ఇదేం పెళ్లాంరా బాబోయ్.. మొగుడిపై కోపంతో దాన్ని అలా కొరికేసిందేంటి !!
భార్యాభర్తల మధ్య తరచుగా గొడవలు జరగడం.. ఆ తర్వాత ఇద్దరూ సర్దుకు పోవడం సహజం. కానీ కొందరు మాత్రం నువ్వెంత అంటే నువ్వెంత అన్నట్టుగా పోట్లాడుకుంటారు. చివరికి కొట్టుకునేవరకూ వెళ్తారు. అలాంటి సంఘటనలూ తరచూ మనం చూస్తుంటాం. తాజాగా అలాంటి సంఘటనే ఒకటి రాజస్థాన్‌లో జరిగింది. దంపతుల మధ్య తలెత్తిన గొడవ వారిద్దరినీ ఆస్పత్రిపాలు చేసింది.
కోపంలో భర్త నాలుకను కొరికేసి.. ఆ తర్వాత ఆమె కూడా ఆత్మహత్యకు యత్నంచింది. అలా ఇద్దరూ ఆస్పత్రి పాలయ్యారు. ఈ వార్త స్థానికంగా కలకలం రేపడమే కాదు.. నెట్టింట వైరల్‌గా మారింది. రాజస్థాన్‌లోని ఝలావర్ జిల్లా బకాని పట్టణంలో ఈ షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. బకానీ పట్టణానికి చెందిన కన్హయ్యలాల్ సైన్ , సమీపంలోని సునేల్ గ్రామానికి చెందిన రవీనా సైన్ ఏడాదిన్నర క్రితం వివాహం చేసుకున్నారు. ఈ దంపతుల మధ్య తరచూ తగాదాలు జరిగేవి. ఈ క్రమంలోనే మార్చి 20 గురువారం రోజున ఈ జంట ఏదో విషయంలో మళ్లీ గొడవ పడ్డారు. అది చినికి చినికి గాలివానగా మారి, పరస్పరం దాడి చేసుకున్నారు. ఈ క్రమంలోనే తీవ్ర కోపానికి గురైన భార్య భర్త నాలుకను కొరికేసింది. గాయపడిన కన్హయ్యలాల్‌ను అతని కుటుంబ సభ్యులు స్థానిక ఆసుపత్రికి తరలించారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఎముకల బలానికి ఇది సూపర్ ఫుడ్.. మధుమేహంతో బాధపడేవారికి కూడా ఇది ఒక మంచి ఆప్షన్
సునీత లానే అంతరిక్షంలో చిక్కుకున్న ‘హీరో’
అరె భయ్యా.. పాము అనుకున్నావా..? పొట్ల కాయ అనుకున్నావా?
ఆంధ్రా స్కూళ్లల్లో.. వాటర్ బెల్ విధానం అమలు
ఏటీఎం నుంచి పదే పదే డబ్బులు తీసే అలవాటుందా ?? మే 1 నుంచి మారనున్న ఈ నిబంధనలు తెలుసుకోవాల్సిందే