AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఉదయాన్నే ఖాళీ కడుపుతో నానపెట్టిన వాల్ నట్స్ తింటున్నారా..? ఏమౌతుందో తెలిస్తే…

మార్నింగ్‌ టైమ్‌లో మనం తినే ఆహారం ఆరోగ్యకరమైనదిగా ఉండాలని నిపుణులు పదే పదే చెబుతుంటారు. ఇది మన పూర్తి ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. రోజంతా పని చేయడానికి శక్తిని అందిస్తుంది. అలాంటి ఆహార పదార్థం వాల్ నట్. మెదడును పోలి ఉండే ఈ డ్రై ఫ్రూట్ అనేక పోషకాలతో సమృద్ధిగా ఉంటుంది. అందువల్ల, ప్రతి ఉదయం దీనిని తినడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. కావాలంటే మీరు దీనిని బాదం లాగా రాత్రిపూట నీటిలో నానబెట్టి ఉదయాన్నే తినవచ్చు. లేదా మీరు పాలతో కూడా తినవచ్చు. ఉదయాన్నే వాల్ నట్స్‌ తినటం వల్ల కలిగే లాభాలు, వాటిలోని పోషకాల గురించి మరింత సమాచారం ఇక్కడ చూద్దాం..

ఉదయాన్నే ఖాళీ కడుపుతో నానపెట్టిన వాల్ నట్స్ తింటున్నారా..? ఏమౌతుందో తెలిస్తే...
Walnuts
Jyothi Gadda
|

Updated on: Oct 25, 2025 | 9:32 PM

Share

వాల్‌నట్స్ ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలకు గొప్ప మూలం. డ్రైఫ్రూట్స్‌లో అత్యంత శక్తివంతమైనది. వీటిని ఆక్రోట్లు అని కూడా పిలుస్తారు.. వీటిని తరచూ తీసుకోవడం వల్ల బోలెడు ఆరోగ్యలాభాలు ఉన్నాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఇది మెదడు ఆకారంలో ఉండే ఒకరకమైన డ్రై ఫ్రూట్‌. ఇందులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వాల్‌నట్స్‌లో ఉండే అధిక పోషక విలువ వల్ల దీనిని ‘బ్రెయిన్ ఫుడ్’ అని కూడా పిలుస్తారు. ఇది ఆరోగ్యకరమైన గుండెకు అవసరమైన ఆరోగ్యకరమైన కొవ్వు రకం. గుండె జబ్బులను నివారించడంలో సహాయపడుతుంది.

వాల్‌నట్స్‌లో పోషకాలు పుష్కలంగా నిండి ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, యాంటీఆక్సిడెంట్స్, ఫైబర్, ఇంకా విటమిన్లు సమృద్ధిగా ఉంటాయి. తరచూ వీటిని ఆహారంలో బాగంగా తీసుకుంటే ఆరోగ్యపరంగా చాలా మేలు జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. వాల్‌నట్స్ వల్ల కలిగే లాభాలు ఏంటో ఇక్కడ తెలుసుకోండి.

వాల్‌నట్స్‌లో విటమిన్ E, మెలటోనిన్, పాలీఫెనాల్స్ ఉంటాయి. ఇవి కణాల నష్టాన్ని తగ్గిస్తాయి. వాల్‌నట్స్ తింటే LDL (చెడు) కొలెస్ట్రాల్ తగ్గుతుంది. గుండె పనితీరుకు సహాయపడే ALA కూడా ఇందులో ఉంది. వాల్‌నట్స్‌లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మెదడును రక్షిస్తాయి. జ్ఞాపకశక్తిని పెంచి, మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.

ఇవి కూడా చదవండి

వాల్‌నట్స్‌లో పాలీఫెనాల్స్ ఉంటాయి. ఇవి పేగులోని బ్యాక్టీరియాను మార్చి వాపును తగ్గిస్తాయి. వాల్‌నట్స్ మంచి బ్యాక్టీరియాను పెంచుతాయి. దీనివల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. వాల్‌నట్స్ ఆకలిని నియంత్రిస్తాయి. దీనివల్ల అనారోగ్యకరమైన ఆహారం తినాలనే కోరిక తగ్గుతుంది.

