భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్న వ్యక్తి.. సీన్ కట్ చేస్తే.. భర్త ఏం చేసాడంటే ?
భారత సంస్కృతిలో వివాహ వ్యవస్థ బలహీనపడుతోందా అంటే.. అవుననే అనిపిస్తోంది. రోజు రోజుకీ వివాహ బంధానికి విలువ లేకుండా పోతోంది. మానవ సంబంధాలు మంటగలిసిపోతున్నాయి. పెచ్చుమీరిన అక్రమసంబంధాలతో మనుషులు కర్కశంగా మారుతున్నారు. ఈ క్రమంలో ప్రాణాలు కోల్పోతున్నారు. ఇలాంటి ఘటనలు ఎన్నో ప్రతిరోజూ ఎక్కడో అక్కడ వెలుగుచూస్తూనే ఉన్నాయి.
తాజాగా అలాంటి ఘటనే హర్యానాలో జరిగింది. తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్న ఓ వ్యక్తిని ఆమె భర్త సజీవంగా సమాధి చేసేసాడు. స్థానికంగా ఈ ఘటన సంచలనం రేపింది. హర్యానాలోని చక్రిదాద్రిలో ఈ ఘటన జరిగింది. తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడన్న కారణంతో యోగా టీచర్‌ను ఓ వ్యక్తి ఏడడుగుల గొయ్యిలో సజీవంగా పాతిపెట్టాడు. బాధితుడు జగదీప్ రోహ్‌తక్‌లోని ఓ ప్రైవేటు యూనివర్సిటీలో యోగా టీచర్. ఆయనను కిడ్నాప్ చేసిన నిందితుడు ఏడుగుల గొయ్యి తీసి అందులో అతడిని సజీవంగా పాతిపెట్టాడు. మూడు నెలల తర్వాత మార్చి 24న జగదీప్ మృతదేహాన్ని పోలీసులు వెలికి తీశారు. పోలీసుల కథనం ప్రకారం.. డిసెంబర్ 24న యోగా టీచర్ జగదీప్ ఇంటికి వస్తుండగా నిందితుడు ఆయనను కిడ్నాప్ చేశాడు. కాళ్లు, చేతులు కట్టేశాడు. ఆపై అరవకుండా నోటికి ప్లాస్టర్ వేశాడు. అనంతరం ఓ నిర్మానుష్య ప్రాంతానికి తీసుకువెళ్లి అప్పటికే సిద్ధం చేసిన గోతిలో ఆయనను సజీవంగా పాతిపెట్టాడు. జగదీప్ కనిపించడం లేదంటూ కేసు నమోదు కావడంతో పోలీసులు రంగంలోకి దిగారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రాత్రైదంటే వింత శబ్దాలు.. ఊరంతా భయం తో రచ్చ రచ్చ..
పరగడుపున.. ఈ నీటితో ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో
ఇదేం పెళ్లాంరా బాబోయ్.. మొగుడిపై కోపంతో దాన్ని అలా కొరికేసిందేంటి !!
పొదుపు చేయలేదు.. జాబ్ పోయింది.. టెకీ ఆవేదన
ప్రాణాలకు తెగించి వృద్ధ దంపతుల వీరోచిత పోరాటం
మెస్సికి కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చిన అనంత్ అంబానీ..
నీరు తోడుతుండగా వచ్చింది చూసి.. పరుగో పరుగు..
జోరు వానలో చిక్కుకున్న ఏనుగు.. గొడుగుగా మారిన తల్లి ఏనుగు..
6 నెలలు చికెన్ మాత్రమే తిన్న యువతి.. చివరకు ఆస్పత్రిలో చేరి..
తవ్వకాల్లో బయటపడ్డ దుర్గమాత విగ్రహం

