- Telugu News Photo Gallery Cinema photos Actress Rukmini vasanth shared her latest photos , goes viral
ఎంత ముద్దుగా ఉందో.. కుందనపు బొమ్మలా మెరిసిన రుక్మిణి వసంత్..
కన్నడలో సూపర్ హిట్ అయిన సినిమా సప్త సాగరాలు దాటి సినిమా. ఇందులో రక్షిత్ శెట్టి హీరోగా నటించగా.. కథానాయికగా అందరి దృష్టిని ఆకర్షించింది రుక్మిణి వసంత్. బీర్బల్ సినిమాతో హీరోయిన్ గా తెరంగేట్రం చేసిన ఈ వయ్యారి హిందీలో అప్ స్టైర్స్ అనే సినిమాలో నటించింది.
Updated on: Oct 24, 2025 | 8:53 PM

కన్నడలో సూపర్ హిట్ అయిన సినిమా సప్త సాగరాలు దాటి సినిమా. ఇందులో రక్షిత్ శెట్టి హీరోగా నటించగా.. కథానాయికగా అందరి దృష్టిని ఆకర్షించింది రుక్మిణి వసంత్. బీర్బల్ సినిమాతో హీరోయిన్ గా తెరంగేట్రం చేసిన ఈ వయ్యారి హిందీలో అప్ స్టైర్స్ అనే సినిమాలో నటించింది.

మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్న ఈ వయ్యారికి ఇప్పుడు సోషల్ మీడియా భారీ ఫాలోయింగ్ వచ్చేసింది. సప్త సాగరాలు దాటి సినిమాతో సౌత్ ఇండస్ట్రీలో ఒక్కసారిగా ఫేమస్ అయ్యింది ఈ హీరోయిన్. ఈ సినిమా ఆమెకు స్టార్ ఇమేజ్ తెచ్చిపెట్టింది.

దీంతో తెలుగుతోపాటు కన్నడలోనూ ఈ బ్యూటీకి వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి. కన్నడలో శ్రీమురళీకి జోడిగా భఘీర చిత్రంలో నటించింది. ఈ సినిమా పర్లేదు అనిపించుకుంది.. అలాగే నిఖిల్ సరసన అప్పుడో ఇప్పుడో ఎప్పుడో చిత్రంలో నటించింది.

ప్రస్తుతం కన్నడ, తెలుగులో మరిన్ని ఆఫర్స్ అందుకుంది. ఇటీవలే తమిళంలో విజయ్ సేతుపతి జోడిగా ఏస్ అనే సినిమాలో నటించింది. ఇక ఇప్పుడు ఎన్టీఆర్ నటిస్తున్న డ్రాగన్ సినిమాలోనూ ఛాన్స్ దక్కించుకుందని టాక్. ప్రశాంత్ నీల్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.

సోషల్ మీడియాలో ఈ ముద్దుగుమ్మ చాలా యాక్టివ్ గా ఉంటుంది. తాజాగా రుక్మిణి తన ఇన్ స్టాలో షేర్ చేసిన ఫోటోస్ తెగ వైరలవుతున్నాయి. కవ్వించే కళ్లు.. నిషా చూపులతో చంపేస్తోంది ఈ చిన్నది. ప్రస్తుతం ఈ అమ్మడు ఫోటోలు చూసి ఫిదా అవుతున్నారు ఫ్యాన్స్.