అంతరిక్ష కేంద్రంలో బేస్‌బాల్ ఆట జపాన్ వ్యోమగామి వీడియో వైరల్
అంతరిక్ష వార్తలు ఎప్పుడూ ఇంట్రెస్టింగ్‌గానే ఉంటాయి. ముఖ్యంగా ఇటీవల వ్యోమగాములు సునీత విలియమ్స్, బుల్ విల్మోర్ ఐఎస్‌ఎస్‌లో చిక్కుకున్నారనే వార్తలను ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తిగా గమనించారు. వారం రోజుల ట్రిప్ కోసం వెళ్లిన వారు తొమ్మిది నెలలు అక్కడే చిక్కుబడిపోవడంతో ఆసక్తిగా మారింది. ఎలాగోలా వారు భూమి మీదకు చేరుకోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.
అయితే వ్యోమగాములు ఎక్కడ ఉంటారు? ఏం తింటారు? ఎక్కడ నిద్రపోతారు? ఇలాంటి విషయాలు తెలుసుకోవడానికి సెర్చ్ చేశారు. ఈ క్రమంలో జపాన్‌కు చెందిన వ్యోమగామికి సంబంధించిన అంతరిక్ష ఆట ఇప్పుడు వైరల్‌గా మారింది. జపాన్‌కు చెందిన వ్యోమగామి కోయిచి వకట అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఉన్నప్పుడు బేస్‌బాల్ ఆడారు. ప్రపంచ కుబేరుడు, స్పేస్ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ ఈ వీడియోను ఎక్స్‌లో షేర్ చేశారు. ప్రస్తుతం ఇది నెట్టింట చక్కర్లు కొడుతోంది. జపాన్ ఏరోస్పేస్ ఎక్స్‌ప్లోరేషన్ ఏజెన్సీకి చెందిన వ్యోమగామి కోయిచి వకట ఐఎస్ఎస్‌లో ఉన్నప్పుడు జీరో గ్రావిటీని ఉపయోగించి బేస్ బాల్ ఆడారు. తానే బాల్ విసిరి మళ్లీ తానే షాట్ కొట్టిన వీడియోను కోయిచి షేర్ చేశారు. ‘ఇది బేస్‌బాల్ సీజన్. మేజర్ లీగ్ బేస్‌బాల్ సీజన్ జపాన్‌లో ప్రారంభమవుతోంది. ఎక్స్‌పెడిషన్ 68 సమయంలో ఐఎస్ఎస్‌లో బేస్‌బాల్ ఆడాను. జీరో గ్రావిటీలో ఈ ఆట ఆడేందుకు జట్టుతో పని లేదు’ అని ఆయన పోస్టుకి క్యాప్షన్ పెట్టారు. ఈ వీడియోను మస్క్ రీపోస్టు చేశారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఒక్కసారిగా ఎక్కువ నీరు తాగితే ఏమవుతుందో తెలుసా..?
Whatsapp: ఫోటో కొట్టు.. వీడియో పట్టు.. వాట్సాప్‌లో మరో అమేజింగ్ ఫీచర్
తెల్లవారుజామున వేంకటేశ్వరస్వామి ఆలయంలో అద్భుత ఘటన.. నెట్టింట వీడియో వైరల్
కనిపించడు కానీ, ఆటగాడే..! లవ్‌లో పడ్డ సిరాజ్ ??
భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్న వ్యక్తి.. సీన్ కట్ చేస్తే.. భర్త ఏం చేసాడంటే ?

కశ్మీర్లో TRF నరమేథం..దాని పుట్టుక వెనుక కథ ఏంటి? వీడియో

10 గ్రాముల బంగారం కాయిన్ కొంటే.. రూ.20వేలకు పైగా ఆదా వీడియో

ప్రళయానికి దగ్గరలో ప్రపంచం..! నిజమవుతున్న బ్రహ్మంగారి కాలజ్ఞానం..

వెయిట్ లాస్ ఇంజెక్షన్లతో యమ డేంజరా !! బరువు తగ్గాలనుకుంటే బలేనా ?