వాల్‌నట్స్‌లోని పోషకాలు మెదడుకు మేలు చేస్తాయి. జ్ఞాపకశక్తిని పెంచుతాయి. పునరుత్పత్తి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. వాల్‌నట్స్ స్పెర్మ్‌ను ఆక్సీకరణ నష్టం నుంచి కాపాడతాయి. ఇది పురుషుల సంతానోత్పత్తికి సహాయపడుతుంది. వాల్‌నట్స్‌ను ఆహారంలో చేర్చుకోవడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది.

వాల్‌నట్స్‌లో ఉండే ప్రోటీన్ శరీరానికి కావాల్సిన శక్తిని అందిస్తుంది. వాల్‌నట్స్‌లో ఉండే యాంటీ క్యాన్సర్ గుణాలు కొన్ని రకాల క్యాన్సర్‌లను నిరోధించడంలో సహాయపడతాయి. వాల్‌నట్స్‌లో ఉండే కాల్షియం ఎముకలను దృఢంగా తయారు చేస్తాయి.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

గాల్లోనే కుప్పకూలుతున్న పక్షులు.. రోజుకు100కుపైగా మృత్యువాత
గాల్లోనే కుప్పకూలుతున్న పక్షులు.. రోజుకు100కుపైగా మృత్యువాత
‘మన శంకర వరప్రసాద్ గారు’.. చిరు, వెంకీ, నయన్‌ల రెమ్యునరేషన్స్ ఇవే
‘మన శంకర వరప్రసాద్ గారు’.. చిరు, వెంకీ, నయన్‌ల రెమ్యునరేషన్స్ ఇవే
షట్టిల ఏకాదశినాడు చేసే ఈ తప్పులు శాపంగా మారవచ్చు! ఏం చేయాలంటే?
షట్టిల ఏకాదశినాడు చేసే ఈ తప్పులు శాపంగా మారవచ్చు! ఏం చేయాలంటే?
మన శంకర వర ప్రసాద్ సినిమాను మిస్ చేసుకున్న స్టార్ హీరో ఎవరో తెలుస
మన శంకర వర ప్రసాద్ సినిమాను మిస్ చేసుకున్న స్టార్ హీరో ఎవరో తెలుస
'ఒక్కపూట అన్నం పెట్టినందుకు.. నన్ను పెట్టి రూ. 3 కోట్ల సినిమా..
'ఒక్కపూట అన్నం పెట్టినందుకు.. నన్ను పెట్టి రూ. 3 కోట్ల సినిమా..
వేలు విరగొట్టుకున్న స్టార్ ప్లేయర్.. షాక్ తిన్న ముంబై
వేలు విరగొట్టుకున్న స్టార్ ప్లేయర్.. షాక్ తిన్న ముంబై
వాషింగ్ మెషీన్‌లో ఉన్ని స్వెటర్‌ను ఎలా ఉతకాలి? సింపుల్ టిప్స్
వాషింగ్ మెషీన్‌లో ఉన్ని స్వెటర్‌ను ఎలా ఉతకాలి? సింపుల్ టిప్స్
కిడ్నీల్లో రాళ్లను పిప్పి పిప్పి చేసే దివ్యౌషధం..
కిడ్నీల్లో రాళ్లను పిప్పి పిప్పి చేసే దివ్యౌషధం..
ఇస్రో PSLV-C62 ప్రయోగం విఫలం.. 4వ దశలో కనిపించని రాకెట్‌ ఆచూకీ
ఇస్రో PSLV-C62 ప్రయోగం విఫలం.. 4వ దశలో కనిపించని రాకెట్‌ ఆచూకీ
'ఆంటీ' అని పిలిస్తే అస్సలు ఊరుకోను.. వాళ్లు మాత్రమే.!
'ఆంటీ' అని పిలిస్తే అస్సలు ఊరుకోను.. వాళ్లు మాత్రమే.!