిషంలో ఆగే అవకాశం ఉందని కూడా ఊహాగానాలు ఉన్నాయి.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..