Viral Video: మదర్ ఆఫ్ ది ఇయర్.. మొద్దు నిద్రపోతున్న పిల్లలు.. బద్దకానికి భలే ట్రీట్మెంట్ ఇచ్చిందిగా..
స్కూళ్లు, కాలేజీలు లేవంటే పిల్లలు మంచానికే పరిమితం అవుతుంటారు. చాలా మంది ఇళ్లలో ఇలాగే జరుగుతుంది. అమ్మ ఎంతలేపినా పది నిమిషాలు, ఐదు నిమిషాలు అంటూ అలాగే మొద్దు నిద్రపోతుంటారు. అలాంటి పిల్లల్ని నిద్రలేపేందుకు ఓ తల్లి చేసిన ఉపాయం ఇప్పుడు ఇంటర్‌నెట్‌ని కూడా మేల్కోనులా చేసింది. ఈ వీడియో చూసిన తర్వాత చాలా మంది తల్లీదండ్రులు సరైన గుణపాఠం అంటున్నారు. అమ్మ దగ్గర అన్ని సమస్యలకు పరిష్కారం ఉంటుందని చాలా మంది కామెంట్ చేశారు. ఇంతకీ ఆ తల్లీ ఏం చేసిందంటే..

సోషల్ మీడియాలో ఫన్నీ వీడియో ఒకటి విస్తృతంగా వైరల్ అవుతోంది. ఇది అందరూ తల్లులు నిజంగా ఎంత గొప్ప మేధావులో తెలియజేస్తుంది. ఈ వీడియోలో, ఒక తల్లి తన పిల్లలను ఉదయం నిద్ర లేపడానికి ఒక వింత పద్ధతిని అవలంబిస్తుంది. దాంతో పిల్లలు లేవటం కాదు.. ఏకంగా ఆ వీధి మొత్తం దద్ధరిల్లిపోయింది. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ సరైన పనంటూ కడుపుబ్బ నవ్వుకుంటున్నారు. ఇంతకీ ఆ త్లలి ఏం చేసిందంటే..
పిల్లలను నిద్రలేపడానికి ఓ తల్లి ఏకంగా బ్యాండ్ బృందాన్నిఇంటికి పిలిచింది. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయబడిన ఈ వీడియోలో మొదట పిల్లలు గాఢ నిద్రలో ఉన్నట్లు చూపిస్తుంది. తల్లి పదే పదే వారిని పిలుస్తుంది. కానీ, పిల్లలు కనీసం కదలను కూడా కదలకుండా నిద్రపోతారు. చివరికి, తన చాతుర్యాన్ని ఉపయోగించి ఆ తల్లి ఇంటర్నెట్‌లో సంచలనం సృష్టించిన పని చేసింది. వెంటనే ఇంటికి బ్యాండ్‌ను బాజా బృందాన్ని పిలిచింది. క్షణాల్లో ఇల్లు మొత్తం డ్రమ్స్ శబ్దంతో ప్రతిధ్వనించింది.
పిల్లలు భయంతో మేల్కొంటారు. వారి ముఖాలు స్పష్టంగా ఆశ్చర్యాన్ని చూపిస్తున్నాయి. అయితే, వారు మళ్ళీ పడుకున్నారు. ఈ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లైన ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్‌లో వైరల్ అవుతోంది. ఈ తల్లి సృజనాత్మకతను ప్రజలు ప్రశంసిస్తున్నారు.
వీడియో ఇక్కడ చూడండి..
View this post on Instagram
ఈ వీడియో చూసిన చాలా మంది తల్లుల వద్ద ప్రతి సమస్యకు పరిష్కారాలు ఉన్నాయంటూ రాశారు. మరికొందరు అలారాలు ఇకపై అవసరం లేదు, తల్లులు మాత్రమే అవసరమని అంటున్నారు. కొందరు సరదాగా ఈ తల్లి తెలివికి అవార్డు ఇవ్వాల్సిందే అంటున్నారు. మన తల్లులు ఈ ఉపాయాన్ని ఉపయోగించి మనల్ని మేల్కొల్పే రోజు ఎంతో దూరంలో లేదు అని కూడా చాలా మంది రాశారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..




