Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Summer: ఇంట్లో కూలర్ వినియోగిస్తున్నారా? ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి.. లేదంటే ప్రమాదమే..!

వేసవి కాలం వచ్చేసింది. ఈ సీజన్ లో ఫ్యాన్ గాలి వేడితో పోటీ పడలేనంతగా ఉష్ణోగ్రత పెరుగుతుంది. ఈ వేడిని తట్టుకోవడానికి కూలర్, ఏసీ కావాలి. అయితే అందరూ AC కొనుగోలు చేయలేరు. చాలా మంది ప్రజలు కూలర్‌ను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. ఏసీతో పోలిస్తే కూలర్ తక్కువ ధరకే వస్తుంది. దీని వల్ల కరెంటు బిల్లు కూడా చాలా తక్కువగా వస్తుంది.

Summer: ఇంట్లో కూలర్ వినియోగిస్తున్నారా? ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి.. లేదంటే ప్రమాదమే..!
Cooler
Follow us
Shiva Prajapati

|

Updated on: Mar 28, 2023 | 7:30 AM

వేసవి కాలం వచ్చేసింది. ఈ సీజన్ లో ఫ్యాన్ గాలి వేడితో పోటీ పడలేనంతగా ఉష్ణోగ్రత పెరుగుతుంది. ఈ వేడిని తట్టుకోవడానికి కూలర్, ఏసీ కావాలి. అయితే అందరూ AC కొనుగోలు చేయలేరు. చాలా మంది ప్రజలు కూలర్‌ను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. ఏసీతో పోలిస్తే కూలర్ తక్కువ ధరకే వస్తుంది. దీని వల్ల కరెంటు బిల్లు కూడా చాలా తక్కువగా వస్తుంది. ఇల్లు కూడా చల్లబడుతుంది. మీరు కూడా ఇంట్లో కూలర్‌ను పెట్టుకోవాలనే ఆలోచనలో ఉన్నట్లయితే.. కొన్ని కీలక విషయాలు తప్పక తెలుసుకోవాల్సి ఉంది. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

వైర్‌ని చెక్ చేయాలి..

మీ ఇంట్లో ఇంతకు ముందే కూలర్ ఉన్నట్లయితే.. ఈ వేసవికి దానిని రీ ఓపెన్ చేస్తున్నట్లయితే ముందుగా దాని వైర్‌ని చెక్ చేయండి. కూలర్ అమర్చే ముందు వైర్‌ని చెక్ చేసి పెట్టండి. నెలల తరబడి పక్కకు పెట్టడి ఉంచడం వల్ల కూలర్ వైర్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. ఏదైనా డ్యామేజీ ఉంటే.. విద్యుత్ షాక్ వచ్చే ప్రమాదం ఉంది. అందుకే.. కూలర్‌ని సెట్ చేసే ముందు.. అందులోని వైర్లన్నీ సరిగా ఉన్నాయో లేదో చెక్ చేయడం ముఖ్యం.

ఇవి కూడా చదవండి

గడ్డిని మార్చాలి..

కూలర్‌లో గడ్డి వాడటం ఎంత ముఖ్యమో మనందరికీ తెలిసిందే. అయితే, ఈ గడ్డి ఎక్కువ కాలం వినియోగించినట్లయితే.. దానిపై దుమ్ము పేరుకుపోతుంది. దీని కారణంగా ఇబ్బంది ఏర్పడొచ్చు. అందుకే గడ్డిని మార్చాలి. లేదా క్రమం తప్పకుండా శుభ్రం చేయాలి.

వెంటిలేషన్‌ వద్ద పెట్టాలి..

కూలర్‌ను ఏర్పాటు చేసే ముందు వెంటిలేషన్‌పై శ్రద్ద పెట్టాలి. కూలర్ నుంచి చల్లటి గాలి రావాలంటే.. వెంటిలేషన్ వద్ద పెట్టడం ఉత్తమం. కూలర్ పెట్టిన చోట ఖాళీ స్థలం ఉండాలి. ఇందుకోసం కూలర్‌ని ఒక కటిటీ వద్ద పెట్టడం ఉత్తమం. అలా చేస్తే చల్లటి గాలి వస్తుంది.

పైపులను సరి చూసుకోవాలి..

కూలర్ నుంచి చలిగాలి రావడంలో అందులోని వాటర్ పైప్స్ చాలా కీలకం. మోటార్ సహాయంతో నీటిని కూలింగ్ ప్యాడ్ వరకు తీసుకెళ్తుంది. ఈ పైపులు వంగినా, పాడైపోయినా దానిలో దుమ్ముదూళి చేరినా కూలర్ కూలింగ్ పని చేయదు. అందుకే కూలర్ స్టార్ట్ చేసే ముందు పైపును ఒకసారి చెక్ చేసుకోవాలి.

మరికొన్ని కీలక విషయాలు..

కూలర్‌ను నడపడానికి ముందు ఎలక్ట్రీషియన్‌తో ఒకసారి చెక్ చేయించాలి. సొంతంగా రిపేర్ చేసుకోవడం కరెక్ట్ కాదు. అలాగే కూలర్ బాడీ సరైనదా కాదా అనే దానిపై కూడా శ్రద్ధ వహించాలి. కొన్నిసార్లు కూలర్ బాడీ తుప్పు పట్టిపోతుంది. తద్వారా కూలర్ నుంచి వాటర్ బయటకు వస్తుంది. అలాంటి పరిస్థితిలో విద్యుత్ షాక్ కొట్టే ప్రమాదం ఉంది. ఇక చల్లని గాలి పొందడానికి కూలర్‌లో అధిక నీటిని నింపవద్దు. ఎక్కువ నీటిని నింపితే మోటారు త్వరగా పాడైపోతుంది.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి..