AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vastu Tips: ఈ 4 వస్తువులను ఇంటి 4 దిక్కులలో పెట్టారంటే..డబ్బే డబ్బు..! కుబేరులవ్వడం గ్యారంటీ!!

కొన్నిచిన్న చిన్న వాస్తు శాస్త్ర నియమాలు పాటించటం వల్ల ఇంట్లోని దోషాలను తొలగించి సానుకూల శక్తిని ప్రవహించేలా చేస్తాయి. ఇది ఆర్థిక సమస్యలను తొలగించి ధన ప్రవాహాన్ని పెంచుతుంది. ఈ క్రింది దశలను అనుసరించడం ద్వారా ఇంటికి సంపద, శ్రేయస్సును ఆకర్షించవచ్చునని నిపుణులు చెబుతున్నారు. అవేంటో తెలుసుకుందాం..

Vastu Tips: ఈ 4 వస్తువులను ఇంటి 4 దిక్కులలో పెట్టారంటే..డబ్బే డబ్బు..! కుబేరులవ్వడం గ్యారంటీ!!
Vastu Shastra
Jyothi Gadda
|

Updated on: Oct 26, 2025 | 8:40 AM

Share

ప్రతి ఒక్కరికీ మనుగడ సాగించడానికి డబ్బు అవసరం. వారి అవసరాలను తీర్చుకోవడమే కాదు, భవిష్యత్తు భద్రత కోసం కూడా డబ్బు కావాలి.. అయితే, కొంతమంది ఎంత ప్రయత్నించినా ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటారు. వాస్తు శాస్త్రం అనేది జీవితంలోని వివిధ సమస్యలను పరిష్కరించడానికి ప్రభావవంతమైన సూచనలను అందించే ఒక పురాతన శాస్త్రం. ఇది ఆర్థిక సమస్యలను అధిగమించడానికి కొన్ని ప్రత్యేక పరిష్కారాలను సూచిస్తుంది. ఇంట్లో సానుకూల శక్తి ప్రవాహాన్ని పెంచడం ద్వారా సంపద, ఆనందం, శ్రేయస్సును ఆకర్షించవచ్చని వాస్తు శాస్త్రం చెబుతుంది. ఈ రోజు, ఇంట్లో డబ్బు ప్రవాహాన్ని గణనీయంగా పెంచే కొన్ని వాస్తు చిట్కాలను తెలుసుకుందాం.

కొన్నిచిన్న చిన్న వాస్తు శాస్త్ర నియమాలు పాటించటం వల్ల ఇంట్లోని దోషాలను తొలగించి సానుకూల శక్తిని ప్రవహించేలా చేస్తాయి. ఇది ఆర్థిక సమస్యలను తొలగించి ధన ప్రవాహాన్ని పెంచుతుంది. ఈ క్రింది దశలను అనుసరించడం ద్వారా ఇంటికి సంపద, శ్రేయస్సును ఆకర్షించవచ్చునని నిపుణులు చెబుతున్నారు. అవేంటో తెలుసుకుందాం..

దక్షిణ దిశ:

ఇవి కూడా చదవండి

మీ ఇంట్లో ధన ప్రవాహాన్ని పెంచాలనుకుంటే.. అంటే మీ ఇంట సంపద ప్రవహించాలని కోరుకుంటే.. ఇంటి దక్షిణ దిశలో పసుపు రంగు బంతిని (పసుపు రంగులో ఉన్న బంతి పువ్వులను) ఉంచండి. ఇలా చేయడం ద్వారా డబ్బు ప్రవాహం పెరుగడం చూస్తారు. ఈ చిన్న పని మీకు అధిక లాభాన్ని తెచ్చిపెడుతుందని వాస్తు శాస్త్రం పేర్కొంది.

తూర్పు దిశ:

ఇంటికి తూర్పు దిశలో ఒక చిన్న క్రిస్టల్ చేపను ఉంచాలి. లేదంటే, మీరు వెండి చేపను కూడా ఉంచవచ్చు. ఇది మరింత శుభప్రదంగా ఉంటుంది. ఇది మీ ఇంటికి సంపదను ఆకర్షించడమే కాకుండా సానుకూల శక్తిని వ్యాపింపజేస్తుంది.

పశ్చిమ దిశ:

ఇంటి పశ్చిమ భాగాన్ని హనుమంతుడి నివాసంగా భావిస్తారు. హనుమంతుడికి చెందిన చిన్న గదను ఈ దిశలో ఉంచాలి. ఇది ఇంట్లోని అన్ని కష్టాలను దూరం చేస్తుంది. హనుమంతుడి ఆశీస్సులను అందిస్తుంది.

ఉత్తర దిశ:

ఇంటికి ఉత్తర దిశలో కుబేర విగ్రహాన్ని ఉంచాలి. ఇది సాధ్యం కాకపోతే కుబేరుడి చిత్రపటాన్ని ఉత్తర దిశలో ఉంచాలి.

ఈ వాస్తు నివారణలను పాటిస్తే ఆర్థిక సమస్యలు పరిష్కారమవుతాయి. మీ ఇంటిలో డబ్బు ప్రవాహం పెరుగుతుంది. కొత్త ఆదాయ మార్గాలు, అవకాశాలు కలిసి వస్తాయి. ఇది ఇంటికి ఆనందం, శ్రేయస్సు, సానుకూల వాతావరణాన్ని తెస్తుంది.

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి .