- Telugu News Photo Gallery 5 people who should never eat papaya: Health risks you should know in telugu
బీ కేర్‌ఫుల్.. వీరు బొప్పాయి అస్సలు తినకూడదు..! తింటే డేంజర్‌లో పడినట్లే..
బొప్పాయి పండు ప్రతి సీజన్‌లోనూ చవకగా దొరికే మంచి పోషకపండు. దీన్ని చాలా మంది ఇష్టంగా తింటారు. బొప్పాయి సలాడ్, బొప్పాయి జ్యూస్ ఇలా రకరకాలుగా తీసుకుంటారు. దీని రుచి తియ్యగా మధురంగా ఉంటుంది. బొప్పాయి పండులో ఉన్న పోషకాలు మరే ఫ్రూట్‌లో కూడా లేవంటారు ఆరోగ్య నిపుణులు. కుదిరినప్పుడల్లా బొప్పాయి పండుని తీసుకోవడం వల్ల శరీరానికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. అయితే, ఎన్నో ఆరోగ్య ప్రయోజాలున్నప్పటికీ కొందరు ఈ పండును తినకూడదని నిపుణులు చెబుతున్నారు. కొన్ని అనారోగ్య సమస్యలు ఉన్నవారు ఈ పండు జోలికి పోకూడదంటున్నారు ఆరోగ్య నిపుణులు.
Updated on: Oct 24, 2025 | 8:58 PM

Papaya

ప్రస్తుత రోజుల్లో చాలా మంది లేటెక్స్ అలెర్జీ సమస్యతో బాధపడుతున్నారు. అలాంటి వారు బొప్పాయికి దూరంగా ఉండాలి. ఒకవేళ తింటే అలర్జీ వచ్చే అవకాశం ఉంది. దాంతో దద్దుర్లు, తుమ్ములు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది , శరీరంలో వాపు వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

బొప్పాయిలో విటమిన్ సి అధికంగా ఉంటుంది కాబట్టి కడ్నీల్లో రాళ్లు ఉన్నవారు తినకపోవడం మంచిది. ఒకవేళ తింటే కిడ్నీల్లో రాళ్ల పరిమాణం మరింత పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి బొప్పాయి అవాయిడ్ చేయడం మంచిది.

బొప్పాయి గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహకరిస్తుంది. అయితే ఏదైనా గుండె జబ్బుతో బాధపడేవారు మాత్రం బొప్పాయి తినకపోవడం మంచిది. ఎందుకంటే బొప్పాయిలో హృదయ స్పందనలు సక్రమంగా ఉండకుండా చేసే కొన్ని పదార్థాలు ఉంటాయి.

బొప్పాయి షుగర్ రోగులకు ఎంతో ఉపయోగకరం. అయితే చక్కెర స్థాయి తక్కువగా ఉన్నవారు లేదా హైపోగ్లైసీమియాతో బాధపడుతున్నవారు వైద్యుడి సలహాతో బొప్పాయిని తినాలి ఎందుకంటే ఇది గ్లూకోజ్ స్థాయిని తగ్గిస్తుంది.




